DSC 2024 Special Live Program: డీఎస్సీ పరీక్షలకు టీశాట్ లైవ్ ప్రోగ్రామ్స్
రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీ కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన కోసం స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్స్ ప్రదర్శిస్తున్నామన్నారు.
ఏప్రిల్ 18న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రోజుకు గంట పాటు వరుసగా తొమ్మిది రోజులు నిపుణ చానల్‌లో వివిధ సబ్జెక్టులపై ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలుంటాయని తెలిపారు.
చదవండి: డీఎస్సీ - టెట్ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్
మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్య చానల్‌లో సాయంత్రం 6 గంటలకు పునఃప్రసారమవుతాయని వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ కాల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు.