Skip to main content

Agniveer Recruitment: ఇండియన్‌ నేవీలో అగ్నివీర్‌ పోస్టులు

భారత నౌకాదళంలో అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా.. అగ్నివీర్‌ (ఎంఆర్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ఉంటుంది..
Agniveer Recruitment at Indian Navy 2024

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: అభ్యర్థి 01.11.2003 నుంచి 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి.
»    వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000.
»    ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, స్టేజ్‌–1(ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌),స్టేజ్‌–2(రాతపరీక్ష,శారీరక దారుఢ్య పరీక్ష–పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ /ఇంగ్లిష్‌ భాషల్లో మొత్తం 50 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 50 మార్కులు ఉంటాయి. సైన్స్, మ్యాథమేటిక్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ సబ్జెక్టుల నుంచి పదో తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. 
»    శిక్షణ: అగ్నివీర్‌లుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ నెలలో శిక్షణ ప్రారంభమవుతుంది. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 13.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 27.05.2024.
»    శిక్షణ ప్రారంభం: 2024 నవంబర్‌ నెలలో
»    వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

NIPER Admissions: ఉన్న‌త ఫార్మ‌సీ విద్య‌కు నైప‌ర్‌ ప్ర‌వేశ ప‌రీక్ష‌.. ద‌ర‌ఖాస్తులు ఇలా..!

Published date : 15 May 2024 01:04PM

Photo Stories