Skip to main content

NEET 2023 Racket: నీట్‌లో భారీ కుంభ‌కోణం... ఏడు ల‌క్ష‌ల‌కు ప‌రీక్ష రాసి పోలీసుల‌కు చిక్కిన ముఠా..!

దేశవ్యాప్తంగా వైద్య విద్య‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలో భారీ మోసం వెలుగుచూసింది. నీట్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు అభ్య‌ర్థులు కొంద‌రు అడ్డ‌దారులు తొక్కారు. ఎలాగైన ర్యాంకు సాధించాల‌నే ఉద్దేశంతో మోసానికి పాల్ప‌డ్డారు. విద్యార్థుల ఆశ‌ను ప‌సిగ‌ట్టిన కొంత‌మంది ముఠా అసలైన అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయించింది.
NEET 2023 Racket
నీట్‌లో భారీ కుంభ‌కోణం... ఏడు ల‌క్ష‌ల‌కు ప‌రీక్ష రాసి పోలీసుల‌కు చిక్కిన ముఠా..!

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఇందుకు వేదికైంది. ఎయిమ్స్‌లో విద్య‌న‌భ్య‌శిస్తున్న‌ విద్యార్థులే మోసానికి తెర‌లేపిన‌ట్లు వెల్ల‌డైంది. ఈ కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. ఈ ముఠా నాయకుడితో సహా నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు.

Medical Students: ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌...ఇక‌పై సీట్ల‌న్నీ స్థానికుల‌కే... ఎక్క‌డంటే

ఢిల్లీ ఎయిమ్స్‌లో రేడియాలజీ సెకండియ‌ర్‌ చదువుతున్న నరేశ్ బిష్రోయ్ సూత్ర‌ధారి. అత‌ని క‌నుస‌న్న‌ల్లోనే ఈ రాకెట్‌ నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నీట్‌ పరీక్షలో అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను ఏర్పాటు చేయించి వారితో పరీక్ష రాయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డబ్బులు ఆశజూపి అనేక మంది ఎయిమ్స్‌ విద్యార్థులను నిందితుడు తన గ్యాంగ్‌లో చేర్చుకున్నాడు. 

NEET

ఎక్కువగా ఎయిమ్స్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో నీట్‌ పరీక్ష రాయించేవాడు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ ప్రవేశ పరీక్షలో నరేశ్ గ్యాంగ్‌కు చెందిన పలువురు కేటుగాళ్లు అభ్యర్థుల స్థానంలో పరీక్ష రాస్తూ అధికారులకు చిక్కారు. ఎయిమ్స్‌లో రేడియాలజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంజూ యాదవ్‌ అనే విద్యార్థి.. వేరే అభ్యర్థి స్థానంలో నీట్‌ పరీక్ష రాస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికాడు. 

MBBS internship: ఎంబీబీఎస్‌లో కీల‌క మార్పులు... రెండో ఏడాది నుంచి కాలేజీ మార్పు అస్స‌లు కుద‌ర‌దు... ప‌రీక్ష పేప‌ర్ల‌లోనూ అమ‌లు

NEET

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఓ నీట్‌ పరీక్షా కేంద్రంలో మరో ఇద్దరు విద్యార్థులు మహవీర్‌, జితేంద్ర ఇలాగే పట్టుబడ్డారు. వీరందిరిని విచారించగా.. ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. దీంతో సోమవారం ఈ ముఠా నాయకుడు నరేశ్ బిష్రోయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నరేశ్‌ తన రెండో సంవత్సరం పరీక్ష రాస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

NEET 2023 Rankers: నీట్‌లో అద‌ర‌గొట్టిన‌ గొర్రెల కాప‌ర్ల కూతుర్లు... పూరి గుడిసెలో ఉంటూ.. కోచింగ్‌కు డ‌బ్బులు లేక‌పోవ‌డంతో...

NEET

నకిలీ విద్యార్థులతో ప్రవేశ పరీక్ష రాయించేందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.7లక్షలతో ఈ గ్యాంగ్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. తొలుత రూ.లక్ష అడ్వాన్స్‌ తీసుకుని, పరీక్ష రాసిన తర్వాత రూ.6లక్షలు తీసుకునేవారు. ఈ ముఠాలో ఇంకా ఎంతమంది విద్యార్థులున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Telangana: నీట్ యూజీ-2023 ర్యాంకులు విడుద‌ల‌.. టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..

Published date : 04 Jul 2023 03:10PM

Photo Stories