Students Protest : ఓయూ వద్ద పీజీ విద్యార్థుల నిరసన.. కారణం..!!

సాక్షి ఎడ్యుకేషన్: త్వరలోనే పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని కొందరు పీజీ విద్యార్థులు భవనం వద్దనే ఆందోళన చేపట్టారు. రానున్న పరీక్షలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఇందులో భాగంగా ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడే నిరసన చేపట్టారు. ఇందుకు కారణం ఏంటంటే.. ఈనెల, ఫిబ్రవరి 15, 16 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
Students Exams : విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి..
అదే విధంగా, ఫిబ్రవరి 28, మార్చి 2వ తేదీల్లో నిట్ పరీక్షలు ఉండగా.. పీజీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 18 నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా అయితే, తాము ఎలా సిద్ధమవ్వాలని, ఎంతోమంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతారని ఆందోళన చేపట్టారు. అందుకే సెమిస్టర్ పరీక్షలు మార్చి 4వ తేదీ వరకు వాయిదా వేయాలని కోరుతున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- students protest
- PG students
- Osmania University
- exam postpone
- PG semester exams
- stressed students
- pg semester exams postpone
- march 4th
- GATE exams
- february month exams 2025
- semester and entrance exams
- entrance exams in february 2025
- NIT and GATE 2025
- osmania university pg
- osmania university pg students protest news in telugu
- students protest at ou for semester exams postpone news
- Education News
- Sakshi Education News