Good News for TET Candidates: ఉచితంగా TETపై ప్రత్యక్ష ప్రసారాలు, 200 ఎపిసోడ్స్ డొమైన్లో అందు బాటులో..
![Live broadcasts on TET](/sites/default/files/images/2024/05/15/tetonlineclasses-1715753565.jpg)
ఐదు సబ్జెక్టులపై మే 15వ తేదీ నుంచి 18 వరకు అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో టీసాట్లో ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయని మే 14న ఒక ప్రకటనలో తెలిపారు.
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 15న సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్ సైన్స్, మాథ్స్ సబ్జెక్ట్లపై ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయన్నారు.
చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | AP TET ప్రివియస్ పేపర్స్ | TS TET ప్రివియస్ పేపర్స్
ప్రసారాలు నిపుణ చానల్‌తోపాటు టీ– సాట్ విద్యా చానల్లో మరుసటి రోజు సాయ ంకాలం 5 నుంచి 6 గంటల వరకు పున:ప్రసా రమవుతాయని వివరించా రు.
ఇప్పటికే టెట్ అభ్యర్థుల కోసం 200 ఎపిసోడ్స్ టీ–సాట్ డొమైన్లో అందు బాటులో ఉన్నాయని, మరిన్ని వివరాలు, సందేహాలు–సమాధానాల కోసం 040–3540 326/726, టోల్ ఫ్రీ నంబరు1800 425 4039 కు ఫోన్ చేయొచ్చని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.