Skip to main content

Groups Exams 2022: అభ్యర్థుల కోసం టీశాట్‌ ప్రత్యేక కార్యక్రమం

special program for Groups candidates
special program for Groups candidates
  • నేడు ఐఏఎస్‌ అధికారి 
  • బుర్రా వెంకటేశంతో లైవ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌ ఉద్యోగాలు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు సలహాలు, సూచనలు అందించేందుకు టీశాట్‌ ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచి్చంది. సివిల్‌ సర్వీసుల్లో ఉన్న ప్రముఖులు, ఇతర ఉన్నతాధికారులతో లైవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆలిండియా సివిల్‌ సరీ్వసెస్‌లో 15వ ర్యాంకు సాధించి 27 ఏళ్లుగా సేవలందిస్తున్న బుర్రా వెంకటేశంతో లైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీశాట్‌ సీఈ వో ఆర్‌.శైలేశ్‌రెడ్డి తెలిపారు. ‘ఒక పనిలో విజ యం సాధించాలంటే ఎలా కృషి చేయాలో వివరిస్తూ ఇటీవలే ఆంగ్లంలో బుర్రా వెంకటేశం రచించిన ‘సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌’పుస్తకంలో తన అనుభవాలను పంచుకుని దాన్ని తెలుగు విభా గం విద్యార్థులకూ అందుబాటులో ఉండే లా ‘గెలుపు–పిలుపు’పేరుతో అనువదించార ని తెలిపారు. ఆయన సూచనలు గ్రూప్‌–1, పోలీసు, టెట్‌ ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు  ఉప యోగపడతాయని’ శైలేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Also read: Government Jobs : పోటీప‌రీక్ష‌ల‌కు .. పుస్తకాలు లేకపోతే ఎలా..?

Published date : 19 May 2022 03:34PM

Photo Stories