Skip to main content

Awareness on OMR Sheets for Students : విద్యార్థుల‌కు ప్రీ ఫైన‌ల్స్‌లోనే ఓఎంఆర్‌పై అవ‌గాహ‌న‌.. బోర్డు ప‌రీక్ష‌ల్లో ఈ మార్పులు..

ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే బోర్డు ప‌రీక్ష‌ల‌కు ఓఎమ్ఆర్ షీట్ల‌ను కేటాయిస్తారు.
Awareness for tenth students on omr sheets in pre final exams

సాక్షి ఎడ్యుకేష‌న్‌: టెన్త్ ప‌రీక్ష‌లు త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. అయితే, సాధార‌ణంగా ప్ర‌తీ ప‌రీక్ష‌ల‌కు విద్యార్థులు ప్రిప‌రేష‌న్ జ‌రిపిన‌ట్లు వార్షిక ప‌రీక్ష‌కు కేటాయించే ఓఎంఆర్ షీట్ల విష‌యంలో కూడా ప్రిప‌రేష‌న్‌ను విద్యార్థుల‌కు అందించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ భావిస్తుంది.

ప్ర‌తీ ఏటా నిర్వ‌హించే బోర్డు ప‌రీక్ష‌ల‌కు ఓఎమ్ఆర్ షీట్ల‌ను కేటాయిస్తారు. అందులో విద్యార్థులు త‌మ ప‌రీక్ష ప్రారంభం ముందే త‌మ వివ‌రాల‌ను అందులో రాయాల్సి ఉంటుంది. అందులో అడిగిన విధంగా ప్ర‌తీ వివరాల‌ను న‌మోదు చేయాల్సి ఉంటుంది.

Gurukul Admissions 2025 : గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే

అయితే, ఇది ప‌దో త‌ర‌గ‌తి నుంచే ప్రారంభం అవుతుంది కాబ‌ట్టి, ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులకు బోర్డు ప‌రీక్ష‌ల‌కు ముందే ఈ విష‌యంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని పాఠ‌శాల విద్యాశాఖ యోచిస్తుంది. దీని కోసం, ఇప్ప‌టి నుంచే వారి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ప్రారంభం కానున్న ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల్లో ఈ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

ప్రీ ఫైన‌ల్‌లో ఓఎమ్ఆర్‌..

రాష్ట్ర‌వ్యాప్తంగా టెన్త్ విద్యార్థుల‌కు బోర్డు ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల మార్చిలో ప్రారంభం కానున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు బోర్డు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. అయితే, అంత‌లోగా విద్యార్థుల‌కు ఓఎమ్ఆర్ షీట్లు ఏమిటీ..? అందులో రాయాల్సిన విష‌యాలు ఏంటి? అనే ప్ర‌క్రియపై ఇప్ప‌టినుంచే అవ‌గాహ‌న క‌ల్పిస్తే బోర్డు ప‌రీక్షల స‌మ‌యంలో వారికి ఇబ్బందులు ఉండ‌వ‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థులకు వారి పాఠశాలల్లో జరిగే ఎఫ్‌ఏ, సమ్మేటివ్‌ తదితర పరీక్షల్లో ఓంఎఆర్‌ పత్రాలను ఇవ్వడం లేదు. దీంతో వారికి అవ‌గాహ‌న ఉండ‌దు. అందుకే ఇలాంటి చ‌ర్య‌లు చేప‌డుతున్నారు విద్యాశాఖ అధికారులు.

AP DSC Notification 2025 : 16,371 పోస్టుల‌కు డీఎస్సీ నోటిఫికేష‌న్‌.. ఏపీ విద్యాశాఖ కీల‌క ప్ర‌క‌ట‌న‌..

పరిశీలించాలి.. న‌మోదు చేయాలి..

విద్యార్థుల‌కు ప్రీ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల్లోనే ఈ ఓఎంఆర్ షీట్ల‌ను కేటాయించి, అందులో ప్రతి విద్యార్థి తనకు ఇచ్చిన ఆన్సర్‌ బుక్‌లెట్‌ సంఖ్యను రాయడం తప్పనిసరి. దానిపై సంతకం కూడా చేయాలి. విద్యార్థికి సంబంధించిన మరిన్ని వివరాలు అందులో ముందుగానే ముద్రించి ఉంటాయి. వాటిని విద్యార్థులు సరిచూసుకోవాలి. వివరాల్లో తప్పులున్నా.. ఆ ఓఎంఆర్‌ తనది కాకపోయినా వెంటనే ఇన్విజిలేటర్‌కు చెప్పాలి. వారు ఇచ్చే ఇతర నామినల్‌ రోల్‌ పత్రంలో సరైన వివరాలను రాయాలి.

లాభాలు ఇవే..

ఓఎంఆర్ షీట్ల‌పై బోర్డు ప‌రీక్ష‌ల‌కు ముందే అవ‌గాహ‌న క‌ల్పిస్తే.. విద్యార్థుల‌కు మెయిన్ ప‌రీక్ష స‌మ‌యంలో ఎలాంటి అయోమ‌యం లేదా ఇబ్బందులు ఉండ‌వు. వారికి ముందే కొన్ని వివ‌రాలు తెలిసి ఉంటాయి కాబట్టి, వారే స్వ‌యంగా పరిశీలించుకుంటారు. ఎలాంటి త‌ప్పిదాల‌కు కూడా చోటు ఉండ‌దు. విద్యార్థులు క‌న్ఫ్యూజ్ అవ్వ‌రు. ఎలాంటి స్ప‌ష్టత లేకుండా ఒకే సారి బోర్డులో ఈ ప్ర‌క్రియ జ‌రిపించ‌డంతో విద్యార్థుల‌కే కాదు, అధికారుల‌కు, టీచ‌ర్ల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వు. ఈ అవ‌గాహ‌న‌తో విద్యార్థుల‌కు చాలావిష‌యాలు తెలిసి వ‌స్తాయి.

Free Education: గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎనిమిదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే!

బుక్‌లెట్లలో మార్పులు..

గతంలో బోర్డు ప‌రీక్ష‌ల‌కు 4పేజీల మెయిన్‌ బుక్‌లెట్‌ ఇచ్చేవారు. అవి పూర్తి అయ్యాక‌, స‌రిపోక‌పోతే, అప్పుడు అదనపు షీట్లను ఇచ్చేవారు. వాటి సంఖ్య‌ను కూడా న‌మోదు చేసుకునేవారు. కాని, ఈసారి ఇంటర్మీడియట్‌ తరహాలో మార్పు చేసి, 4 కాకుండా, 24 పేజీల బుక్‌లెట్‌ను కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో, ఇక అదనపు పత్రాల అవ‌సరం ఉండ‌దు. వాటి సంఖ్య కూడా న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ఎస్‌సీఈఆర్‌టీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 12 Feb 2025 12:53PM

Photo Stories