Skip to main content

Bank Jobs: సెంట్ర‌ల్ బ్యాంకులో 5వేల ఖాళీలు... పూర్తి వివ‌రాలు ఇవే

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సెంట్ర‌ల్ బ్యాంక్‌ శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశ‌వ్యాప్తంగా 5000 ఖాళీలు ఉండ‌గా... ఇందులో ఏపీలో 141, తెలంగాణ‌లో 106 ఖాళీలు ఉన్నాయి. 5 వేల ఖాళీల‌ను రిజ‌ర్వేష‌న్ల ఆధారంగా భ‌ర్తీ చేయ‌నున్నారు.
Central Bank of India
Central Bank of India

ఎస్సీ - 763, ఎస్టీ- 416, ఓబీసీ- 1162, ఈడబ్ల్యూఎస్‌- 500, జనరల్ అభ్య‌ర్థుల‌కు- 2159 చొప్పున రిజ‌ర్వ్ చేశారు. అప్రెంటిస్‌షిప్ ఏడాది పాటు ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 
స్టైపెండ్: నెలకు రూ.10000(రూరల్‌ బ్రాంచ్‌), రూ.12000(అర్బన్‌ బ్రాంచ్‌), రూ.15000(మెట్రో బ్రాంచ్‌)తో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. 1. క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ 2. బేసిక్ రిటైల్ లయబిలిటీ ప్రొడక్ట్స్ 3. బేసిక్ రిటైల్ అసెట్ ప్రొడక్ట్స్ 4. బేసిక్ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ప్రొడక్ట్స్ 5. బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 03-04-2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఏప్రిల్ 2వ వారం, 2023.

Published date : 21 Mar 2023 07:11PM

Photo Stories