Skip to main content

TS Gurukula Jobs Posting Date : గురుకుల పోస్టుల‌పై కీల‌క నిర్ణ‌యం.. వచ్చే వారమే 8600 పోస్టుల‌కు..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎన్నో రోజుల నుంచి.. ఎదురుచుస్తున్న గురుకుల ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు వీరికి పోస్టింగ్స్ ఇవ్వ‌నున్నారు.
Telangana Gurukula Jobs Posting Date 2024

తెలంగాణలో వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని విద్యాసంస్థల్లో 8600 పోస్టులకు ఇప్పటికే నియామక పత్రాలు అందజేసిన ప్రభుత్వం.. వచ్చేవారం వారికి సంబంధిత పాఠశాలు‌, కళాశాలలో పోస్టింగ్స్ ఇవ్వనుంది ఈ మేరకు పూర్తి ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం.

➤☛ TSPSC Group 2 Exam Postpone 2024 : ఏక్ష‌ణంలోనైన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 వాయిదా..? ఇంకా పోస్టుల సంఖ్య‌ను కూడా..

ఈ ప్రక్రియకు డెడ్ లైన్ ఇదే..
8600 మంది నూతన సిబ్బంది వివిధ గురుకులాల్లోని విద్యాసంస్థల్లో చేరనున్నారు. ఏసీ గురుకులాలు మినహా.. మిగతా అన్ని గురుకులాల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. బదిలీల ప్రక్రియకు డెడ్ లైన్ జులై 20వ తేదీ. ఈ నేపథ్యంలో బ‌దిలీల ప్రక్రియ పూర్తి కాగానే పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్టీ జనరల్ బీసీ గురుకులాల్లో రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీలను గుర్తించి నూతన పోస్టింగ్ ఇవ్వనున్నారు.

☛ టీఎస్‌పీఎస్సీ Group-2 ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

అభ్యర్థులకు పోస్టింగ్స్ కోసం.. 
ఎస్సీ గురుకులాల్లో బదిలీల ప్రక్రియ కొన్ని అవాంతరాలు ఉన్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా పూర్తిచేసి నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నూతన టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పోస్టింగ్స్ కోసం వెబ్ ఆప్షన్ ఇచ్చి రెండు రోజుల తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రీజింగ్ పెట్టి తదనంతరం మెరిట్ ఆధారంగా పోస్టింగ్స్ కేటాయించనున్నారు. పోస్టింగ్ ఆర్డర్లను కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్‌లైన్‌ ద్వారానే అభ్యర్థులకు పంపించాలని తద్వారా నియామక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నియామక బోర్డు భావిస్తుంది.

Published date : 18 Jul 2024 04:14PM

Photo Stories