SSC : పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... ప్రారంభ వేతనం రూ.35 వేలు
మల్టీటాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్ నాన్-మినిస్టీరియల్) 1198.. హవల్దార్ (గ్రూప్-సి, నాన్ మినిస్టీరియల్) 360.. మొత్తం 1558 పోస్టులు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి/ తత్సమాన పరీక్ష పాసవ్వాలి.
వయసు: 01.08.2023 నాటికి పోస్టును అనుసరించి 18-25, 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల వారీగా వయసు సడలింపు ఉంటుంది.
July Month Exams: జులైలో నిర్వహించనున్న ప్రభుత్వ పరీక్షల తేదీలు ఇవే...
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలకు ఫ్రీ
జీతం: హవల్దార్ పోస్టుకు లెవెల్-1, ఏడో పే కమిషన్ ప్రకారం మూలవేతనం రూ.18,000 ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ అన్నీ కలిపి రూ.31,000 వేతనం అందుకోవచ్చు.
ఎంటీఎస్ అభ్యర్థులకు వేతనం రూ.35,000 వరకూ ఉంటుంది.
Central Bank of India: డిగ్రీ అర్హతతో 1000 మేనేజర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
ఎంపిక: ఎంటీఎస్ పోస్టులకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌తోపాటు.. తమిళ్, తెలుగు, ఉర్ద్దూ లాంటి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.
హవల్దార్ పోస్టుకు.. అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)కు హాజరుకావాలి.
IBPS 2023: డిగ్రీ అర్హతతో 4,045 బ్యాంకు క్లర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
హవల్దార్ పోస్టుకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెషన్-2లో సాధించిన మార్కులు, పీఈటీ/పీఎస్‌టీ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల షార్ట్‌లిస్టును తయారుచేస్తారు. పీఈటీ/పీఎస్‌టీలో అర్హత సాధించనివాళ్లను హవల్దార్ పోస్టుకు ఎంపిక చేయరు.
☛ దరఖాస్తుకు చివరి తేదీ: 21.07.2023
☛ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 24.07.2023
☛ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు: సెప్టెంబరు, 2023
☛ మరిన్ని వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్