Apprentice Posts at CHESS: చెస్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు..
Sakshi Education
హైదరాబాద్‌లోని డీఆర్‌డీవోకి చెందిన సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ (సీహెచ్‌ఈఎస్‌ఎస్).. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(ఇంజనీర్స్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..

సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం ఖాళీల సంఖ్య: 25.
» శిక్షణ వ్యవధి: 12 నెలలు.
» విభాగాలు: గ్రాడ్యుయేట్(డిగ్రీ), టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్.
» అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి బీఈ/బీటెక్, డిప్లొమా కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి.
» స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.9000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రూ.8000.
» ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, విద్యార్హత మార్కుల శాతం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
» ప్రకటన వెలువడిన తేది: 11.05.2024.
» వెబ్‌సైట్: https://drdo.gov.in/drdo
Published date : 15 May 2024 01:25PM