IBPS 2023: డిగ్రీ అర్హతతో 4,045 బ్యాంకు క్లర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి
అర్హత: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం.
వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులకు ప్రిలిమ్స్, రెండోది 200 మార్కులకు మెయిన్స్. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.
ఐబీపీఎస్‌లో సెలెక్ట్ అయిన వారు... బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈ బ్యాంకులలో పనిచేయాల్సి ఉంటుంది.
మొయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా బ్యాంకులు పిలుస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ: నేటి నుంచి అంటే జులై ఒకటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష: ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరుల్లో నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్ష: ప్రిలిమ్స్ పరీక్ష పాసైన వారు మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. ఈ పరీక్ష ఈ ఏడాది అక్టోబరులో నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21-07-2023.
నోటిపికేషన్, మరిన్ని వివరాలకు ibpsonline.ibps.in వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్