AP Village Secretariat : గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులపై ప్రభుత్వ నిర్ణయం..!
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్ధలో పలు కీలక మార్పులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బందిని ప్రక్షాళన చేస్తూనే ఎక్కువ ఉన్నవారిని ఇతర శాఖల్లో బదిలీ చేసేందుకు చూస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు మరికొన్ని మార్పులకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ముందుగా గ్రామ సచివాలయాల పేరును మార్చేసి గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చనున్నట్లు తెలుస్తోంది. అక్కడ డీడీఓగా సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు, జాబితాను తయారు చేయాలని ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అనే సమాచారం కూడా అందుతోంది.
Engineering Admissions : యూనివర్సిటీల్లోనే విద్యార్థుల ప్రవేశాలు.. మరి సర్కారు కాలేజీలు!
ఇదిలా ఉంటే, మరోవైపు గ్రామ పంచాయితీ కార్యాలయం, గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేసి అక్టోబర్ 2 నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పని చేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags
- AP Village Secretariats
- Key changes
- government employees
- AP government
- YSRCP
- Village secretariats
- Village Welfare Office
- TDP Govt
- Gram Panchayat Office
- ap government schemes
- welfare assistants
- Education News
- Sakshi Education News
- AndhraPradeshGovernment
- SecretariatChanges
- StaffPurging
- StateGovernmentReforms
- YCPRegime
- AdministrativeChanges
- StaffTransfers
- Secretariat restructuring
- DepartmentTransfers
- sakshieducationlatest news