Indian Navy Jobs: ఇండియన్ నేవీ 910 ఉద్యోగాలు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్..
- మొత్తం 910 పోస్ట్‌లకు నోటిఫికేషన్
- అర్హత: పది, ఐటీఐ, బీఎస్సీ, డిప్లొమా
- ఐఎన్‌సెట్ ద్వారా ఎంపిక ప్రక్రియ
- గ్రూప్-బి, గ్రూప్-సి నాన్ గెజిటెడ్ హోదాలు
ఇండియన్ నేవీ నిర్వహించే ఐఎన్‌సీఈటీ పరీక్ష ద్వారా.. నేవీకి సంబంధించిన కార్యాలయాల సిబ్బందితోపాటు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే పోస్ట్‌లను కూడా భర్తీ చేస్తారు. తాజా నోటిఫికేషన్‌లో పోస్ట్‌లను నాన్-మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ అనే పేరుతో రెండు కేటగిరీలుగా పేర్కొన్నారు.
మొత్తం 910 పోస్ట్‌లు
నాన్ మినిస్టీరియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలలో మొత్తం 910 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో గ్రూప్ బీలో చార్జ్‌మెన్ వర్క్‌షాప్ 22 పోస్టులు, చార్జ్‌మెన్ 20 పోస్టులు, సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ 258 పోస్టులు; అదేవిధంగా గ్రూప్ ట్రేడ్స్‌మెన్ మెట్ 610 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత
ఆయా పోస్ట్‌లను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
ఆయా పోస్ట్‌లను అనుసరించి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
చదవండి: Indian Navy Recruitment 2023: ఇండియన్ నేవీలో 910 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
గ్రూప్-బి, గ్రూప్-సి కొలువులు
- కొలువులన్నీ గ్రూప్-బి, గ్రూప్-సి నాన్ గెజిటెడ్ హోదాలో ఉంటాయి. ట్రేడ్స్‌మెన్ మెట్ మినహా మిగిలిన పోస్ట్‌లను నాన్ మినిస్టీరియల్ విభాగంలో గ్రూప్-బి నాన్ గెజిటెడ్ పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లకు ప్రారంభ వేతన శ్రేణి రూ.35,400 -రూ.1,12,400 (పే లెవల్-6)గా నిర్ధారించారు.
- ట్రేడ్స్‌మెన్ మెట్ పోస్ట్‌లను గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ పోస్టులకు ప్రారంభ వేతన శ్రేణి రూ.18,000-రూ.56,900(పే లెవల్-1).
విధులు ఇవే
- ఛార్జ్‌మెన్(అమ్యూనిషన్ వర్క్‌షాప్, ఫ్యాక్టరీ): అమ్యూనిషన్ వర్క్‌షాప్‌లో సిబ్బంది పనితీరును పర్యవేక్షించడం, స్టోర్స్, టూల్స్‌కు సంబంధించి నిర్వహణ, వార్షిక తనిఖీలు నిర్వహించడం వంటి విధులు ఉంటాయి.
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్: తమకు కేటాయించిన విభాగంలో నౌక నమూనా/ప్రణాళిక/ ఎలివేషన్, ఫ్రేమ్ స్ట్రక్చర్ వంటి వాటిని ఆటోక్యాడ్ వినియోగించి రూపొందించడం, అదే విధంగా టెక్నికల్ డేటా సేకరణతోపాటు నౌకల వ్యవస్థలు, అమరికలకు సంబంధించి స్కెమాటిక్/స్కెచ్/ఫ్లో డయాగ్రమ్స్‌లను రూపొందించాల్సి ఉంటుంది.
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ కార్టోగ్రఫీ: ఈ విభాగంలో చేరిన వారు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయడం, దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ విధులు నిర్వర్తించడం, శాటిలైట్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసి, వాటిని నిక్షిప్తం చేయడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్(ఆర్మమెంట్): ఈ విభాగంలో నియమితులైన వారు డ్రాయింగ్స్ గీయడానికి అవసరమైన సాంకేతిక డేటాను సేకరించడం, డ్రాయింగ్స్/ స్పెసిఫికేషన్స్‌ను నిరంతరం పర్యవేక్షించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
- ట్రేడ్స్‌మెన్ మెట్: వర్క్‌షాప్, షిప్స్/సబ్ మెరైన్స్లో ప్రొడక్షన్, నిర్వహణ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. అదే విధంగా తమకు కేటాయించిన సెక్షన్/యూనిట్ దైనందిన కార్యకలాపాల నిర్వహణ, ఇతర క్లరికల్ విధులు(లెటర్స్, ఫ్యాక్స్ తీసుకోవడం/పంపడం), డిస్పాచ్ సెక్షన్ విధులు వంటివి నిర్వర్తించాల్సి ఉంటుంది.
100 మార్కులకు ఐఎ¯Œ సెట్
ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నాలుగు విభాగాల్లో 100మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం గంటన్నర. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా ఉంటుంది.
మెరిట్ జాబితా ఇలా
రాత పరీక్షలో సాధించిన మార్కులు, అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరిట సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.అదే సమయంలో వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. నేవీ ప్రమాణాలకు సరితూగేలా ఉన్న వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://incet.cbt-exam.in/login/user
పరీక్షలో రాణించేలా
ఇండియన్ నేవీలో కీలక పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే ఐఎన్‌సీఈటీలో మంచి మార్కులు సాధించేందుకు విభాగాల వారీగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
జనరల్ ఇంటెలిజెన్స్
వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. సిరీస్(నంబర్/ఆల్ఫా న్యుమరిక్) విభాగం, అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాజిజమ్, మ్యాట్రిక్స్, డైరెక్షన్, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ (వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్-డీకోడింగ్ అంశాలపై పట్టు సాధించాలి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్‌లో జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు మొదలు జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ విభాగాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలపై ప్రత్యేక దృష్టితో చదవాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. అంతేకాకుండా ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. కరెంట్ అఫైర్స్‌ను కూడా కీలకంగా భావించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలను చదవాలి. స్టాక్ జీకే కోసం చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు వాటి తీర్మానాలు, అవార్డులు-విజేతలు వంటి సమాచారాన్ని ఔపోసన పట్టాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఈ విభాగంలో అర్థగణిత అంశాలైన సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, శాతాలపై ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా త్రికోణమితి, అల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్‌లకు సంబంధించిన ప్రశ్నలను కూడా సాధన చేయాలి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్
ఈ విభాగంలో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్,యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్-ఇన్‌డైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్స్, స్పాటింగ్ ద ఎర్రర్స్ వంటి అంశాలపై పట్టు సాధించాలి.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | December 31,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Indian Navy jobs
- Defence Jobs
- Join Indian Navy
- Indian Navy INCET 2023 Recruitment
- Group B Jobs
- Group C Jobs
- Non Gazetted Jobs
- Indian Navy Civilian Entrance Test
- navy exam syllabus
- navy exam pattern
- navy exam study material
- IndianNavy
- RecruitmentNotifications
- GroupBRecruitment
- GroupC
- StartingSalary
- BScJobs
- INCET
- SelectionProcess
- NavyJobs
- PreparationTips
- CareerOpportunity
- JobAlerts
- sakshi education job notifications