Skip to main content

July Month Exams: జులైలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ పరీక్ష‌ల తేదీలు ఇవే...

తెలంగాణ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ల ప‌రీక్ష‌లు వ‌రుస‌గా నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయి. జులైలో టౌన్ ప్లానింగ్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్.. ఇలాంటి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.
July Month Exams
జులైలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ పరీక్ష‌ల తేదీలు ఇవే...

జులైలో నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష‌ల వివ‌రాలు ఇక్క‌డ తెలుసుకుందాం. 

☛ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్‌సీర్ ఉద్యోగానికి ఈనెల 8వ తేదీన ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. 

☛ వెట‌ర్న‌రీ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ప‌రీక్ష 13, 14వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది. 

☛ జూనియ‌ర్ ఇంజినీర్ ప్రిలిమ్స్ ప‌రీక్ష 16వ తేదీ జ‌ర‌గ‌నుంది.

TSPSC Group 4 Question Paper & Key 2023 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 రాత‌ప‌రీక్ష కొశ్చ‌న్ పేప‌ర్‌ & 'కీ'

☛ గ్రౌండ్ వాట‌ర్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష‌ను ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు.

☛ టెక్నిక‌ల్‌, ల్యాబ్ అసిస్టెంట్ ప‌రీక్ష 20, 21వ తేదీల్లో జ‌ర‌గ‌నుంది.

☛ ఎస్ఎస్‌సీ నిర్వ‌హించ‌నున్న సీజీఎల్ టైర్ 1 ప‌రీక్ష 14వ తేదీ నుంచి 27వ తేదీల మ‌ధ్య జ‌ర‌గ‌నుంది.

☛ ఇక యూపీఎస్సీ నిర్వ‌హించ‌నున్న కంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామ్ 16వ తేదీ జ‌ర‌గ‌నుంది. 

☛ ఏపీలో సివిల్ జ‌డ్జి ఖాళీల‌ కోసం నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష 4, 5, 6వ తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి.

Threads: ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్’... కొత్త యాప్‌తో ఎలాన్‌మ‌స్క్‌కు చిక్కులు త‌ప్ప‌వా.?

Published date : 04 Jul 2023 06:53PM

Photo Stories