Skip to main content

Free Web Design Course: ఉచితంగా వెబ్‌ డిజైన్‌ కోర్సు

సాక్షి, అమరావతి: విద్యార్థులకు మెరుగైన కెరీర్‌ అవకాశాల కోసం ఉచితంగా Web Design కోర్సులను అందిస్తున్నట్టు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌­ఎస్‌డీసీ) మార్చి 19న‌ ఓ ప్రకటనలో తెలిపింది.
Free web design course   Career Opportunities  APSSDC  free course  digital skills  online learning

ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్‌ ఇంక్యుబేట్‌ చేసిన హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ ఎడ్‌టెక్‌ కంపెనీ ‘గువి’, ఏపీఎస్‌ఎస్‌డీసీ భాగస్వామ్యంతో స్కిల్‌–ఏ–థాన్‌ కోర్సులను ప్రారం­భిం­చినట్టు పేర్కొంది.

ఆన్‌లైన్లో ఉచితంగా వెబ్‌ డిజైన్‌ కోర్సును తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధించడంతో పాటు కోర్సు పూర్తి చేసిన వారికి గువి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఉమ్మడి సర్టిఫికెట్‌ అందిస్తు­న్నట్లు తెలిపింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఏప్రిల్‌ 5వ తేదీలోగా https://bit.ly/APSSDC-Team వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించింది.

చదవండి: FDDI AIST Notification: ఎఫ్‌డీడీఐలో ఫ్యాషన్, డిజైనింగ్‌ విభాగాల్లో కోర్సులు.. క్యాంపస్‌లు, భవిష్యత్తు అవకాశాలు ఇవే..

మరిన్ని వివరాలకు  https://skilluniverse.apssdc.in వెబ్‌సైట్‌తో పాటు 99888 53335 నంబర్‌ను అందుబాటులోకి ఉంచింది. ఈ కోర్సులు పూర్తి చేసిన కళాశాల విద్యార్థులకు అదనపు విద్యా క్రెడిట్లు కూడా వర్తిస్తాయంది.  

Published date : 20 Mar 2024 04:44PM

Photo Stories