Skip to main content

Government Jobs : పోటీప‌రీక్ష‌ల‌కు .. పుస్తకాలు లేకపోతే ఎలా..?

రాకరాక ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. ఎలాగైనా ఫలితం సాధించాలనే లక్ష్యంతో నిరుద్యోగులు శక్తియుక్తులను ప్రయోగిస్తున్నారు.
competitive exams books
competitive exams books

పోటీలో నెగ్గేందుకు పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా వారికి కావాల్సిన పుస్తకాలు లభించక ఇక్కట్లు పడుతున్నారు. ప్రస్తుత పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో లేక.. మార్కెట్‌లో కొనుగోలు చేసే శక్తి లేక ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు గ్రంథాలయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో చదువు ముందుకు సాగడం లేదని వాపోతున్నారు.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

తాజా పుస్తకాలు లేకపోతే ఎలా..?
వచ్చేనెలలో వరుసగా పోటీ పరీక్షలు జరగనుండా, జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకునేందుకు ప్రతిరోజు 700 మందికి పైగా యువతీ, యువకులు వస్తున్నారు. అయితే, సబ్జెక్టుకు సంబంధించిన తాజా పుస్తకాలు అరకొరగానే ఉండడం, 2016–17కు ముందు సిలబస్‌ పుస్తకాలే ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాజా పుస్తకాలు లేకపోతే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక్కో అభ్యర్థి వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాల నుంచి ఖమ్మం వచ్చి అద్దె గదుల్లో ఉంటూ చదువుకోవాలని భావించగా గ్రంథాలయంలో పుస్తకాలు లేక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి జూన్‌ నుంచి వరుసగా పరీక్షలు జరగనుండడంతో కావాల్సిన పుస్తకాలను వెంటనే తెప్పించే ఏర్పాటుచేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

భోజన వసతి ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా.... కొద్దిరోజులకే..
గ్రంథాలయంలో సరిపడా బెంచీలు, ఫ్యాన్లు లేక, ఉన్న 12 ఏసీల్లో ఒకటే పనిచేస్తుండడంతో ఉక్కపోత నడుమే అభ్యర్థులు చదువుకోవాల్సి వస్తోంది. ఇక బెంచీలు సరిపోకపోవడంతో కొందరు కింద కూర్చుంటుండగా, మరికొందరు ఇళ్ల నుంచి కుర్చీలు తెచ్చుకుంటున్నారు. అలాగే, పురుషులు, మహిళలకు ఒక్కొక్కటే మరుగుదొడ్డి ఉండడంతో క్యూ కట్టాల్సి వస్తోంది. నూతనంగా మరుగుదొడ్లు నిర్మించినా వినియోగంలోకి తీసుకురాకపోవడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉచిత భోజన వసతి ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా.... కొద్దిరోజులకే తొలగించారు. అలాగే, పలు సందర్భాల్లో తాగునీటికి కూడా సమస్య ఎదురవుతోందని చెబుతున్నారు.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అవసరమైన పుస్తకాలను..
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించడంతో పాటు అవసరమైన పుస్తకాలు తెప్పించాలనే డిమాండ్‌తో మే 17వ తేదీన (మంగళవారం) నిరుద్యోగ యువతీ, యువకులు ఆందోళనకు దిగారు. గ్రంథాలయం ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడుతూ కూర్చోవడానికి బెంచీలు సరిపోకపోగా ఫ్యాన్లు, ఏసీలు కూడా పనిచేయడం లేదని తెలిపారు. దీనికి మరుగుదొడ్ల సమస్య కూడా ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.

రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు.. 
సివిల్స్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నా. చుట్టాల ఇంట్లో ఉంటూ నిత్యం గ్రంథాలయానికి వస్తుండగా, లేటెస్ట్‌ పుస్తకాలు అందుబాటులో లేవు. రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన బుక్స్‌ కూడా లభించటం లేదు. దీనికి తోడు మౌలిక వసతులు కూడా సక్రమంగా లేవు.
                                           – అశోక్, కల్లూరు

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

పుస్తకాలు కొనే స్థోమత లేక‌..
పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు తెప్పించాలి. బయట పుస్తకాలు కొనే స్థోమత లేని వారే గ్రంథాలయానికి వస్తారు. కానీ ఇక్కడ అవసరమైన పుస్తకాలు లేక పోటీ పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నాం. దీనికి తోడు ఇతరత్రా సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయి.          
                      – సుజాత, కాకరవాయి, తిరుమలాయపాలెం మండలం

 

తెలంగాణలో భ‌ర్తీ చేయ‌నున్న గ్రూప్స్ ఉద్యోగాలు ఇవే..

గ్రూప్‌-1 పోస్టులు:  503

గ్రూప్‌-2 పోస్టులు : 582

➤ గ్రూప్‌-3 పోస్టులు: 1,373

➤ గ్రూప్‌-4 పోస్టులు : 9,168

తెలంగాణలో భర్తీ చేయనున్న పోలీసు ఉద్యోగాలు ఇవే..
కానిస్టేబుల్‌ పోస్టుల వివరాలు ఇలా..
➤ కానిస్టేబుల్‌(సివిల్‌): 4965
➤ కానిస్టేబుల్‌(ఏఆర్‌): 4423
➤ కానిస్టేబుల్‌(ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌)(పురుషులు): 100
➤ కానిస్టేబుల్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 5010
➤ కానిస్టేబుల్‌ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌): 390
➤ ఫైర్‌మన్‌ (డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 610
➤ వార్డర్‌(పురుషులు)(జైళ్లు): 136
➤ వార్డర్‌(మహిళలు)(జైళ్లు): 10
➤ కానిస్టేబుల్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 262
➤ కానిస్టేబుల్‌(మెకానిక్స్‌)(పురుషులు): 21
➤ కానిస్టేబుల్‌(డ్రైవర్స్‌)(పురుషులు): 100
మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు: 16,027 

Competitive Exams: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?

ఎస్సై పోస్టుల వివరాలు ఇవే..

TS SI Posts


☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(సివిల్‌): 414
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఆర్‌): 66
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌)(పురుషులు): 5
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(టీఎస్‌ఎస్పీ)(పురుషులు): 23
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌)(పురుషులు): 12
☛ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌): 26
☛ డిప్యూటీ జైలర్‌(పురుషులు): 8
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 22
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌)(పురుషులు): 3
☛ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో): 8
మొత్తం ఎస్సై పోస్టులు: 587

​​​​​​​TSPSC & APPSC Groups Questions : గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుంది..?

Published date : 18 May 2022 07:29PM

Photo Stories