Skip to main content

AP State Skill Development Corporation Job Mela: జాబ్‌మేళాతో ఉపాధి

సాక్షి ఎడ్యుకేష‌న్ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడమే ముఖ్య ఉద్దేశంతో ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జాబ్‌ మేళాను నిర్వహిస్తోందని జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సురేష్‌ తెలిపారు.
Andhra Pradesh State Skill Development Corporation Job Mela
Andhra Pradesh State Skill Development Corporation Job Mela

మంగళవారం రైల్వేకోడూరు పట్టణంలోని సాయిడిగ్రీ కళాశాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఇందులో 16 కంపెనీలు పాల్గొన్నట్టు ఆయన తెలిపారు.

Scholarships: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫ్రీ

ఈ జాబ్‌మేళాలో 1000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి స్కిల్‌ డెవలప్మెంట్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. చదువుతో పాటు ప్రతి ఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. అనంతరం జెట్పీటీసీ రత్నమ్మ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ జాబ్‌మేళాకు 424 మంది హాజరవ్వగా 176 మంది యువతీ, యువకులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ముత్యాల పెంచలయ్య, శ్రీనివాసులు, జిల్లా స్కిల్‌ డెవలప్మెంట్‌ అఽధికారి హరిక్రిష్ణ, వివిధ కంపెనీల ప్రతినిధులు, అఽధికారులు పాల్గొన్నారు.

Published date : 26 Jul 2023 12:09PM

Photo Stories