Skip to main content

IBPS PO/MT Notification : ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ నోటిఫికేషన్‌ విడుదల.. ఆరు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4,455 పోస్ట్‌లు

బ్యాంకింగ్‌ రంగంలో ఆఫీసర్‌ కెరీర్‌ కోరుకునే అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్‌గా కొలువుదీరే అవకాశం స్వాగతం పలుకుతోంది! అందుకు మార్గం..
IBPS PO/MT Notification for jobs in Six Public Sector Banks  IBPS PO/MT Recruitment Notification IBPS PO Exam Pattern Overview  Selection Process Details  Exam Preparation Tips  IBPS PO Syllabus Topics   Exam Preparation Resources

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌) ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌ నోటిఫికేషన్‌!! మొత్తం 4,455 పీఓ పోస్ట్‌ల భర్తీకి తాజాగా ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో..ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఫర్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌–14 పోస్టులు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదతర వివరాలు.. 

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మూడు వేల పోస్టుల భర్తీ

ఆరు బ్యాంకుల్లో 4,455 పోస్ట్‌లు

ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఫర్‌ పీఓ/ఎంటీ (14)–2025–26 ప్రక్రియ ద్వారా ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకు­ల్లో మొత్తం 4,455 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–885 పోస్టులు, కెనరా బ్యాంక్‌–750 పోస్టులు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా–2,000 పోస్టులు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌–260 పోస్టులు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌–200 పోస్టులు, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌–360 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే నాటికి బ్యాంక్‌ ఆఫ్‌ బ­రోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి కూడా ఖాళీల వివరాలు ఐబీపీఎస్‌కు చేరే అవకాశం ఉంది. దీంతో.. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే నాటికి పోస్ట్‌లసంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది.
అర్హతలు
ఆగస్ట్‌21, 2024 నాటికి గుర్తింపు పొందిన యూ­నివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు
ఆగస్ట్‌ 1, 2024 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎసీ/ఎస్టీ కేటగిరీల అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రీమీ లేయర్‌) అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. 

NMMS Exam Notification : విద్యార్థుల ఉన్న‌త చ‌దువుకు ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ త‌ర‌గ‌తుల‌కే..!

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీఓ/ఎంటీ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ఐబీపీఎస్‌ మూడు దశల్లో జరుపుతుంది. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ. వీటిలో ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌లను ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షల్లో ప్రతిభ చూపి నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ ఖరారవుతుంది.
వంద మార్కులకు ప్రిలిమ్స్‌
పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్షను మూడు విభాగాల్లో వంద మార్కులకు నిర్వహిస్తారు. అవి..ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం ఒక గంట. 
ప్రతి సెక్షన్‌లోనూ ఐబీపీఎస్‌ నిర్దిష్ట కటాఫ్‌ మా­ర్కులను నిర్ణయిస్తుంది. ఆ కటాఫ్‌ మార్కుల జాబితాలో నిలిచిన వారికి మెయిన్‌ ఎగ్జామినేషన్‌కు అర్హ­త లభిస్తుంది. ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున(1:10 నిష్పత్తిలో) మెయిన్‌కు ఎంపిక చేస్తారు.

CM Revanth Reddy US Tour: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 30,750 ఉద్యోగాలు.. 19 కంపెనీలతో ఒప్పందాలు

200 మార్కులకు మెయిన్‌ పరీక్ష
రెండో దశలో మెయిన్‌ పరీక్షను నాలుగు విభాగా­ల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 45 ప్రశ్నలు–60 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు–40 మార్కులు, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌
మెయిన్‌ ఎగ్జామ్‌లో భాగంగాను ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌ అండ్‌ ఎస్సే) విభాగం పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ఒక ఎస్సే, ఒక లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. పరీక్ష సమయం 30 నిమిషాలు. ఇది అభ్యర్థుల ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరిశీలించే పరీక్ష.

Engineering Colleges in Telangana : 69 శాతం ఇంజినీరింగ్ కాలేజీలు ఈ జిల్లాల్లోనే.. కోర్ బ్రాంచ్‌ల‌పై అవ‌గాహ‌న..

పర్సనల్‌ ఇంటర్వ్యూ
మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో పొందిన మార్కులు ఆధారంగా.. సెక్షన్‌ల వారీ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను నిర్దేశించి ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు వంద. ఇందులో అభ్యర్థులు కనీస అర్హత మార్కులు 
సాధించాల్సి ఉంటుంది.
వెయిటేజీ విధానం
తుది జాబితా రూపకల్పనలో వెయిటేజీ విధానా­న్ని అమలు చేస్తున్నారు. మెయిన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు. మెయిన్‌ పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. మొత్తంగా వంద మార్కులకు వెయిటేజీలను క్రోడీకరించి.. తుది విజేతల జాబితాను సిద్ధం చేస్తారు. 

AP Village Secretariat : గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పుల‌పై ప్ర‌భుత్వ నిర్ణ‌యం..!

ముఖ్య సమాచారం
➺    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
➺    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఆగస్ట్‌ 21.
➺    ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం.
➺    మెయిన్‌ పరీక్ష: నవంబర్‌లో జరిపే అవకాశం.
➺    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: ఠీఠీఠీ.జీbpట.జీn 


రాత పరీక్షల్లో రాణించేలా
ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలో కీలకమైన రీజనింగ్‌ ప్రిపరేషన్‌ పరంగా అభ్యర్థులు పకడ్బందీగా వ్యవహరించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
➺    క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్‌పై పట్టు సాధించాలి. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీస్, డేటా అనాలిసిస్‌ విభాగాలను కూడా సాధన చేస్తే ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.

Students Preparation Test : స‌ర్కారు విద్యార్థుల్లో సామ‌ర్థ్య‌న్ని వెలికితీసే ప‌రీక్ష‌.. రేప‌టి నుంచి..

➺    అభ్యర్థుల్లోని విశ్లేషణ సామర్థ్యం, తులనాత్మకను పరిశీలించే డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి.
➺    జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి జాతీయ ఆర్థిక రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పు­లు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి. 
➺    ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ కోసం బేసిక్‌ గ్రామర్‌తో మొ­ద­లు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

Engineering Admissions : స‌ర్కారు కాలేజీల్లో ఏటా పెరుగుతున్న మిగులు సీట్లు.. విద్యార్థుల ఆస‌క్తి ఇదేనా..!

➺    డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే ఇంగ్లిష్‌ ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు చదవడం, ఎడిటోరియల్స్‌ను చదవడం మేలు చేస్తుంది.
➺    డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ కోసం కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబు ల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్‌ చేయాలి. 

NEET UG Counselling 2024 : నీట్ యూజీ ప్ర‌వేశాల‌కు మూడు విడ‌త‌ల్లో కౌన్సెలింగ్‌.. ఈ పత్రాలు త‌ప్ప‌నిస‌రి..!

Published date : 12 Aug 2024 12:14PM

Photo Stories