Skip to main content

Central Bank of India: డిగ్రీ అర్హ‌త‌తో 1000 మేనేజర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI) భారీగా ఉద్యోగ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా డైరెక్ట్‌గా బ్యాంకు మేనేజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Central Bank of India
డిగ్రీ అర్హ‌త‌తో 1000 మేనేజర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2: 1000 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. 
ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకు/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. 
లేదా ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకు/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయ‌సు: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

IBPS 2023: డిగ్రీ అర్హ‌త‌తో 4,045 బ్యాంకు క్ల‌ర్ ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

Banks

జీతం: రూ.48,170-రూ.69,810.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక 

దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.

మ‌రిన్ని వివ‌రాల‌కు ibpsonline.ibps.in సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. 

                                       ఇక్క‌డ క్లిక్ చేసి డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి

 లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

Published date : 03 Jul 2023 03:34PM
PDF

Photo Stories