Telugu Grammar for TET and DSC : ‘మ–స–జ–స–త–త–గ’ గణాలున్న పద్యపాదం.. టెట్, డీఎస్సీ పరీక్షలకు సిద్దమయ్యేలా..
వ్యాకరణం – ఛందస్సు
డీసెట్ తెలుగులో ఛందస్సు ప్రధానమైంది. విద్యార్థులు పద్య లక్షణాలు, గణాలు వంటివాటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
వృత్తాల్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం ముఖ్యమైనవి. జాతుల్లో కందం, ద్విపద లక్షణాలు తెలుసుకోవాలి. ఉపజాతుల్లో సీసం, తేటగీతి, ఆటవెలది మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి. గణాల్లో సూర్యగణాలు, ఇంద్ర గణాలపై అవగాహన ఉండాలి. డీసెట్‌లో ప్రధానంగా పద్యాల గణాలిచ్చి ఏ పద్యపాదమో గుర్తించాలని, పద్యపాదాన్ని ఇచ్చి ఏ పద్య పాదమో తెలపాలని అడుగుతారు. అలాగే సూర్య గణాలు, ఇంద్ర గణాలు కూడా కనుక్కోవాలని ప్రశ్నలు ఇస్తారు.
సూర్య గణాలు: రెండు
1) నగణం (| | |)
2) గలము లేక హగణం
ఇంద్ర గణాలు: ఆరు.
భ–ర–త–నల–నగ–సల
Wipro Company Hirings: గుడ్‌న్యూస్ చెప్పిన 'విప్రో' కంపెనీ.. త్వరలోనే 12వేల ఉద్యోగాలు
వృత్త పద్యాలు
వృత్త పద్యాల్లో అక్షర సంఖ్యా నియమం, గణ సంఖ్యా నియమం ఉంటుంది. వీటిలో యతి, ప్రాస నియమాలు విధిగా ఉంటాయి.
1. ఉత్పలమాల: ప్రతి పద్య పాదంలో ‘భ, ర, న, భ, భ, ర, వ’ అనే గణాలుంటాయి. ప్రతి పద్య పాదంలో మొదటి అక్షరానికి పదో అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. పాదం మొత్తానికి ఇరవై అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది.
ఉదాహరణ:
భ–ర–న–భ–భ–ర–వ గణాలున్నాయి. 1–10 అక్షరాలకు యతిమైత్రి చెల్లింది.
2. చంపకమాల: ప్రతి పద్య పాదంలో ‘న–జ– భ–జ–జ–జ–ర’ అనే గణాలుంటాయి. ప్రతి పాదంలో 1–11 అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. పాదం మొత్తానికి 21 అక్షరాలు ఉంటాయి.ప్రాస నియమం ఉంటుంది.
ఉదాహరణ:
న–జ–భ–జ–జ–జ–ర అనే గణాలున్నా యి. 1–11 అక్షరాలకు యతిమైత్రి చెల్లింది.
Pooja Singh: హైజంప్‌లో పూజా సింగ్ జాతీయ రికార్డు
3. శార్దూలం: ప్రతి పద్య పాదంలో ‘మ–స –జ–స–త–త–గ’ అనే గణాలుంటాయి. మొ దటి అక్షరానికి 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ΄ాదం మొత్తానికి 19 అక్షరాలుంటాయి. ్ర΄ాస నియమం ఉంటుంది.
ఉదాహరణ:
మ–స–జ–స–త–త–గ అనే గణాలు వచ్చాయి. 1–13వ అక్షరాలకు యతిమైత్రి చెల్లింది. పాదం మొత్తానికి 19 అక్షరాలున్నాయి.
4. మత్తేభం: ప్రతి పద్య పాదంలో ‘స–భ–ర– న–మ– య–వ’ అనే గణాలుంటాయి. 1–14 అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. పాదం మొత్తానికి 20 అక్షరాలుంటాయి. ప్రాస నియమం ఉంటుంది.
ఉదాహరణ:
స–భ–ర–న–మ–య–వ అనే గణాలు వచ్చాయి. 1–14 అక్షరాలకు యతిమైత్రి చెల్లింది. పాదం మొత్తానికి 20 అక్షరాలు ఉన్నాయి. ఇది మత్తేభం.
Paris Paralympics: పారాలింపిక్స్‌లో భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు..
జాతులు
జాతుల్లో డీసెట్ విద్యార్థులకు కందం, ద్విపద ముఖ్యమైనవి.
1. కంద పద్యం: ‘భ–జ–స–నలి–గగ’ అనే గణాలుంటాయి. 1, 3 పాదాల్లో మూడు గణాలు ఉంటాయి. 2, 4 ΄ాదాల్లో ఐదు గణాలుంటాయి. 2, 4 పాదాల్లో మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. బేసి గణాల్లో ‘జగణం’ ఉండరాదు.
రెండో పాదంలో మూడో గణంతో నాలుగో పాదంలో మూడో గణంతో జగణంగానీ, నలంగానీ ఉండాలి. రెండు, నాలుగు పాదాల్లో చివరి అక్షరం గురువు ఉండాలి. ప్రాస నియమం ఉంటుంది. ప్రాస పూర్వాక్షరం మొదటి పాదంలో గురువైతే పాదాలన్నింటిలో గురువు ఉండాలి. లఘువైతే లఘువులే ఉండాలి. పద్యం పరిమాణంలో చిన్నదైనా, నియమాలు ఎక్కువగా ఉన్న పద్యం కందం. అందుకే ‘కందం రాసినవాడే కవి’ అనే సూక్తి వాడుకలో ఉంది.
ఉదాహరణ:
భ–జ–స–గగ అనే గణాలు వచ్చాయి. రెండో పాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లింది. నియామలన్నీ ఉన్నందుకు ఇది కంద పద్యం.
Job Mela: సెప్టెంబర్ 2వ తేదీ జాబ్‌మేళా.. ఎంపికైయ్యాక నెల జీతం ఎంతంటే..
2. ద్విపద: ద్విపదలో రెండు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 3 ఇంద్ర గణాలు మిగతా ఒకటి సూర్య గణం ఉంటుంది. ప్రతి పాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి మూడో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమంలేని ద్విపదను మంజరీ ద్విపద అంటారు.
ఉదాహరణ:
ప్రతి పాదంలో 3 ఇంద్ర గణాలు, 1 సూర్యగణం వచ్చింది. మొదటి గణం మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లింది. ప్రాస నియమం ఉంది.
ఉపజాతులు
దేశీయమైన ఛందోరీతులు ఉపజాతులు. ఇవి మాత్రా గణాలతో ఏర్పడతాయి. వీటిలో యతికి బదులు ప్రాసయతి చెల్లుతుంది. ప్రాస నియమం ఉండదు. తేటగీతి, ఆటవెలది, సీసం ముఖ్యమైనవి.
1. తేటగీతి: ప్రతి పద్య పాదంలో మొదట ఒక సూర్య గణం, తర్వాత 2 ఇంద్ర గణాలు, తర్వాత 2 సూర్య గణాలు ఉంటాయి. ప్రతిపాదంలో మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది.
ఉదాహరణ:
మొదట ఒక సూర్య గణం, తర్వాత 2 ఇంద్రగణాలు, తర్వాత 2 సూర్య గణాలు వచ్చాయి. మొదటి గణం మొదటి అక్షరం ‘ద’ నాలుగో గణం మొదటి అక్షరం ‘త’కు యతిమైత్రి చెల్లింది. కాబట్టి ఇది తేటగీతి పద్యం.
Quiz of The Day (August 31, 2024): కేంద్ర మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది?
2. ఆటవెలది: 1, 3 పాదాల్లో మొదటి 3 సూర్యగణాలు, తర్వాత 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో అయిదు సూర్య గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో మొదటిగణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు ప్రాసయతి చెల్లుతుంది.
ఉదాహరణ:
పై పాదాల్లో మొదటి పాదంలో 3 సూర్య గణాలు, తర్వాత 2 ఇంద్ర గణాలు వచ్చాయి. రెండో పాదంలో మొత్తం 5 సూర్యగణాలు వచ్చాయి. మొదటి గణం మొదటి అక్షరానికి నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి. కాబట్టి ఇది ఆటవెలది.
3. సీస పద్యం: సీస పద్యంలో ప్రతిపాదానికి మొదట 6 ఇంద్ర గణాలు, తర్వాత 2 సూర్య గణాలు ఉంటాయి. రచన సౌలభ్యం కోసం ప్రతి పాదాన్ని 4 ఇంద్ర గణాల వరకు పూర్వ పాదంగా, మిగిలిన 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలను ఉత్తర పాదంగా విభజించి రాస్తారు. నాలుగు పాదాల తర్వాత తేటగీతిగానీ, ఆటవెలది గానీ అనుబంధంగా ఉంటుంది. ప్రతి పాదంలో మొదటి గణం మొదట అక్షరానికి (పూర్వ పాదంలో), మూడో గణం మొదటి అక్షరానికి (పూర్వ పాదంలో), అయిదో గణం మొదటి అక్షరానికి, ఏడో గణం మొదటి అక్షరానికి (ఉత్తర పాదంలో) యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ప్రాసయతి చెల్లుతుంది.
ఉదాహరణ:
పూర్వ పాదంలో 4 ఇంద్ర గణాలు, ఉత్తర పాదంలో 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు వచ్చాయి. మొదటి గణం మొదటి అక్షరం ‘గు’తో మూడో గణం మొదటి అక్షరం ‘గు’తో యతిమైత్రి చెల్లింది. 5వ గణం మొదటి అక్షరం ‘సం’ 7వ గణం మొదటి అక్షరం ‘చ’తో యతిమైత్రి చెల్లింది. కాబట్టి ఇది సీస పద్యం.
Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సెప్టెంబర్ 3వ తేదీ జాబ్‌మేళా.. ఎక్కడంటే..
మాదిరి ప్రశ్నలు
1. ‘కామన శాంతి బొందుటయు కర్జము దానది యట్లలుండెశ్రీ’– ఈ పాదంలో ఉన్న ఛందస్సు ఏది?
1) చంపకమాల 2) ఉత్పలమాల
3) శార్దూలం 4) మత్తేభం
2. ‘పగయడగించు టెంతయు శుభంబదిలెస్స యడంగునేపగం’ ఇది ఏ పద్య ΄ాదం?
1) శార్దూలం 2) తేటగీతి
3) చంపకమాల 4) మత్తేభం
3. ‘మ–స–జ–స–త–త–గ’ గణాలున్న పద్య పాదం?
1) ఉత్పలమాల 2) మధ్యాక్కర
3) చంపకమాల 4) శార్దూలం
4. ‘బ్రోచిన దొరనింద సేయబోకుము కార్యా’ ఇది ఏ పద్య పాదమో గుర్తించండి?
1) ద్విపద 2) తేటగీతి
3) కందం 4) ఆటవెలది
5. వీటిలో సూర్య గణం ఏది?
1) గగము 2) గలము
3) లగము 4) సగణం
6. 13వ అక్షరం యతిమైత్రిగా ఉండే పద్యం?
1) ఉత్పలమాల 2) మత్తేభం
3) శార్దూలం 4) చంపకమాల
7. ‘రంగదరాతి భంగ, ఖగరాజతురంగ, విపత్పరంపరో’ పద్య పాదంలో గణాలు గుర్తించండి?
1) మ–స–జ–స–త–త–గ
2) భ–ర–న–భ–భ–ర–వ
3) న–జ–భ–జ–జ–జ–ర
4) స–భ–ర–న–మ–య–వ
8. వీటిలో ఇంద్ర గణం కానిది?
1) భ 2) సల 3) జ 4) నగ
9. ‘స్నానంబుల్ నదులందు జేయుట గజ స్నానంబు చందంబుగన్’ ఈ పద్య పాదంలో యతిమైత్రి?
1) జ 2) స్నా 3) జే 4) చం
10. కింది వాటిలో ప్రాస నియమం లేని పద్యం?
1) కందం 2) ద్విపద
3) తేటగీతి 4) మత్తేభం
11. ‘పవి పుష్పంబగు నగ్నిమందగునకు పారం బు భూమీ స్థలం’– ఏ పద్య పాదమో గుర్తించండి?
1) మత్తేభం 2) మధ్యాక్కర
3) శార్దూలం 4) చంపకమాల
12. ‘నిద్రింపుము వెలువనేల నీకిటననినన్’ ఇది ఏ పద్యం?
1) ద్విపద 2) తేటగీతి
3) కందం 4) సీసం
సమాధానాలు
1) 2; 2) 3; 3) 4; 4) 3; 5) 2;
6) 3; 7) 2; 8) 3; 9) 2; 10) 3;
11) 1; 12) 3.
Hyderabad University : హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు.. వీరికి మాత్రం..!
Tags
- Telugu grammar
- Study Material
- Eligibility Test
- tet and dsc exams
- tet exam material
- telugu material for tet exams
- DSC Exams
- Telugu grammar for tet and dsc exams
- Teachers Jobs
- Jobs 2024
- model questions and telugu grammar for tet and dsc exams
- model questions for tet and dsc exams for telugu
- Education News
- Sakshi Education News
- telugu grammer for exams
- telugu grammer study material