Skip to main content

NMMS Exam Notification : విద్యార్థుల ఉన్న‌త చ‌దువుకు ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ త‌ర‌గ‌తుల‌కే..!

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష­ను నిర్వహిస్తుంది.
Central Government scholarship for talented students  Notification for National Means Merit Scholarship examination 2024  AP Government releases NMMS scholarship notification  NMMS examination notification by AP Directorate of Government Examinations  Scholarship opportunities for economically backward students  National Means cum Merit Scholarship exam notification for students higher education

తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.  
»    స్కాలర్‌షిప్‌ వివరాలు: ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 అందజేస్తారు. ఇది తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ పూర్తిచేసే వరకు స్కాలర్‌షిప్‌ లభిస్తుంది. 
అర్హత
»    ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి.
»    ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి.
»    విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపికచేస్తారు.
»    రాతపరీక్ష: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాష్ట్ర స్థాయిలో రెండు పేపర్ల రాతపరీక్షలు నిర్వహిస్తారు.
»    పరీక్ష విధానం 
మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (మ్యాట్‌):
మొత్తం 90 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.
స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(శాట్‌): మొత్తం 90 మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 90 ప్రశ్నలు ఉంటాయి. 7, 8 తరగతుల స్థాయిలో సోషల్, సైన్స్, మ్యాథ్స్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.
»    దరఖాస్తు విధానం: రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. తర్వాత ఆ దరఖాస్తుల ప్రింటవుట్లను, ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపాలి.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.09.2024
»    ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసేందుకు చివరితేది: 06.09.2024.
»    పరీక్ష ఫీజు చెల్లింపునకు చివరితేది: 10.09.2024.
»    దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేది: 10.09.2024.
»    డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ఆమోదం పొందేందుకు చివరితేది: 15.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.bse.ap.gov.in

Engineering Colleges in Telangana : 69 శాతం ఇంజినీరింగ్ క‌లేజీలు ఈ జిల్లాల్లోనే.. కోర్ బ్రాంచ్‌ల‌పై అవ‌గాహ‌న..

Published date : 12 Aug 2024 12:03PM

Photo Stories