Skip to main content

QR Code on Question Paper : ఈసారి క్వ‌శ్చ‌న్‌ పేప‌ర్‌పై క్యూఆర్ కోడ్‌.. కేంద్రంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

ఈసారి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి త‌ప్పిదాలు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు బోర్డు అధికారులు..
Serious and strict rules for tenth board exams 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: త్వ‌ర‌లోనే ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు బోర్డు ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్రంలో టెన్త్‌ బోర్డు ప‌రీక్ష‌ల కోసం అధికారులు కేంద్రాల వ‌ద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి త‌ప్పిదాలు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. గ‌తంలో ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ప్ర‌శ్న ప‌త్రాలు లీక్ కావ‌డం బోర్డు అధికారుల‌కు తీవ్ర ఇబ్బందులు, త‌ల‌నొప్పిగా మారింది.

South Coast Railway Zone: విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వ్ జోన్‌కు కేబినెట్‌ ఆమోదం

ఇక ఇలాంది ఏది కూడా ఈసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని ప్ర‌తీఒక్క ఏర్పాటును ప‌క‌డ్బందీగానే చేస్తున్నారు. ఇందులో భాగంగా, బోర్డు అధికారులు ప్ర‌శ్న‌ప‌త్రాల‌పై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసింది. ఇలా, కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని, ఎలాంటి త‌ప్పిదం జ‌ర‌గ‌కుండే ఉండేలా చ‌ర్య‌లు చేప‌డుతోంది. అస‌లు, ఈ క్యూఆర్ కోడ్ ఏంటి, దీంతో ఎలా జాగ్ర‌త్త‌లు ప‌డోచ్చు..? 

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..

- ఒక‌వేళ‌ ప్రశ్నపత్రాలు లీకైతే అవి ఎక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాయో అనే విష‌యాన్ని వెంటనే తెలుసుకొనేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

- ఈసారి ప్ర‌శ్నాప‌త్రంపై క్యూఆర్‌ కోడ్ మాత్ర‌మే కాదు.. ప్రతి పేపర్‌పై సీరియల్‌ నంబరు కూడా ముద్రించనుంది బోర్డు. కాని, దీనికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు అయితే, ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Students Protest : ఓయూ వ‌ద్ద పీజీ విద్యార్థుల నిర‌స‌న‌.. కార‌ణం..!!

- విద్యార్థులకు హాల్‌ టికెట్లను వారి న‌మోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు మెసేజ్ వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే బోర్డు ప్ర‌క‌టించింది. వ‌చ్చే మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ కనిపిస్తుంది.

- పరీక్షా కేంద్రాల ప్రహరీలు దూకి కాపీలు అందించకుండా.. కిటికీల పక్కన కూర్చొని పరీక్షలు రాస్తున్న వారి క్వశ్చన్ పేపర్లను ఫోన్లతో ఫొటో తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- మన పక్కన ఉన్న‌ మహారాష్ట్రలో.. పది, ఇంటర్‌ బోర్డులు సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాయి. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి.

Students Exams : విద్యార్థులు ప్ర‌శాంతంగా ప‌రీక్ష‌లు రాయాలి..

- పరీక్ష పేపర్లు లీకైతే వెంటనే గుర్తించడం తోపాటు.. అసలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ముఖ్యమని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సూచిస్తున్నారు.

- ఇలాంటి ఏర్పాటు పదో తరగతిలో కూడా చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. దీంతో ఈజీగా పరీక్షా కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈసారి ప‌రీక్ష‌ల సమ‌యంలో ఎలాంటి లోటు, ఇబ్బందులకు తావు లేకుండా ఉండేలా ప్ర‌తీ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని యోచిస్తుంది బోర్డు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 08 Feb 2025 04:01PM

Photo Stories