1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్–సి హోదాలో కేంద్ర కొలువులు
- 1600 పోస్ట్‌లతో ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ నోటిఫికేషన్
- ఇంటర్మీడియెట్ అర్హతతోనే పోటీ పడే అవకాశం
- విజయం సాధిస్తే.. గ్రూప్–సి హోదాలో కేంద్ర కొలువులు
పోస్టుల సంఖ్య 1600
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చేసిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేసన్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1600 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. పలు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, రాజ్యాంగ సంస్థలు, ట్రిబ్యునల్స్ తదితరాల్లో లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్‌లకు నియామకాలు చేపట్టనుంది.
అర్హతలు
- ఆగస్ట్ 1, 2023 నాటికి ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సు ఉత్తీర్ణత ఉండాలి.
- కాగ్, కన్సూమర్ అఫైర్స్ శాఖ, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్‌లలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్–ఎ పోస్ట్‌లకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణులను అర్హులుగా పేర్కొన్నారు.
వయసు
ఆగస్ట్ 1, 2023 నాటికి 18–27 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఇస్తారు.
వేతనం
- లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జేఎస్‌ఏ): పే లెవల్–2; వేతన శ్రేణి రూ.19,900–రూ.63,200.
- డేటాఎంట్రీ ఆపరేటర్: పే లెవల్–4; వేతన శ్రేణి రూ.25,500–రూ.81,100.
- డేటాఎంట్రీ ఆపరేటర్: పే లెవల్–5; వేతన శ్రేణి రూ.29,200–రూ.92,300.
- డేటా ఎంట్రీ ఆపరేటర్: గ్రేడ్–ఎ; పే లెవల్–4; వేతన శ్రేణి రూ.25,500 – రూ.81,100.
ఎంపిక.. రెండు దశల్లో ఎంపిక
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో టైర్–1, టైర్–2 పేరుతో పరీక్షలు ఉంటాయి.
ప్రాంతీయ భాషల్లో పరీక్ష
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ పరీక్షకు ప్రాంతీయ భాషల్లో హాజరుకావచ్చు. ఇంగ్లిష్, హిందీతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. స్కిల్ టెస్ట్ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.
టైర్–1 ఇలా
ఎంపిక ప్రక్రియలో మొదటి దశ టైర్–1 పరీక్ష. దీన్ని పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 25 ప్రశ్నలు చొప్పున వంద ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం ఒక గంట.
చదవండి: Indian Navy Recruitment 2023: ఇండియన్ నేవీలో 372 చార్జ్‌మ్యాన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మాడ్యూల్స్, సెక్షన్ల విధానంలో టైర్–2
- టైర్–1 పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి రెండో దశ.. టైర్–2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో రెండు సెషన్‌లు, మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌లో రెండు మాడ్యూల్స్ ఉంటాయి. టైర్ –2 పరీక్ష వివరాలు...
- సెషన్–1లో సెక్షన్–1: మాడ్యూల్–1లో..మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30 ప్రశ్నలు– 90 మార్కులు, మాడ్యూల్–2లో..రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 ప్రశ్నలు–90 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
పరీక్ష సమయం ఒక గంట.
- సెషన్ 1లో సెక్షన్–2: మాడ్యూల్–1లో..ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40 ప్రశ్నలు–120 మార్కులు, మాడ్యూల్–2లో..జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు– 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట.
- సెషన్ 1లో సెక్షన్–3: మాడ్యూల్–1లో.. కంప్యూటర్ నాలెడ్జ్ 15 ప్రశ్నలు–45 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 15 నిమిషాలు.
- సెషన్2 సెక్షన్–3: మాడ్యూల్–2లో.. స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్‌ను పార్ట్–ఎ, పార్ట్–బిలుగా నిర్వహిస్తారు.
- పార్ట్–ఎ ప్రకారం– డేటా ఎంట్రీ ఆపరేట్ పోస్ట్‌ల అభ్యర్థులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
- పార్ట్–బి ప్రకారం–ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్ట్‌ల అభ్యర్థులకు పది నిమిషాల వ్యవధిలో టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ మినహా మిగతా విభాగాల్లోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి.
- డేటాఎంట్రీ ఆపరేట్ పోస్ట్‌లకు నిర్వహించే స్కిల్ టెస్ట్‌లో గంటకు 8000 క్యారెక్టర్స్‌ను కంప్యూటర్‌పై టైప్ చేయాల్సి ఉంటుంది.
- ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్ట్‌లకు నిర్వహించే టైపింగ్ టెస్ట్‌లో అభ్యర్థులు ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్‌ల అభ్యర్థులకు ఏదైనా ఒక ఇంగ్లిష్ ప్యాజేస్‌ను ఇచ్చి కంప్యూటర్‌పై టైప్ చేయమని అడుగుతారు.
చదవండి: Indian Navy Recruitment 2023: ఇండియన్ నేవీలో 372 చార్జ్‌మ్యాన్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
పటిష్ట ప్రణాళికతోనే సక్సెస్
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
జనరల్ ఇంటెలిజెన్స్
ఇందులో సిరీస్(నంబర్/ఆల్ఫా న్యుమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్(వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్ డీకోడింగ్ అంశాలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు స్కోర్ చేసే అవకాశముంది.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
అభ్యర్థుల్లోని గణిత నైపుణ్యాలను పరీక్షించే ఈ విభాగంలో రాణించాలంటే.. సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్, శాతాలపై ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా, త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలపై పట్టు సాధించాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టితో చదవాలి.
జాగ్రఫీ విషయంలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌లో ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపై పట్టు సాధించాలి. సీహెచ్‌ఎస్‌ఎల్ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌ను ఎంతో కీలకమని గుర్తించాలి. దీంతోపాటు స్టాక్ జీకేలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు వాటి తీర్మానాలు, అవార్డులు–విజేతలు వంటి సమాచారాన్ని ఔపోసన పట్టాలి.
చదవండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: జూన్ 8, 2023
- ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్ 10, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణ అవకాశం: జూన్ 14, 15 తేదీలు
- టైర్–1 పరీక్ష తేదీ: 2023 ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in/, https://ssc.nic.in/Portal/Notices
చదవండి: Civils Practice Tests
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 10,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |