Skip to main content

TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో డిగ్రీ లెక్చరర్స్‌ మొదలు టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ల భర్తీకి.. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. గత మూడు, నాలుగేళ్లుగా టీచర్‌ కొలువుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు.. తాజా గురుకుల ఉద్యోగాల భర్తీ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. పరీక్ష తేదీ కోసం వేచి చూడకుండా..దరఖాస్తు సమయం నుంచే ఆయా పోస్ట్‌లకు సంబంధించిన పరీక్షలకు ప్రిపరేషన్‌ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగవుతాయి.
TS Gurukulam Teacher Jobs
  • టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టుల భర్తీకి కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ 
  • డీఎల్‌ మొదలు క్రాఫ్ట్‌ టీచర్‌ వరకు.. 9 రకాల ఉద్యోగాలు 
  • ఇప్పటి నుంచి కృషి చేస్తే విజయానికి ఆస్కారం

మొత్తం 9,231 పోస్టులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..గురుకుల విద్యాయాల్లో మొత్తం 9,231 పోస్ట్‌ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్, తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఈ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. ఇందుకోసం.. ప్రత్యేకంగా తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో.. ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.

పోస్టుల వివరాలు

  • డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ(ఫిజికల్‌ డైరెక్టర్‌), లైబ్రేరియన్‌-868 పోస్టులు 
  • జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ, లైబ్రేరియన్స్‌-2008 పోస్టులు 
  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ)-1,276 పోస్ట్‌­లు
  • ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ)- 4,020 పోస్ట్‌లు
  • ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ టీచర్స్‌ - 134 పోస్ట్‌లు
  • గరుకుల పాఠశాలల్లో లైబ్రేరియన్స్‌-434 పోస్ట్‌లు
  • మ్యూజిక్‌ టీచర్స్‌-124 పోస్ట్‌లు
  • క్రాఫ్ట్‌ టీచర్, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌-92 పోస్ట్‌లు
  • గురుకుల విద్యాలయాల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌-275 పోస్టులు

చ‌ద‌వండి: TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 275 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఎంపిక ఇలా

రాత పరీక్ష, డెమానుస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

విజయం సాధించేలా
సిలబస్‌పై అవగాహన

తెలంగాణ గురుకుల పోస్ట్‌లకు పోటీపడుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌ క్రమంలో ముందుగా.. సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. తమ సబ్జెక్ట్‌లకు సంబంధించిన సిలబస్‌ అంశాలను పరిశీలించాలి. సదరు టాపిక్స్‌ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో గుర్తించాలి. సిలబస్‌పై అవగాహన పొందిన అభ్యర్థులు.. వెంటనే ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. అదే విధంగా పరీక్షల్లో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి. కాబట్టి ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి.

చ‌ద‌వండి: TREIRB Recruitment 2023: తెలంగాణ గురుకులాల్లో 434 లైబ్రేరియన్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

పాత ప్రశ్న పత్రాలు

అభ్యర్థులు టీచర్‌ నియామకాలకు సంబంధించిన పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటంది. గతంలో నిర్వహించిన డీఎస్‌సీ, టెట్‌ వంటి పరీక్షల ప్రశ్న పత్రాలను పరిశీలించి.. వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. పెడగాజీ విషయంలో కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల నియామక పరీక్షల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం మేలు చేస్తుంది. 

జనరల్‌ స్టడీస్‌

  • అన్ని పోస్ట్‌లకు సంబంధించి పేపర్‌-1లో రాణించాలంటే.. జనరల్‌ స్టడీస్‌కు సంబంధించి భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పబ్లిక్‌ పాలసీ, సామాజిక వివక్ష; వికలాంగులు, గిరిజనులకు సంబంధించిన హక్కులు; సమ్మిళిత విధానాలు; సమాజ సంస్కృతి, నాగరికత, వారసత్వం; భారత్, తెలంగాణ కళలు, సాహిత్యం; సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో తాజా పరిణామాలు; పర్యావరణ సమస్యలు-విపత్తుల నిర్వహణ, నివారణ, ఉపశమన విధానాలు; భారత్, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి; తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రాధాన్యంగా తెలంగాణలోని సామాజిక-ఆర్థిక చరిత్ర, రాజకీయ-సాంస్కృతిక చరిత్ర, కరెంట్‌ అఫైర్స్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
  • అనలిటికల్‌ ఎబిలిటీస్‌: లాజికల్‌ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లపై దృష్టిపెట్టాలి. 
  • ఇంగ్లిష్‌: ఇంగ్లిష్‌ గ్రామర్, వొకాబ్యులరీ, వర్డ్స్‌ అండ్‌ సెంటెన్సెస్, డైరెక్ట్‌-ఇన్‌ డైరెక్ట్‌ స్పీచ్, సెంటెన్స్‌ కరెక్షన్, యాక్టివ్‌-ప్యాసివ్‌ వాయిస్, యాంటానిమ్స్, సినానిమ్స్‌ వంటి బేసిక్‌ ఇంగ్లిష్‌ అంశాలపై పట్టు సాధించాలి.

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

సబ్జెక్ట్‌ పేపర్‌

ఆయా పోస్ట్‌లకు సంబంధించి పేర్కొన్న సబ్జెక్ట్‌ పేపర్లలో రాణించేందుకు అభ్యర్థులు.. పీజీ స్థాయి అకడమిక్‌ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఆయా అంశాలను వర్తమాన పరిణామాలతో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్‌ల విషయంలో అప్లికేషన్‌ దృక్పథంతో అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.

పెడగాజీ

జూనియర్‌ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ పోస్ట్‌ల రాత పరీక్షలో ఒక పేపర్‌గా ఉండే పెడగాజీని అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ఇందుకోసం పెడగాజీలోని భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ ప్రిపరేషన్‌ కొనసాగించాలి. అదే విధంగా బోధన పద్ధతులు, మూల్యాంకన, ఇన్‌క్లూజివ్‌ ఎడ్యకేషన్, శిశు విద్యా ప్రణాళిక, ఆర్‌టీఈపై అవగాహన పెంచుకోవాలి. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ, లైబ్రేరియన్‌ చివరి తేది: మే 17, 2023
  • జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్స్, పీడీ, లైబ్రేరియన్‌ చివరి తేది: మే 17, 2023
  • పాఠశాలల్లో పీజీటీ, పీడీ, లైబ్రేరియన్, క్రాఫ్ట్‌ టీచర్, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్, ఆర్ట్‌ టీచర్, డ్రాయింగ్‌ టీచర్, మ్యూజిక్‌ టీచర్‌ చివరి తేది: మే 24, 2023
  • గురుకుల పాఠశాలల్లో టీజీటీ చివరి తేది: మే 27, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు

Qualification GRADUATE
Last Date May 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories