IDBI Bank Jobs : ఐడీబీఐ బ్యాంక్‌లో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 600
» పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ జనరల్–500, అగ్రి అసెట్ ఆఫీసర్(ఏఏవో)–100.
» జోన్లు: అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కొచ్చి, ముంబై, నాగ్‌పూర్, పుణె, పాన్ ఇండియా.
» అర్హత: గ్రేడ్ ‘ఒ’ జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, గ్రేడ్ ‘ఒ’ స్పెషలిస్ట్ పోస్టులకు బీఎస్సీ/బీటెక్/బీఈ(అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీస్ సైన్స్/ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్/టెక్నాలజీ, ఫుడ్ సైన్స్/టెక్నాలజీ, పిసికల్చర్, ఆగ్రో ఫారెస్ట్రీ, సెరికల్చర్) ఉత్తీర్ణులవ్వాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. కంప్యూటర్/ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 01.10.2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయసులో సడలింపు ఇస్తారు.
» పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: లాజికల్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్/కంప్యూటర్/ఐటీ. గ్రేడ్ ‘ఒ’ స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2024.
» ఫీజు చెల్లింపు చివరితేది: 30.11.2024.
» ఆన్‌లైన్ పరీక్ష తేది: డిసెంబర్ 2024/జనవరి 2025.
» వెబ్‌సైట్: https://www.idbibank.in
Teaching Posts in AP : సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్ పోస్టులు