Skip to main content

Indian Navy Recruitment 2023: ఇండియన్‌ నేవీలో 910 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇండియన్‌ నేవీ–సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఐఎన్‌సెట్‌–01/2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఛార్జ్‌మ్యాన్, సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Indian Navy    Senior Draftsman job opening   Eligibility criteria for Indian Navy posts   indian navy incet notification 2023    Civilian Entrance Test announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 910
ట్రేడులు: కార్పెంటర్, సీవోపీఏ, డ్రెస్‌ మేకింగ్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఎలక్ట్రోప్లేటర్, ఇండస్ట్రియల్‌ పెయింటర్, ప్లంబర్, సర్వేయర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి ఛార్జ్‌మ్యాన్‌/ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులకు 25 ఏళ్లు, సీనియర్‌ డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ పోస్టులకు 27ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ స్క్రీనింగ్, రాతపరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

చ‌ద‌వండి: RITES Apprentice Vacancy 2023: రైట్స్‌ లిమిటెడ్‌లో 257 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date December 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories