Skip to main content

CBI Apprentices Recruitment 2024: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 అప్రెంటిస్ ఖాళీలు

CBI Apprentices Recruitment 2024 3000 vacant posts in cbi  5000 vacancies notifications   Online application process

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ) ఐదు వేల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సీబీఐలో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం ఈ భారీ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులోభాగంగా, 5 వేల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 3000 (అప్రెంటీస్‌)
శిక్షణ కాలం: ఒక ఏడాది
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 


వయస్సు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 
స్టైపెండ్: నెలకు రూరల్/ సెమీ అర్బన్, అర్బన్‌/మెట్రో శాఖాలకు నెలకు రూ.15,000.
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 21, 2024
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 06,2024
పరీక్ష తేది: మార్చి 10, 2024

Published date : 22 Feb 2024 04:59PM

Photo Stories