Skip to main content

Ponnam Prabhakar: ‘గురుకులాల్లో ఇది పాసైతే నేరుగా ఇంటర్‌లోకి’

సాక్షి, హైదరాబాద్‌: గురుకులాల్లో పదోతరగతి చదువుకున్న విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.
If you pass 10th Gurukul then directly into Inter  Minister Ponnam Prabhakar discussing direct admissions for Gurukul students  Announcement of direct admissions for 10th standard Gurukul students in Hyderabad  Educational policy announcement by Minister Ponnam Prabhakar in Hyderabad

ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. ఇప్పటివరకు ఇంటర్‌లో ప్రవేశాలకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించేవారమని, ఇకపై గురుకులంలో పదోతరగతి చదివి ఉత్తీర్ణత సాధిస్తే ఇంటర్‌లో ప్రవేశం కల్పించనున్నట్లు వివరించారు. అక్టోబర్ 7న‌ బంజారాహిల్స్‌లోని కుమురంభీమ్‌ ఆదివాసీభవన్‌లో  జరిగిన బీసీ సంక్షేమ శాఖ విస్తృతస్థాయి అధికారుల సమావేశం లో మంత్రి పొన్నం అధికారులకు పలు సూచనలు చేశారు.

చదవండి: Nukamalla Indira: ఎంపీటీసీ నుంచి స్కూల్‌ టీచర్‌గా

గురుకుల విద్యార్థులకు 8వ తరగతి నుంచే ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, రెడ్‌క్రాస్‌లకు సంబంధించిన అంశాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి గురుకుల పాఠశాలలో ఎంసెట్, నీట్‌ కోచింగ్‌ ఇవ్వాలని సూచించారు. గురుకులాల్లోని సమస్యల పరిష్కారానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నుంచి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అక్టోబర్ 15–31 తేదీల మధ్య పేరెంట్, టీచర్‌ మీటింగ్‌ తప్పకుండా నిర్వహించాలన్నారు. గురుకుల అద్దె బకాయిల్లో 50 శాతం వారం రోజుల్లోగా చెల్లిస్తామని తెలిపారు. సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గురుకులంలో బాక్స్‌ ఏర్పాటు చేసి పరిశీలించాలని ఆర్జీఓలను ఆదేశించారు.  ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం,  ఉన్నతాధికారులు  బాల మాయాదేవి,  బి.సైదులు,   మల్లయ్యభట్టు, ఎంబీసీ కార్పొరేషన్‌ ఎండీ అలోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Published date : 08 Oct 2024 12:20PM

Photo Stories