Skip to main content

SSC Notification 2023: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్‌-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి... జాబ్‌ కొట్టండి

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. మల్టీ టాస్కింగ్‌(నాన్‌-టెక్నికల్‌) స్టాఫ్, హవాల్దార్‌(సీబీఐసీ అండ్‌ సీబీఎన్‌) ఎగ్జామ్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది! దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖలు, విభాగాలు, ట్రిబ్యునళ్లల్లో.. గ్రూప్‌-సి (నాన్‌ గెజిటెడ్‌) పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. పదో తరగతితోనే కేంద్ర కొలువు సొంతం చేసుకునేందుకు చక్కటి అవకాశం ఇది. ఈ నేపథ్యంలో..ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌(నాన్‌-టెక్నికల్‌), హవాల్దార్‌ పోస్ట్‌లు, ఎంపిక విధానం తదితర వివరాలు..
central government jobs after 10th
  • 1,558 ఎంటీఎస్, హవాల్దార్‌ పోస్ట్‌లకు ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌
  • టెన్త్‌తోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌-సి కొలువులు 
  • రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
  • రూ.18,000-రూ.56,900 వేతన శ్రేణి

ప్రభుత్వ ఉద్యోగం.. పదో తరగతి మొదలు ప్రొఫెషనల్‌ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు ప్రతి ఒక్కరి లక్ష్యం. పదో తరగతి అర్హతతోనే కేంద్ర కొలువు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఎంటీఎస్‌(నాన్‌-టెక్నికల్‌), హవాల్దార్‌(సీబీఐసీ, సీబీఎన్‌) ఎగ్జామినేషన్‌.

మొత్తం 1,558 పోస్ట్‌లు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) తాజా నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో 1,558 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) పోస్టులు 1,198; సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌(సీబీఐసీ), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌లో 360 హవాల్దార్‌ పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

సదరన్‌ రీజియన్‌లో 207

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. రీజియన్ల వారీగా ఖాళీలను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సదరన్‌ రీజియన్‌లో 207 పోస్ట్‌లు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమకు ఆసక్తి ఉన్న రీజియన్, పోస్ట్‌లను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది. దాని ఆధారంగా పొందిన మార్కులు, ప్రతిభను పరిగణనలోకి తీసుకుని నియామకాలు ఖరారు చేస్తారు.

చ‌ద‌వండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్‌–సి హోదాలో కేంద్ర కొలువులు

అర్హత

  • పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: ఆయా శాఖల నిబంధనలను అనుసరించి 01.08.2023 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో నిబంధనలకు అనుగుణంగా సడలింపు లభిస్తుంది.

 
మూడు దశల్లో ఎంపిక

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవాల్దార్‌ పోస్ట్‌లకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహిస్తారు. అవి.. రాత పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌. ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ను హవాల్దార్‌ పోస్ట్‌ల అభ్యర్థులకే నిర్వహిస్తారు.

రాత పరీక్ష.. 270 మార్కులు

ఎంటీఎస్, హవాల్దార్‌ పోస్ట్‌ల ఎంపిక ప్రక్రియలో తొలిదశ రాత పరీక్ష రెండు సెషన్లుగా 270 మార్కులకు ఉంటుంది. సెషన్‌ 1లో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ మ్యాథమెటికల్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలు-60 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌  ప్రాబ్లమ్‌ సా­ల్వింగ్‌ 20 ప్రశ్నలు-60 మార్కులకు; అలాగే సెషన్‌ 2లో జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు-75 మార్కుల­కు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు-75 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెషన్‌కు కేటాయించిన సమయం 45 నిమిషాలు. రెండో సెషన్‌లో మాత్రం నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

13 భాషల్లో రాత పరీక్ష

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్, హవాల్దార్‌ పరీక్షను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠి, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో రాత పరీక్ష ఉంటుంది.

చ‌ద‌వండి: IAS Anju Sharma Success Story: ప‌ది, ఇంట‌ర్‌లో ఫెయిల‌య్యా... ఈ అప‌జ‌యాలే న‌న్ను 22 ఏళ్ల‌కే ఐఏఎస్‌ను చేశాయ్‌... అంజు శ‌ర్మ స‌క్సెస్ స్టోరీ

తదుపరి దశ పీఈటీ, పీఎస్‌టీ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ఆయా విభాగాల్లో నిర్దేశించిన కటాఫ్‌ మార్కుల ఆధారంగా రాత పరీక్ష విజేతలను ప్రకటిస్తారు. వీరికి తదుపరి దశలో ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా నడక పరీక్ష ఉంటుంది. ఇందులో పురుష అభ్యర్థులు 1,600 మీటర్లను 15 నిమిషాల్లో, మహిళా అభ్యర్థులు ఒక కిలో మీటర్‌ దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంటుంది.

ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌

  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌లో హవాల్దార్‌ పోస్ట్‌ల అభ్యర్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగుండాలి.
  • పురుష అభ్యర్థులు కనీసం 157.5 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతీ విస్తీర్ణం 81 సెం.మీ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు అయిదు సెంటీ మీటర్లు విస్తరించాలి.
  • మహిళా అభ్యర్థులు కనీసం 152 సెం.మీ ఎత్తు ఉండాలి.

కనీస అర్హత మార్కులు

రాత పరీక్ష నుంచి అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేసే క్రమంలో కనీస అర్హత మార్కుల నిబంధన విధించారు. ప్రతి సెషన్‌లో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు 30 శాతం మార్కులు; ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 25 శాతం మార్కులు; ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అదే విధంగా సెషన్‌-1లో కనీస అర్హత మార్కులు సాధిస్తేనే.. సెషన్‌-2 పేపర్ల మూల్యాంకన చేస్తారు. సెషన్‌-2లో పొందిన ప్రతిభ ఆధారంగానే తుది జాబితా రూపొందిస్తారు.

కొలువు ఖాయమైతే

అన్ని దశల్లోనూ విజయం సాధించి కొలువు ఖరా­రు చేసుకుంటే.. ప్రారంభంలోనే పే లెవల్‌-1తో రూ.­18,000-రూ.56,900 వేతన శ్రేణిలో నెల వేత­నం అందుకోవచ్చు. బేసిక్‌ పేతోపాటు ఇతర అలవెన్సు­లు కూడా లభిస్తాయి. దీంతో పాటు అర్హతలు పెంచుకుంటూ ఆయా డిపార్ట్‌మెంట్‌లు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణతతో ఆయా శాఖల్లో సెక్షన్‌ ఆఫీసర్, సూపరింటెండెంట్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

విజయం సాధించాలంటే
సిలబస్‌పై అవగాహన

ప్రిపరేషన్‌ ప్రారంభించే ముందు.. అభ్యర్థులు సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించాలి. పాత్ర ప్రశ్న పత్రాలను విశ్లేషించాలి. దాని ఆధారంగా ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ఈ పరీక్షకు సంబంధించి పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనివల్ల పరీక్షల్లో అడిగే ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పడుతుంది.

న్యూమరికల్, మ్యాథమెటికల్‌ ఎబిలిటీ

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం అర్థమెటిక్‌తోపాటు ప్యూర్‌ మ్యాథ్స్‌ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. నంబర్‌ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, రేషియోస్, అల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, లీనియర్‌ ఈక్వేషన్స్, టాంజెంట్స్‌ వంటి ప్యూర్‌ మ్యాథ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ

గుర్తులు, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, రిలేషన్‌ షిప్, క్లాసిఫికేషన్, నంబర్‌ సిరీస్, సిమాటిక్‌ అనాలజీ, ఫిగరల్‌ అనాలజీ, వెన్‌ డయాగ్రమ్స్, డ్రాయింగ్‌ ఇన్ఫరెన్సెస్‌ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌

జాతీయ, అంతర్జాతీయ సమకాలీన పరిణామా­లు మొదలు జనరల్‌ సైన్స్, ఎకానమీ,హిస్టరీ, జాగ్ర­ఫీ, పాలిటీ తదితర అంశాలపై దృష్టి పెట్టాలి. హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్ర, స్వా­తంత్య్రోద్యమ ఘట్టాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. జాగ్రఫీలో సహజ వనరులు, నదులు, పర్వతాలు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌కు సంబంధించి ఇటీవల కాలంలో ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఏర్పడిన కీలక పరిణామాలపై దృష్టి పెట్టాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పదజాలంపైనా పట్టు సాధించాలి. సీహెచ్‌ఎస్‌ఎల్‌ అభ్యర్థులు కరెంట్‌ అఫైర్స్‌ను కీలకంగా భావించాలి. ము­ఖ్యమైన సమకాలీన పరిణామాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టాక్‌ జీకేకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు, తేదీలు, సదస్సులు, సమావేశాలు, అవార్డులు-విజేతలు వంటి వాటిని ఔపోసన పట్టాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

ఈ విభాగంలో రాణించేందుకు వ్యాకరణంపై పట్టు సాధించాలి. పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌ మొదలు ప్యాసేజ్‌ కాంప్రహెన్షన్‌ వరకూ.. అన్ని రకాల గ్రామర్‌ అంశాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా యాక్టివ్‌ అండ్‌ పాసివ్‌ వాయిస్, డైరెక్ట్‌ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, సినానిమ్స్, యాంటానిమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌లపై పట్టు సాధించాలి.

పునశ్చరణ, మోడల్‌ టెస్టులు

అభ్యర్థులు నిరంతరం పునశ్చరణ కొనసాగించేలా ప్లాన్‌ చేసుకోవాలి. అదేవిధంగా ఒక టాపిక్‌ లేదా యూనిట్‌ చదవడం పూర్తయ్యాక..నమూనా పరీక్షలు, మాక్‌ టెస్ట్‌లు రాయాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. ఇందుకోసం పదో తరగతి స్థాయిలోని గణిత పుస్తకాలతో తమ ప్రిపరేషన్‌ ప్రారంభించాలి. వాటి ద్వారా ముందుగా కాన్సెప్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్‌ దృక్పథంతో ప్రాక్టీస్‌ చేయాలి. ఫలితంగా ఆయా అంశాలపై పట్టు లభిస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూలై 21, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: జూలై 26- జూలై 28
  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ తేదీ: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

చ‌ద‌వండి: SSC : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు... ప్రారంభ వేత‌నం రూ.35 వేలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date July 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories