Skip to main content

Nukamalla Indira: ఎంపీటీసీ నుంచి స్కూల్‌ టీచర్‌గా

మునగాల: మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన నూకమళ్ల ఇందిర ఏకకాలంలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
Nukamalla Indira  Indira from Munagala mandal secures three government jobs  Success story of Nukamalla Indira with multiple government jobs Government job success

ఈమె భర్త నూకమళ్ల రామకృష్ణ. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2019లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొంది గ్రామాభివృద్ధిలో భాగస్వామురాలు అయింది. ఓ వైపు వైవాహిక జీవితం, మరోవైపు రాజకీయ జీవితం కొనసాగిస్తూ నిరంతరం, పట్టుదలతో చదివి ఉద్యోగాల సాధనకు వేట కొనసాగించింది.

చదవండి: DSC 2024 Merit List: జిల్లాకు చేరిన డీఎస్సీ మెరిట్‌ జాబితా

కొద్ది రోజుల క్రితం గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు ఉద్యోగం పొందింది. ప్రస్తుతం అనంతగిరి మండలంలో విధులు నిర్వహిస్తోంది. అంతేకాకుండా హాస్టల్‌ వెల్ఫేర్‌లో జాబ్‌ సాధించింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఎస్‌జీటీ పోస్టుకు ఎంపికై ంది. తాను మూడు ఉద్యోగాలు సాధించడంలో తన భర్త కృషి ఎంతగానో ఉందని ఇందిర పేర్కొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 05 Oct 2024 04:55PM

Photo Stories