Skip to main content

Teachers Negligence : సంత‌కం చేసి వెళ్లిపోయే టీచ‌ర్లు.. విద్యార్థుల ప‌రిస్థితి ఏంటి..!!

పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు ప్ర‌తీ విష‌యాన్ని నేర్పించేది ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులే త‌ప్పు చేస్తే, ఇంక ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు కొంద‌రు త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.
Teachers negligence and students complaints

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థులకు ఉన్న‌త ల‌క్ష్యాల‌ను చేరుకోవాలంటూ వివిధ ప‌థ‌కాల‌ను, విద్యాను అందించేందుకు వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతుంది. కాని, కొంద‌రి ఉపాధ్యాయుల ప‌నితీరు కార‌ణంగా ఈ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు విఫ‌ల‌మైయ్యేలా ఉన్నాయి. పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు ప్ర‌తీ విష‌యాన్ని నేర్పించేది ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయులే త‌ప్పు చేస్తే, ఇంక ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు కొంద‌రు త‌ల్లిదండ్రులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. పాఠ‌శాల‌ల్లో ఉండాల్సిన అధ్యాప‌కులు విద్యార్థుల‌ను వ‌దిలేసి వారి ప‌నుల‌పై బ‌య‌ట‌కు వెళ్లిపోతే విద్యార్థుల ప‌రిస్థితి ఏంటి..? ఏ అధ్యాప‌కులు కూడా పాఠ‌శాల స‌మ‌యంలో ఉండ‌డం లేద‌ని, ఎటువంటి బోధ‌న నిర్వహించ‌డం లేద‌ని విద్యార్థులు సైతం ఫిర్యాదు చేస్తున్నారు. అస‌లు విష‌యంలో ఏంటంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాత చింతకుంట పాఠశాలలో విద్యార్థులు ఉండ‌గానే అక్క‌డ ప‌ని చేస్తున్న ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇద్ద‌రు, వేర్వేరు ప‌నిపై బ‌య‌ట‌కు వెళ్లారు.

10th Class Students: వినూత్న విద్యా కార్యక్రమం.. రోజుకో విందు భోజనం..

త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌..

ఒక ఉపాధ్యాయురాలు సెల‌వుల్లో ఉండ‌గా, పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు బ‌డికి వెళ్లి అక్క‌డి రిజిస్ట‌ర్‌లో సంత‌కం చేసి త‌న సొంత ప‌ని కోసం బ‌య‌ట‌కు వెళ్లారని ఆ బ‌డిలోని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఇలా, విద్యార్థులు పాఠాలు చెప్పాల్సిన టీచ‌ర్లే పాఠాలు చెప్పించుకునే స్థితికి వ‌స్తే ఎలా అని ప‌లువురు త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఉన్న గిరిజన గ్రామం పాత చింతకుంట. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు సక్రమంగా రావట్లేదని విద్యార్థులు చెప్తున్నారు.

APAAR Id Cards : విద్యార్థుల‌కు అపార్ కార్డులు.. విద్యాశాఖ ఆదేశాలు ఇలా..

రోజూ ఒక్క‌రే..

ప్రాథమిక పాఠశాలలో 12 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గురువారం ఐదుగురు హాజరయ్యారు. పాఠ‌శాల‌లో ప‌ని చేసేవారు ఇద్దరే. వారే, ప్ర‌ధానోపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయురాలు. వీరిద్ద‌రే, ప్ర‌తీరోజు ఒక‌రు అంటూ వ‌స్తుంటారు. అంటే, ఒక‌రోజు ఒక‌రు వ‌స్తే మ‌రొక‌రు రారు. మ‌రుస‌టిరోజు, మ‌రొక‌రు వ‌స్తే, ఇంకొక‌రు రారు. ఇలా, రోజూ సాగుతూనే ఉంద‌ని అక్క‌డి విద్యార్థులు గురువారం చెప్పుకొచ్చారు. యూనియన్ల అండతోనే కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోగా, ప్రశ్నించిన వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

Education News: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లకు డిమాండ్‌ తగ్గే అవకాశం ...... ఎందుకంటే

బాధ్యులెవ‌రు..!?

ప్ర‌తీరోజు ఇలా బ‌య‌ట‌కు వెళ్లే ప్రధానోపాధ్యాయుడు, తాను కాంప్లెక్స్ హెచ్ఎం వద్ద పర్మిషన్ తీసుకునే వెళ్తాన‌ని చెప్పడం గమనార్హం. ఆ పాఠశాల‌ విద్యార్థుల వివరాల ప్రకారం.. పాఠశాలకు వచ్చి పాత చింతకుంట ఎహ్ఎం సంతకం పెట్టి వెళ్లిపోయార‌న్నారు. 4, 5వ త‌ర‌గ‌తి విద్యార్థులు, బడి నుంచి బయటికి వెళ్లి ఏమన్నా జరిగితే ఎవ‌రు బాధ్యులు అని వారి త‌ల్లిదండ్ర‌లు, గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. 
విద్యాశాఖకు సంబంధించిన పత్రాలను తనకు ఇచ్చేందుకు పాఠశాల ముగిసే సమయానికి అర్థగంట ముందు మాత్రమే మైలారం స్కూల్‌కి రావాలని అనుమతి ఇచ్చినట్టు మైలారం కాంప్లెక్స్ స్కూల్ హెచ్ఎం తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Feb 2025 12:13PM

Photo Stories