Students Exams : విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి..

కై లాస్‌నగర్: రానున్న రోజుల్లో విద్యార్థులకు పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో విద్యార్థుకలు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సులువుగా వారి పరీక్షలకు సిద్ధమవ్వచ్చు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్‌కుమార్ సూచించారు.
Schools: రాష్ట్రవ్యాప్తంగా వేలాది పాఠశాలల్లో ఈ సమస్య.. తీర్చేది ఎలా!
శుక్రవారం జైనథ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కాలేజీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధత గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఏవై న సందేహాలుంటే 14416, 1800 914 416 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ మురళి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Tenth Students
- Inter Exams
- board exams 2025
- students encouragement
- AP Inter Board
- ap inter board exams 2025 preparations
- schools and junior college students
- inter board exams 2025
- inter board exams preparation tips
- exams preparation tips for students
- District Intermediate Education Officer Ravinder Kumar
- ap intermediate board latest news
- inter board exams halltickets download 2025
- Education News
- Sakshi Education News