Indian Polity Bit Bank: అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు?
1. వివిధ ప్రకరణలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ప్రకరణ 43ఎ – కార్మికులకు యాజ మాన్యంలో భాగస్వామ్యం కల్పించడం
బి) ప్రకరణ 43బి: సహకార సంఘాలను ప్రోత్సహించడం
సి) ప్రకరణ 48ఎ – అడవులు, వన్య్రపాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలి
డి) ప్రకరణ 39ఎ – సమన్యాయం, ఉచిత న్యాయ సహాయం
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, బి, డి
4) ఎ, బి, సి, డి
- View Answer
- Answer: 4
2. స్పీకర్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) స్పీకర్‌ను రాష్ట్రపతి తొలగించవచ్చు
2) ఎన్నిక సమయంలో స్పీకర్ సభలో సభ్యుడు కానవసరం లేదు. కానీ నియమించిన ఆరు నెలల్లో పార్లమెంట్‌కు ఎన్నికవ్వాలి
3) సభ సాధారణ కాలపరిమితి కంటే ముందే రద్దయితే దానితో పాటే స్పీకర్ కూడా తన పదవిని కోల్పోతారు
4) రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి
- View Answer
- Answer: 4
3. కింది వాటిలో భారత ఎన్నికల సంఘం విధులు ఏవి?
ఎ) లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్య సభ ఉపాధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడం
బి) కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ
సి) ఎన్నికలకు సంబంధించిన అనుమానాలు, వివాదాలపై నిర్ణయం
1) ఎ, బి
2) ఎ, సి
3) బి, సి
4) పైవేవీకావు
- View Answer
- Answer: 4
4. అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) జాకీర్ హుస్సేన్
3) జ్ఞానీ జైల్ సింగ్
4) ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
- View Answer
- Answer: 2
5. రాజ్యసభ ద్రవ్యబిల్లుకు సవరణలు సూచించినప్పుడు..?
1) లోక్‌సభ ఆ సవరణలను ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు
2) లోక్‌సభ ఆ ద్రవ్య బిల్లును వదిలేస్తుంది
3) లోక్‌సభ ఆ ద్రవ్య బిల్లును రాజ్యసభకు పునఃపరిశీలనకు పంపిస్తుంది
4) రాష్ట్రపతి ఆ ద్రవ్య బిల్లు గురించి ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు
- View Answer
- Answer: 1
6. కింది వాక్యాల్లో సరైంది ఏది?
1) ఒక వ్యక్తిని ఏక కాలంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించరాదు
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించిన విధంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను గవర్నర్ నియమిస్తారు
3) గవర్నర్‌ను పదవి నుంచి తొలగించే విధానం రాజ్యాంగంలో పేర్కొనలేదు
4) కేంద్రపాలిత ప్రాంతాలకు శాసనసభ ఉంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మెజార్టీ పార్టీ నాయకుడిని సీఎంగా నియమిస్తారు
- View Answer
- Answer: 3
7. వివిధ ప్రకరణలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ప్రకరణ 123–ఆర్డినెన్సులను జారీ చేయడానికి రాష్ట్రపతికి ఉన్న అధికారం
బి) ప్రకరణ 213 – గవర్నర్ ఆర్డినెన్సును జారీ చేసే అధికారం
సి) ప్రకరణ 262 – అంతర్రాష్ట్రీయ మండలి ఏర్పాటు
1) ఎ, బి, సి
2) బి, సి
3) ఎ, బి
4) ఎ, సి
- View Answer
- Answer: 3
8. రాజ్యాంగ పరిషత్ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా – I
i) సార«థ్య సంఘం
ii) క్రెడెన్షియల్ కమిటీ
ii) ప్రాథమిక హక్కుల ఉపకమిటీ
iv) యూనియన్ పవర్స్ కమిటీ
జాబితా – II
a) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
b) రాజేంద్ర ప్రసాద్
c) జె.బి. కృపలానీ
d) జవహర్ లాల్ నెహ్రూ
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-b, ii-c, iii-a, iv-d
4) i-c, ii-a, iii-b, iv-d
- View Answer
- Answer: 1
9. అటార్నీ జనరల్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) లోక్‌సభ చర్చలో పాల్గొనవచ్చు
బి) లోక్‌సభ కమిటీ సభ్యుడు
సి) లోకసభలో మాట్లాడొచ్చు
డి) లోక్‌సభలో ఓటు వేయవచ్చు
1) ఎ మాత్రమే
2) బి, డి
3) ఎ, బి, సి
4) ఎ, సి
- View Answer
- Answer: 3
10. ‘భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతలను సమర్థించడం, సంరక్షించడం’లను దేనిలో పేర్కొన్నారు?
1) రాజ్యాంగ ప్రవేశిక
2) ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు
4) ప్రాథమిక విధులు
- View Answer
- Answer: 4
11. మొదటి ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?
1) కె. సంతానం
2) ఎ.కె. చాంద్
3) కె.సి. నియోగి
4) వై.బి. చవాన్
- View Answer
- Answer: 3
12. కింది వాటిలో అఖిల భారత సర్వీసులకు సంబంధించి నియామకాలు చేసేది?
1) రాష్ట్రపతి
2) ఏ రాష్ట్రానికి చెందితే ఆ రాష్ట్ర గవర్నర్లు
3) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
4) ఆయా రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
- View Answer
- Answer: 1
13. ‘జీరో అవర్’ అని దేన్ని అంటారు?
1) సభ ప్రారంభమైన తొలి గంట
2) సభ్యులు ఎవరూ హాజరుకాని సమయం
3) ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత, సభా కార్యక్రమాల ప్రారంభానికి ముందు ఉన్న సమయం
4) ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభానికి, సభా కార్యక్రమాల ముగింపునకు మధ్య సమయం
- View Answer
- Answer: 3
14. రాజ్యాంగ రిట్లలో ‘ఆజ్ఞ’ అనేది దేని అర్థం?
1) ప్రొహిబిషన్
2) మాండమస్
3) సెర్షియోరరి
4) కో వారెంటో
- View Answer
- Answer: 2
15. కేంద్రంలో ఏర్పాటైన మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏది?
1) జనతా ప్రభుత్వం
2) యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
3) నేషనల్ డెమొక్రటిక్ ప్రభుత్వం
4) నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
- View Answer
- Answer: 1
16. కింది వారిలో ఉన్నతాధికార, దౌత్య సంబంధ పదవులు చేపట్టి ఉపరాష్ట్రపతులుగా కొనసాగిన వారెవరు?
1) డా.ఎస్.రాధాకృష్ణన్
2) జి.ఎస్. పథక్
3) వి.వి. గిరి
4) బి.డి. జెట్టి
- View Answer
- Answer: 1
17. పీఠికలోని ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ’ అనే భావాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు?
1) రష్యా
2) ఫ్రెంచ్
3) అమెరికా
4) జర్మనీ
- View Answer
- Answer: 2
18. ‘సామ్యవాదం, లౌకికవాదం’ అనే పదాలను భారత రాజ్యాంగంలో ఎన్నో సవరణ ద్వారా చేర్చారు?
1) 44
2) 40
3) 38
4) 42
- View Answer
- Answer: 4
19. ‘కో వారెంటో’ అంటే..?
1) బంధీ ప్రత్యక్ష
2) అధికార పృచ్ఛ
3) పరమాదేశ
4) ఉత్ప్రేషణ
- View Answer
- Answer: 2
20. ‘స్థానిక సంస్థల పితామహుడు’ అని ఎవరిని పిలుస్తారు?
1) లార్డ్ రిప్పన్
2) లార్డ్ కానింగ్
3) లార్డ్ రిప్పన్
4) లార్డ్ మౌంట్ బాటన్
- View Answer
- Answer: 1
21. ‘ఒక తప్పునకు రెండుసార్లు శిక్షార్హం కాదు’ అని తెలిపే సిద్ధాంతం ఏది?
1) రిపగ్నసీ సిద్ధాంతం
2) ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం
3) గ్రహణ సిద్ధాంతం
4) రెట్రి బ్యూషన్ సిద్ధాంతం
- View Answer
- Answer: 2
22. కమిటీలు, అవి సిఫారసు చేసిన అంశాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా – I
i) బల్వంతరాయ్ మెహతా కమిటీ
ii) అశోక్ మెహతా కమిటీ
iii) సి.హెచ్. హనుమంతరావు కమిటీ
iv) ఎల్.ఎం. సింఘ్వి కమిటీ
జాబితా – II
a) రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు
b) జిల్లా ప్రణాళికా బోర్డుల ఏర్పాటు
c) మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు
d) పంచాయతీరాజ్ సంస్థలను రాజ్యాంగబద్ధం చేయాలి
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-c, ii-b, iii-a, iv-d
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- Answer: 3
23. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఏటా జనవరి 25న నిర్వహిస్తారు
బి) ఎన్నికల సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది
సి) ఎన్నికల సంఘం తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తుంది
డి) ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికీ సమర్పించాల్సిన అవసరంలేదు
1) ఎ, డి
2) బి, డి
3) ఎ, సి
4) సి, డి
- View Answer
- Answer: 1
24. కింది వాటిలో సమాఖ్య ప్రభుత్వ లక్షణాలు ఏవి?
ఎ) ఏక పొరసత్వం
బి) ద్వంద్వ ప్రభుత్వం
సి) లిఖిత రాజ్యాంగం
డి) ద్విసభా పద్ధతి
ఇ) ఒకే రాజ్యాంగం
ఎఫ్) కేంద్రం రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించడం
1) ఎ, బి, సి, ఎఫ్
2) బి, సి, డి
3) డి, ఇ, ఎఫ్
4) ఎ, సి, డి, ఇ
- View Answer
- Answer: 2
25. కింది వాటిలో ఏక కేంద్ర లక్షణాలు ఏవి?
ఎ) అఖిల భారత సర్వీసులు
బి) అత్యవసర అధికారాలు
సి) అధికార విభజన
డి) స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
ఇ) గవర్నర్ వ్యవస్థ
ఎఫ్) రాజ్యాంగేతర సంస్థలు
1) ఎ, బి, ఇ, ఎఫ్
2) బి, సి, డి
3) డి, ఇ, ఎఫ్
4) ఎ, సి, డి, ఇ
- View Answer
- Answer: 1
26. కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం – ఏప్రిల్ 24
బి) ప్రవాస భారతీయ దివస్ – జనవరి 9
సి) ప్రాథమిక విధుల దినోత్సవం – జనవరి 3
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, బి, సి
4) సి, డి
- View Answer
- Answer: 3
27. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీ కాలం ఎన్నేళ్లు?
1) రెండేళ్లు
2) మూడేళ్లు
3) నాలుగేళ్లు
4) ఐదేళ్లు
- View Answer
- Answer: 2
28. ప్రాంతీయ పార్టీలు, వాటి వ్యవస్థాపక అధ్యక్షులకు సంబంధించి కింది వాటిని జతపరచండి?
జాబితా – I
i) శివసేన
ii) ద్రవిడ మున్నేట్ర కజగం
iii) ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
iv) దేశీయ ముర్పొక్కు ద్రవిడ మున్నేట్ర కజగం
జాబితా – II
a) సి.ఎన్. అన్నాదురై
b) ఎం.జి. రామచంద్రన్
c) బాల్‌థాకరే
d) విజయ్‌కాంత్
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-c, ii-b, iii-a, iv-d
3) i-c, ii-a, iii-b, iv-d
4) i-d, ii-a, iii-b, iv-c
- View Answer
- Answer: 3
29. ప్రాంతీయ పార్టీలు, వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా – I
i) ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్
ii) అసోం గణ పరిషత్
iii) తెలంగాణ రాష్ట్ర సమితి
iv) తెలుగుదేశం పార్టీ
జాబితా – II
a) 2001
b) 1985
c) 1998
d) 1982
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-c, ii-b, iii-a, iv-d
3) i-b, ii-c, iii-a, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- Answer: 2
30. షెడ్యూల్ 12లో పేర్కొన్న అంశాలు ఎన్ని?
1) 19
2) 18
3) 29
4) 28
- View Answer
- Answer: 2
31. అధికరణ 136 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉన్న అధికారం?
1) సివిల్ జూరిస్డిక్షన్
2) అప్పిలేట్ జూరిస్డిక్షన్
3) స్పెషల్ లీవ్ పిటిషన్
4) ట్రాన్స్‌ఫర్డ్ జూరిస్డిక్షన్
- View Answer
- Answer: 3
32. ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం 2020 వరకు రిజర్వేషన్లు పొడిగించారు?
1) 77
2) 98
3) 95
4) 84
- View Answer
- Answer: 3
33. కింది వాటిలో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేనివారు?
1) లోక్‌సభ సభ్యులు
2) రాజ్యసభ సభ్యులు
3) ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు
4) రాష్ట్ర శాసన మండలి సభ్యులు
- View Answer
- Answer: 4
34. స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి?
1) ఆర్.కె. షణ్ముగం చెట్టి
2) జాన్ మత్తాయ్
3) సి.డి. దేశ్‌ముఖ్
4) టి.టి. కృష్ణమాచారి
- View Answer
- Answer: 1
35. వివిధ జాతీయ పార్టీలు, అవి ఏర్పాటైన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
జాబితా – I
i) బహుజన్ సమాజ్ పార్టీ
ii) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
iii) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
iv) భారతీయ జనతా పార్టీ
జాబితా – II
a) 1925
b) 1980
c) 1999
d) 1984
1) i-b, ii-a, iii-c, iv-d
2) i-a, ii-b, iii-c, iv-d
3) i-b, ii-c, iii-a, iv-d
4) i-d, ii-c, iii-a, iv-b
- View Answer
- Answer: 4
Tags
- indian polity bit bank for competitive exams
- Indian Polity Bit Bank
- indian polity bit bank in telugu
- indian polity mock test in telugu
- indian polity practice test
- indian polity practice test in telugu
- Indian Polity Bit Bank For All Competitive Exams
- TSPSC
- APPSC
- APPSC Bitbank
- Competitive Exams
- Competitive Exams Bit Banks
- police exam bit bank
- indian polity bit bank for group 1 exam
- indian polity bit bank for police exam
- indian polity bit bank in telugu for competitive exams
- Indian Polity Study Material
- TSPSC Study Material
- APPSC Study Material
- TSPSC Bit Bank
- sakshi education bit bank
- sakshi education jobs news
- sakshi education current affairs
- Current Affairs Practice Test