Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. 50కి పైగా ప్రముఖ కంపెనీలు.. 3 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు
Sakshi Education
కొండపి(మర్రిపూడి): కొండపి మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 9.30 గంటలకు మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ మండల పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ జాబ్‌మేళాను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నారన్నారు. జాబ్‌మేళాలో 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, 3 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
Published date : 06 Mar 2024 05:45PM