Skip to main content

T-SAT Free Online Coaching: ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఉచితంగా టీశాట్‌ ప్రసారాలు

సాక్షి, హైదరాబాద్‌: స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా భర్తీ చేస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇస్తున్నట్లు టీ–శాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.
T SAT to provide online coaching classes for SSC constable  T-SAT CEO Bodanapally Venugopal Reddy announces online coaching for Police Constable jobs Online coaching session for candidates preparing for Police Constable jobs. Announcement of T-SAT online coaching schedule from October 21 to January 31 online classes for Police Constable job preparation

అక్టోబర్ 21 నుంచి జనవరి 31 వరకు టీ–శాట్‌ నెట్‌వర్క్‌ చానళ్ల ద్వారా కంటెంట్‌ ఇస్తామన్నారు. 39,481 జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ గతనెల 6న నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తెలంగాణకు 718, ఏపీకి 908 పోస్టులు కేటాయించిందన్నారు. అరగంట నిడివితో 448 ఎపిసోడ్స్, 112 రోజులు టీ–శాట్‌ చానళ్లు, యూట్యూబ్, యాప్‌ ద్వారా కంటెంట్‌ ప్రసారం చేస్తామన్నారు.

చదవండి: TSAT: 50 వేల ప్రశ్నలతో ఆన్ లైన్ క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మేథమెటిక్స్‌ లను ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. ప్రసారాలు టీ–శాట్‌ నిపుణ చానల్‌ లో అక్టోబర్ 21న సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, మరుసటి రోజు ఉదయం విద్య చానల్‌లో 5 గంటల నుంచి 7 వరకు ప్రసారమవుతాయన్నారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

గ్రూప్‌–3 పరీక్షలకు మరో రెండు గంటలు 

టీజీపీఎస్సీ భర్తీ చేస్తున్న 1,388 గ్రూప్‌–3 పోస్టుల పరీక్షలకు కంటెంట్‌ను మరో రెండు గంటలు అదనంగా ఇవ్వనున్నట్లు సీఈవో వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రెండు గంటల కంటెంట్‌ ప్రసారం చేస్తుండగా అక్టోబర్‌ 21 నుంచి నవంబర్‌ 16 వరకు రోజూ 4 గంటలపాటు ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. 

Published date : 21 Oct 2024 12:42PM

Photo Stories