Skip to main content

Telugu Material for TET and DSC Exams : ఉభయాలంకారాలను మొదటగా పేర్కొన్న లాక్షణికుడు?

Telugu grammar resources for TET and DSC exam candidates  Tips for TET exam preparation in Telugu language  List of important topics for DSC exam in Telugu  Telugu grammar material for tet and dsc teacher exams  Telugu language study material for TET exam preparation

కావ్య సరస్వతికి శోభను చేకూర్చేవి అలంకారాలు. ‘అలం’ శబ్దానికి ‘కృ’ ధాతువు చేరి ‘అలంకారం’ అనే రూపం సిద్ధించింది. అలంకారమంటే భూషణం అని అర్థం. ఇవి కావ్య సౌందర్యాన్ని పెంపొందించి, శోభను కలిగిస్తాయి. ఆలంకారకులు వీటిని ప్రధానంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాలుగా విభజించారు. భోజుడు ‘సరస్వతీ కంఠాభరణం’లో మూడు విధాలుగా పేర్కొన్నాడు. శబ్ద, అర్థాలంకారాలతో పాటు ఉభయాలంకారాలను (శబ్దార్థ మిశ్రమాలు) వివరించాడు. ఆ తర్వాత మమ్మటుడు, రుయ్యకుడు, విశ్వనాథుడు, విద్యానాథుడు లాంటివారు మిశ్రాలంకారాల గురించి ప్రస్తావించారు.

అలంకారాలు
అలంకారాల్లో ప్రధానమైనవి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. 
శబ్దాలంకారాలు

శబ్ద వైచిత్రీ రామణీయకత వల్ల కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు. సంగీతానుగుణ్యమైన శ్రవణ ఫేయతతో పాఠకులకు ఆహ్లాదం కలిగించేవి శబ్దాలంకారాలు. ఇవి ఆరు రకాలు.
1. వృత్త్యనుప్రాసం     2. ఛేకానుప్రాసం
3. లాటానుప్రాసం     4. యమకం 
5. ముక్తపదగ్రస్థం     6. అంత్యానుప్రాసం
1. వృత్త్యనుప్రాసం:  ఒకటి లేదా రెండు మూడు వర్ణాలు పునరుక్తాలై ఆహ్లాదం కలిగిస్తే అది వృత్త్యను్ర΄ాసం. 
ఉదా: ‘హరిహరి సిరియురమున గలహరి’
ఇందులో ‘ర’ కారం పునరుక్తమై ఆహ్లాదం కలిగిస్తోంది.  అందువల్ల ఇది వృత్త్యనుప్రాసం.
2. ఛేకానుప్రాసం: అర్థ భేదం ఉన్న రెండేసి హల్లులు అవ్యవధానంగా పునరుక్తమై ఆహ్లాదాన్ని కలిగిస్తే అది ఛేకానుప్రాసం. ఛేకులంటే పండితులు అని అర్థం. ఛేకులకు ఆహ్లాదం కలిగించే అనుప్రాసం ఛేకాను్ర΄ాసం. 
ఉదా: ‘కందర్పదర్పములగు సందర దరహాస
రుచులు’. ఈ లక్ష్యంలో దర్ప–దర అనే రెండేసి హల్లులు అర్థభేదంతో పునరుక్తమయ్యాయి. కాబట్టి ఇది ఛేకానుప్రాసం.
3. లాటానుప్రాసం: తాత్పర్య భేదం ఉన్న శబ్దాలు పునరుక్తాలై ఆహ్లాదాన్ని కలిగిస్తే అది లాటానుప్రాసం.
ఉదా: ‘కమలాక్షునర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ’ ‘కరములు’, ‘జిహ్వ’ శబ్దాలు తాత్పర్య భేదంతో పునరుక్తాలైనందువల్ల ఇది లాటానుప్రాసం.
4. యమకం: సమాన స్వరసహితాలైన వ్యంజనాలు అర్థభేదంతో అవ్యవహితంగా పునరుక్తాలైతే అది యమకం. 
ఉదా:‘మన సుభద్ర మనసుభద్రమయ్యె’
సుభద్ర అనే అక్షరాలు అర్థభేదంతో అవ్యవహితంగా వచ్చాయి. కాబట్టి ఇది యమకం.
5. ముక్తపదగ్రస్థం: మొదటి పాదం చివరి పదం 
రెండో పాదంలో మొదటి పదంగా రావడాన్ని ముక్త పదగ్రస్థం అంటారు. అంటే విడిచిన పదాన్ని గ్రహించడం అని అర్థం.
ఉదా:‘సుదతీ నూతన మదనా
మదనా గతురంగ పూర్ణ మణిమయసదనా’
మొదటి పాదం చివర ఉన్న ‘మదనా’ పదం రెండోపాదం మొదటిపదంగా వచ్చింది. అందువల్ల ఇది ముక్తపదగ్రస్థం.
Follow our YouTube Channel (Click Here)
6. అంత్యానుప్రాసం: ప్రతి పాదం చివరన ఒకే అక్షరం లేదా పదం రావడాన్ని అంత్యానుప్రాసం అంటారు. 
ఉదా:కమనీయశుభగాత్రు – కంజాతదళనేత్రు
వసుధాకళత్రు – పావన చరిత్రు
‘త్రు’ అనే అక్షరం పాదాల చివర వచ్చినందువల్ల ఇది అంత్యాను్ర΄ాసం.
అర్థాలంకారాలు

అర్థ సౌందర్యం వల్ల కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం ఆహ్లాదకరం కాదు. అర్థ ప్రధానమైన అలంకారాలు అర్థాలం కారాలు. వీటిలో ప్రధానమైనవి.. 
1. ఉపమాలంకారం: ఉపమాన, ఉపమేయా లకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. ఇందులో ఉపమేయం (ప్రస్తుతం), ఉపమానం (అప్రస్తుతం), సమాన ధర్మం (ఉప మేయ, ఉపమానాల్లో సమానంగా ఉండేది), ఉపమావాచకం (ఉపమేయ, ఉపమానాలకు సమాన ధర్మాన్ని సూచించేది) ఉంటాయి. వలెన్, పోలెన్, ఎంతయున్, కైవడి, భంశి, అట్లు, అనంగ మొదలైనవి ఉపమావాచకాలు. పైన పేర్కొన్న నాలుగు అంశాలుంటే దాన్ని పూర్ణోపమాలంకారం అంటారు. ఏదైనా ఒక అంశం లోపిస్తే దాన్ని 
లు΄్తోపమాలంకారం అంటారు.
భరతుడు ఉపమాలంకారంలో ఐదు భేదాలను చె΄్పాడు. మమ్మటుడు లాంటి ఆలంకారకులు 25 భేదాలను పేర్కొన్నారు.  దండి 32 భేదాలను చెప్పాడు. చంద్రాలోకకర్త చెప్పిన ఏడు భేదాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
అలంకారాల్లో ప్రసిద్ధమైంది, ప్రాచీన మైంది ఉపమాలంకారం. దీన్ని ప్రయోగించని కవులు లేరు. కాళిదాసు లాంటి సంస్కృత కవులు విరివిగా ఉపయోగించారు. అందుకే ‘ఉపమా కాళిదాసస్య’ అనే నానుడి ప్రసిద్ధమైంది.
Follow our Instagram Page (Click Here)
లక్ష్యం: 
ఓ కృష్ణా! నీ కీర్తి హంసవలె ఆకాశ
గంగయందు మునుగుచున్నది
ఉపమేయం = కీర్తి, ఉపమానం = హంస,
‘ఆకాశగంగయందు మునుగుట’ ఉపమేయ
ఉపమానాలు రెండింటిలో ఉన్నందువల్ల ఇది సమాన ధర్మం. ఉపమావాచకంలా ఇందులో నాలుగు అంశాలున్నందువల్ల ఇది ‘పూర్ణోపమఅలంకారం’. 
2. ఉత్ప్రేక్షాలంకారం: జాతి, గుణ, ధర్మ సామ్యం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్షాలంకారం. ఇందులో ఉపమేయ ఉపమానాలతోపాటు ఉత్ప్రేక్షా వాచకం ఉంటుంది. తలంచెదన్, ఎంచెదన్, భావించెదన్, ఊహించెదన్, అనన్‌ మొదలైనవి ఉత్ప్రేక్షా వాచకాలు. 
లక్ష్యం: ‘‘ఈ చీకటిని చక్రవాక విరహాగ్ని నుండి పుట్టిన ధూమమో అని తలంతును’’
ఇందులో చీకటి ఉపమేయం, ధూమం  ఉపమానం. ధూమం నల్లనిది, దృష్టిని ఆపుచేసేది. ఈ గుణసామ్యం వల్ల ఉపమేయమైన చీకటిని ఉపమానమైన ధూమంగా ఊహించారు. కాబట్టి ఇది ఉత్ప్రేక్షాలంకారం.
3. రూపకాలంకారం: ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం లేదా ఉపమేయ ఉపమానాల కు భేదం లేనట్లుగా  వర్ణించడం రూపకాలంకారం. ఇందులో రూపక సమాసం కూడా ఉంటుంది. 
లక్ష్యం: రాజుపై లతాలలనలు కుసుమాక్షతలు చల్లిరి. ఇందులో ఉపమేయమైన లతల్లో ఉపమానమైన లలనల ధర్మం ఆరోపించారు. ఉపమేయమైన కుసుమాల్లో ఉపమానమైన అక్షతల ధర్మాన్ని ఆరోపించారు. కాబట్టి ఇది రూపకాలంకారం.
4. అనన్వయాలంకారం: ఒక వస్తువు సాటి లేనిది అని చెప్పడానికి అదే వస్తువుతో ΄ోల్చడాన్ని అనన్వయాలంకారం అంటారు. ఇందులో ఉపమేయమే ఉపమానంగా ఉంటుంది.  
లక్ష్యం: 
‘మేరునగానికి సాటి మేరునగమే
సముద్రానికి సాటి సముద్రమే’
ఇందులో ఉపమేయమైన మేరునగమే ఉపమానంగా ఉంది. ఉపమేయమైన సముద్రమే ఉపమానంగా ఉంది. అందువల్ల ఇది అనన్వయాలంకారం.
Join our WhatsApp Channel (Click Here)
5. స్వభావోక్తి: జాతి, గుణక్రియాదులను సహజ సిద్ధంగా, మనోహరంగా వర్ణించడాన్ని స్వభావోక్తి అలంకారం అంటారు.
లక్ష్యం: ‘‘ఉద్యానవనంలో జింకలు చెవులు రిక్కించి చంచల నేత్రాలతో సరోవరంలో నీళ్లు త్రాగుచున్నవి’’ ఇందులో జింకల స్థితిని మనోహరంగా, సహజసిద్ధంగా వర్ణించారు. అందువల్ల ఇది స్వభావోక్తి.
6. అర్థాంతరన్యాసాలంకారం: విశేషాన్ని సామాన్యంతో లేదా  సామాన్యాన్ని విశేషంతో సమర్థించి వర్ణిస్తే.. అది అర్థాంతరన్యాసాలంకారం.
లక్ష్యం:
‘‘ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు
   మహాత్ములకు అసాధ్యమైంది లేదు కదా!’’
   ఆంజనేయుడు సముద్రాన్ని దాటడం విశేష విషయం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు అనే సామాన్య విషయంతో సమర్థించినందువల్ల ఇది అర్థాంతరన్యాస అలంకారం.
లక్ష్యం: 2
పూలతో కూడిన నారకు వాసన కలిగినట్లు 
సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయాలు కలుగుతాయి.
పూలతో కూడిన నారకు వాసన కలగడం సామాన్య విషయం. సజ్జన సాంగత్యం వల్ల సర్వశ్రేయాలు కలుగుతాయి అనే విశేష విషయంతో దీన్ని సమర్థించడం వల్ల ఇది అర్థాంతరన్యాస అలంకారం.
7. అతిశయోక్తి అలంకారం: లోకస్థితిని మించి అతిశయించి వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారం. 
లక్ష్యం: ఆ పట్టణమందలి సౌధాలు చంద్ర మండలాన్ని తాకుచున్నవి. సహజస్థితిని మించి వర్ణించడం వల్ల ఇది అతిశయోక్తి.
8. శ్లేషాలంకారం: అనేక అర్థాలకు ఆశ్రయ మైంది శ్లేషాలంకారం. చమత్కారమైన పదా ల విరుపు లతో అనేక అర్థాల వల్ల అహ్లాదం కలిగించేది శ్లేష.
లక్ష్యం: ‘రాజు కువల యానందకరుడు’
ఇందులో రాజు శబ్దానికి పాలకుడు, చంద్రుడు అని; ‘కువలయం’ పదానికి భూమి, కలువ అనే అర్థాలున్నాయి. రాజు భూ ప్రజలకు సుపరిపాలనతో ఆనందం కలిగించేవాడని ఒక అర్థం. చంద్రుడు కలువలను వికసింపజేసి ఆనందం కలిగించే వాడని మరో అర్థం ఉన్నందువల్ల ఇది శ్లేషాలంకారం.
9. సమాసోక్తి అలంకారం: ప్రస్తుత వర్ణన వల్ల అప్రస్తుత విషయం స్ఫురిస్తే అది సమాసోక్తి అలంకారం.
లక్ష్యం: చంద్రుడు రక్తుడై ఐంద్రీముఖమును ముద్దిడుచున్నాడు. ప్రస్తుత వర్ణన వల్ల పరకాంతా చుంబనాభిలాషియైన కాముకుడు స్ఫురిస్తున్నందువల్ల ఇది సమాసోక్తి అలంకారం.   
10. దీపకాలంకారం: ఉపమేయ ఉపమా నాలకు (ప్రకృత, అప్రకృతాలకు) సాధారణ ధర్మంతో ఒకే అన్వయాన్ని కలిగిస్తే అది దీపకాలంకారం. 
లక్ష్యం: ‘‘బ్రహ్మ రాత, విష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం, పండిత వాక్యం వ్యర్థం కాబోవు’’
 పండిత వాక్యం వ్యర్థం కాదు అనే ఉపమేయంతో బ్రహ్మ రాత, విష్ణు చక్రం, ఇంద్రుడి వజ్రాయుధం లాంటి ఉపమే యాలను అన్వయించి చెప్పారు. అందువల్ల ఇది దీపకాలంకారం.

Join our Telegram Channel (Click Here)

మాదిరి ప్రశ్నలు

1.    ‘రక్షాదక్ష! విపక్ష శిక్షా’ ఏ అలంకారం?
    1) ఛేకానుప్రాసం    2) వృత్త్యనుప్రాసం
    3) లాటానుప్రాసం    4) యమకం 
2.    ‘మన సుభద్ర మనసుభద్రమయ్యె’ ఇందులోని అలంకారం?
    1) ముక్తపదగ్రస్థం    2) లాటానుప్రాసం
    3) యమకం    4) అంత్యానుప్రాసం
3.    ‘శేషశాయికి మ్రొక్కు శిరముశిరము’లోని అలంకారం?
    1) లాటానుప్రాసం    2) యమకం
    3) ఛేకానుప్రాసం    4) వృత్త్యనుప్రాసం
4.    ‘కమనీయ శుభగాత్రు – కంజాత దళనేత్రు వసుధాకళత్రు – పావన చరిత్రు’ లోని అలంకారం? 
    1) వృత్త్యనుప్రాసం       2) లాటానుప్రాసం
    3) అంత్యానుప్రాసం   4) యమకం
5.    యమకాలంకార లక్షణం?
    1) అచ్చులు మారతాయి, హల్లులు మారవు
    2) అచ్చులు మారవు, హల్లులు మారవు
    3) అచ్చులు మారకూడదు, హల్లులు మారతాయి
    4) అచ్చులు మారవచ్చు, హల్లులు మారవచ్చు
6.    ఉభయాలంకారాలను మొదటగా పేర్కొన్న లాక్షణికుడు?
    1) మమ్మటుడు    2) విశ్వనాథుడు
    3) భోజుడు    4) విద్యానాథుడు

సమాధానాలు
1) 2;     2) 3;     3) 1;     4) 3; 
5) 2;     6) 3.  

Published date : 07 Oct 2024 01:20PM

Photo Stories