Threads: ట్విటర్‌కు పోటీగా ‘థ్రెడ్’... కొత్త యాప్‌తో ఎలాన్‌మస్క్‌కు చిక్కులు తప్పవా.?
ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌కు ప్రత్యామ్నాయమైన బ్లూ స్కై, మాస్టోడాన్ లాంటి మైక్రోబ్లాగింగ్ యాప్స్ వైపు చూస్తున్నారు యూజర్లు.
ఈ తరుణంలో మస్క్‌ను మరింత ఇబ్బందుల్లో నెట్టేలా మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ‘థ్రెడ్’ పేరుతో ట్విటర్ తరహా మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ యాప్‌ను జులై 7న విడుదల చేయనున్నారు. యాప్ వివరాలు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేశాయి.
NEET 2023 Racket: నీట్‌లో భారీ కుంభకోణం... ఏడు లక్షలకు పరీక్ష రాసి పోలీసులకు చిక్కిన ముఠా..!
థ్రెడ్ యాప్ విడుదల తర్వాత ఇన్‌స్ట్రాగ్రామ్ యూజర్లు వారి ఇన్‌స్టా ఐడీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రాజెక్ట్ 92’ కోడ్ నేమ్‌తో ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రమ్, ట్విటర్‌లే గుత్తాధిపత్యం సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే యూజర్ల డేటా విక్రయించుకుంటోందని ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెళ్లువెత్తుతున్న నేపథ్యంలో ఎఫ్బీ అధినేత తీసుకురానున్న థ్రెడ్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.