Telugu Grammar for TET/DSC : టెట్, డీఎస్సీ పరీక్షల్లో ప్రత్యేకం.. తెలుగు వ్యాకరణంలోని సంధులు..
సంధులు – వ్యాకరణ పరిభాషలు
డీఎస్సీ అభ్యర్థులు శ్రద్ధగా చదవాల్సిన వ్యాకరణాంశాలు సంధులు, వ్యాకరణ పరిభాషలు. వీటిపై డీఎస్సీ–2012, టెట్‌లో 13 ప్రశ్నలు అడిగారు. ఈ డీఎస్సీలో కూడా ఎక్కువ ప్రశ్నలు రావచ్చు. స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్ అభ్యర్థులందరూ వీటిని తప్పకుండా అధ్యయనం చేయాలి.
సంధులు: ఐ. సంస్కృత సంధులు, ఐఐ. తెలుగు సంధులు.
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి 2. గుణ సంధి
3. వృద్ధి సంధి 4. యణాదేశ సంధి
5. జశ్త్వ సంధి 6. శ్చుత్వ సంధి
7. అనునాసిక సంధి 8. విసర్గ సంధి
9. పరసవర్ణ సంధి 10. పరరూప సంధి
ఐఐ. తెలుగు సంధులు:
1. ఉత్వ సంధి 2. ఇత్వ సంధి
3. అత్వ సంధి 4. యడాగమ సంధి
5. టుగాగమ సంధి 6. రుగాగమ సంధి
7. దుగాగమ సంధి 8. నుగాగమ సంధి
9. ద్విరుక్తటకార సంధి 10. సరళాదేశ సంధి
11. గ, స, డ, ద, వా దేశ సంధి
12. ఆమ్రేడిత సంధి 13. పుంప్వాదేశ సంధి
14. త్రిక సంధి 15. పడ్వాది సంధి
16. ప్రాఁతాది సంధి 17. లు, ల, నల సంధి
సంధులకు సంబంధించి ఒక పదాన్నిచ్చి దాన్ని సరిగా విడదీయమని అడుగుతారు. లేదా విభజించిన రూపాన్నిచ్చి సరిగా కలుపమని అడుగుతారు. సంధి సూత్రాలు రాయాల్సిన అవసరం లేకపోయినా అవగాహన కోసం సూత్రాలు తెలుసుకోవడం మంచిది.
సంస్కృత సంధులు
1. సవర్ణదీర్ఘ సంధి
అ–ఇ–ఉ–ఋలకు అవే అచ్చులు పరమైనా వాటి దీర్ఘాలు ఏకాదేశమవడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు.
ఉదా: రామ + ఆజ్ఞ = రామాజ్ఞ
మహి + ఈశుడు = మహీశుడు
గురు + ఉపదేశం = గురూపదేశం
పితృ + ఋణం = పితౄణం
2. గుణ సంధి: అకారానికి ఇ–ఉ–ఋలు పరమైతే క్రమంగా ఏ–ఓ–అర్‌లు ఏకాదేశ మవడాన్ని గుణసంధి అంటారు.
ఉదా: సూర్య + ఉదయం = సూర్యోదయం
మహా + ఈశ్వరుడు = మహేశ్వరుడు
ఇతర + ఇతర = ఇతరేతర
రాజ + ఋషి = రాజర్షి
3. వృద్ధి సంధి: అకారానికి ఏ, ఐలు పరమైతే ఐకారాన్ని; ఓ, ఔలు పరమైతే ఔకారాన్ని; ఋ, ౠలు పరమైతే ఆర్ ఏకాదేశమవడాన్ని వృద్ధి సంధి అంటారు. ఐ, ఔలను వృద్ధులు అంటారు.
ఉదా: భువన + ఏక = భువనైక
అఖండ + ఐశ్వర్యం = అఖండైశ్వర్యం
పాప + ఓఘం = పౌఘం
పరమ + ఔషధం = పరమౌషధం
ఋణ + ఋణం = ఋణార్ణం
☛Follow our YouTube Channel (Click Here)
4. యణాదేశ సంధి: ఇ–ఉ–ఋలకు అసవర్ణా చ్చులు పరమైతే క్రమంగా య–వ–రలు ఆదేశమవడాన్ని యణాదేశ సంధి అంటారు. ‘‘ఇకోయణచిః’’ : ఇక్కులకు (ఇ–ఉ–ఋ) యణ్ణులు (య–వ–ర) పరమవుతున్నందు వల్ల ఇది యణాదేశ సంధి.
ఉదా: జయంతి + ఉత్సవం =
జయంత్యుత్సవం
హిందూ + ఆర్యులు = హింద్వార్యులు
పితృ + ఆర్జితం = పిత్రార్జితం
5. జశ్త్వ సంధి: క–చ–ట–త–పలకు అచ్చులు కానీ, హ–య–వ–ర–లు కానీ, వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ, పరమైతే గ, జ, డ, ద, బలు ఆదేశమవడాన్ని జశ్త్వసంధి అంటారు.
ఉదా: తత్ + అరణ్య భూములు =
తదరణ్య భూములు
అచ్ + అంతం = అజంతం
వాక్ + ఈశుడు = వాగీశుడు
కకుప్ + అంతం = కకుబంతం
సత్ + భావం = సద్భావం
6. శ్చుత్వ సంధి: సకారత వర్గాలకు శకారచ వర్గాలు పరమైనప్పుడు శకారచ వర్గాలే ఆదేశమవడాన్ని శ్చుత్వ సంధి అంటారు.
(సకార–త థ ద ధ న) (త వర్గం)
(శకార – చ ఛ జ ఝ ఞ) (చ వర్గం)
తపస్ + శమము = తపశ్శమము
(స్(స)+శ= శ్శ)
సత్+చరిత్ర=సచ్ఛరిత్ర(త్ (త) – చ= చ్ఛ)
సత్+జనుడు= సజ్జనుడు(త్ (త)+జ= జ్జ)
విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి(త్ (త)+ శ=చ్ఛ)
7. అనునాసిక సంధి: వర్గ ప్ర«థమాక్షరాలకు (క–చ–ట–త–ప)‘న, మ’ అనునాసికాలు పర మైనప్పుడు ఆయా వర్గానునాసికాలు వికల్పంగా రావడాన్ని అనునాసిక సంధి అంటారు. మయాది ప్రత్యయాలకు నిత్యముగా వస్తాయి.
ఉదా: వాక్ + మయం = వాఙ్మయం
(క–ఙ=నిత్యం)
జగత్ + నాటకం = జగన్నాటకం
= జగద్నాటకం (వికల్పం)
(అనునాసికం రానప్పుడు వర్గ తృతీయాక్షరం
(త–ద–వికల్పం)
మృట్ + మయం = మృణ్మయం,
మృడ్మయం (టకు అనునాసికం రానప్పుడు డకారం వికల్పం)
8. విసర్గ సంధి: అకారం పూర్వముందున్న విసర్గకు వర్గ తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు అ–హ–య–వ–ర–లలు పరమైనప్పుడు విసర్గ – ఓకారంగా మారుతుంది. (వర్గ తృతీయాక్షరాలు– గ, జ, డ, బ, లు వర్గ చతుర్థాక్షరాలు (ఘ, ఝ, ఢ, ధ, భ, లు)
వర్గ పంచమాక్షరాలు: ఙ– ఞ– ణ– న–మ్ (అనునాసికాలు) హ–య–వ–ర–లలు పరమైనప్పుడు మాత్రమే విసర్గ ఓకారంగా మారుతుంది. కొన్నిసార్లు రేఫ వస్తుంది.
ఉదా: అయః + మయం = అయోమయం
(యః + మ = ఓ)
ఇతః + అధికం = ఇతోధికం (తః+అ = ఓ)
చతుః + ఆత్మ = చతురాత్మ
(తుః + ఆ = ‘ర’ కారం వచ్చింది)
తపః ఫలము = తపఃఫలం (ఫ కారం వర్గ ద్వితీయాక్షరమైనందు వల్ల విసర్గలో
మార్పు లేదు).
9. పర సవర్ణ సంధి: పదాంతం ముందున్న ‘త’ కారానికి లకారం పరమైనప్పుడు ‘ల’ కారమే ఆదేశంగా రావడాన్ని పర సవర్ణ సంధి అంటారు. (త్ – తకారానికి లకారం వస్తే ‘ల్ల’ కారం వస్తుంది)
ఉదా: భగవత్ + లీల = భగవల్లీల
(త్ + ల = ల్ల)
ఉత్ + లేఖనం = ఉల్లేఖనం (త్+లే = ల్లే)
విద్యుత్ + లత = విద్యుల్లత (త్ + ల = ల్ల)
సుహృత్ + లాభం = సుహృల్లాభం (త్ + లా = ల్లా)
☛☛ Follow our Instagram Page (Click Here)
10. పరరూప సంధి: హల్లుల్లోని అకారానికి అకారం పరమైతే రెండో పదంలోని మొదటి అచ్చు ఏకాదేశమవుతుంది. దీన్ని పరరూపసంధి అంటారు.
ఉదా: సార + అంగము = సారంగము
(ర్ + అ = రకారంలోని అకారానికి ‘అ’ కారం పరమై రకారానికి దీర్ఘం వచ్చింది)
సీమ + అంతము = సీమంతము
(మ్ + అకారానికి అకారం పరమై అకార దీర్ఘం వచ్చింది)
తెలుగు సంధులు
1. ఉత్వ సంధి: ఉత్తునకచ్చుపరమైనప్పుడు సంధి నిత్యముగా వస్తుంది (హ్రస్వమైన ఉకారానికి మాత్రమే ఇది వర్తిస్తుంది)
ఉదా: రాముడు + అతడు = రాముడతడు (డు లోని ఉ కారానికి అకారం పరమై అకారం నిత్యంగా వచ్చింది)
ప్రథమేతర విభక్తి శత్రర్థక చువర్ణంబులందున్న ఉకారానికి సంధి వైకల్పికం అవుతుంది.
ప్రథమా విభక్తి కాకుండా ఇతర విభక్తుల్లో శత్రర్థకమైన ‘చున్’ ప్రత్యయంలోని ఉకారానికి సంధి వైకల్పికమని అర్థం.
వైకల్పికమంటే ఒకసారి సంధి జరిగిన రూపం, మరోసారి సంధి జరగని రూపం సిద్ధిస్తుంది.
ఉదా: నన్నున్ + అడిగె = నన్నెడిగె (సంధి జరిగిన రూపం) నన్నునడిగె (సంధి జరగని రూపం)
2. ఇత్వ సంధి: ఇత్తునకు సంధి వైకల్పికం. ఏమ్యాదుల్లో ఇత్తునకు సంధి వైకల్పికం (ఏమి, మరి, అది, అవి, ఇది, ఇవి, కాన్) మొదలైనవి ఏమ్యాదులు.
ఉదా: ఏమి + అంటివి:
ఏమంటివి, ఏమియంటివి
(సంధి జరిగిన) (సంధి జరుగని)
మధ్యమ పురుష క్రియలందిత్తునకు
సంధి నిత్యం.
ఉదా: చూచితిరి + ఇపుడు = చూచితిరిప్పుడు
క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు.
భూతకాలిక అసమాపక క్రియ క్త్వార్థంబు
ఉదా: వచ్చి + ఇచ్చి = వచ్చియిచ్చి (సంధి లేనందువల్ల యడాగమ రూపం)
3. అత్వ సంధి: అత్తునకు సంధి బహుళం.
బహుళమంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్యవిధం అనే నాలుగు కార్యాలు ఉంటాయి.
నిత్యంగా జరిగేవి
ఉదా: రామ + అయ్య = రామయ్య (నిత్యం)
సంధి జరగని నిషేధ రూపం
ఉదా: దూత + ఇతడు = దూతయితడు
(యడాగమ రూపం)
వైకల్పికంగా జరగడం: సంధి జరిగిన రూపం, సంధి జరగని యడాగమ రూపం రెండూ వస్తాయి.
ఉదా: మేన + అల్లుడు = మేనల్లుడు
(సంధి జరిగిన రూపం)
మేనయల్లుడు (సంధి జరుగని
యడాగమ రూపం)
అన్యవిధం: సూత్రంలో సూచించని విధంగా కొన్ని హల్లులు వచ్చి చేరతాయి.
ఉదా: తామర + ఆకు = తామర΄ాకు
పుగాగమం అన్య విధంగా వచ్చి చేరింది.
☛ Join our WhatsApp Channel (Click Here)
4. యడాగమ సంధి: సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు యడాగమంబగు. సంధి జరిగే అవకాశం లేనప్పుడు పర స్వరానికి ముందు ‘య్’ కారం ఆగమంగా వచ్చి చేరుతుంది.
ఉదా: వెల + (య్) ఆలు = వెలయాలు
మా + (య్) అమ్మ = మాయమ్మ
5. టుగాగమ సంధి: కర్మధాయంలో ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబగుతుంది.
వివరణ: నామవాచక, విశేషణాలకు సంబంధించిన సమాసం కర్మధారయ సమాసం. ఇందులో పరస్వరానికి ముందు ‘ట్’ కారం ఆగమంగా వస్తుంది.
ఉదా: కఱకు+ (ట్) అమ్ము = కఱకుటమ్ము
కర్మధారయమున పేర్వాది శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబువిభాషనగు.
పేర్వాదులు: పేరు, పొదరు, చిగురు, తలిరు.
ఉదా: పేరు + ఉరము = పేరుటురము (టుగాగగం రానప్పుడు)
6. రుగాగమ సంధి: కర్మధారయంబున ‘పేరాది’ శబ్దాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు రుగాగమంబగు.
పేరాది శబ్దాలు: పేద, బీద, ముగ్ధ, కొమ, జవ, మనుమ, ఐదవ మొదలైనవి.
ఉదా: పేద (ర్) + ఆలు = పేదరాలు
పరస్వరానికి ముందు ‘ర్’ కారం చేరి
పేదరాలు రూపం వచ్చింది.
మనుమ(ర్) + ఆలు = మనుమరాలు
కర్మధారయంబున తత్సమ పదాలకు ‘ఆలు’ శబ్దం పరమైనప్పుడు అత్వంబు నకు ఉత్వంబు రుగాగమవుతుంది.
(తత్సమ శబ్దాలు: ధీర, గుణవంత, ధనవంత, సంపన్న, గంభీర, ధైర్యవంత మొదలైనవి)
ఉదా: ధీర + ఆలు = ధీరు+ ర్ + ఆలు
= ధీరురాలు
గుణవంత + ఆలు =
గుణవంతు + ర్ +ఆలు= గుణవంతురాలు
7. దుగాగమ సంధి: నీ– నా– తన శబ్దాలకు ఉత్తర పదంబు పరమైనప్పుడు దుగాగమంబు విభాషనగు.
ఉదా: నా + (దు) విభుడు = నాదువిభుడు (సంధి జరిగిన రూపం)
నా విభుడు (సంధి జరగని రూపం)
తన + (దు) కోపం = తనదు కోపం
( సంధి జరిగిన రూపం)
తన కోపం (సంధి జరగని రూపం)
8. నుగాగమ సంధి: ఉదంత తద్ధర్మార్థ విశేషణానికి అచ్చుపరమైనప్పుడు నుగామమంబగు.
తద్ధర్మార్థకాలు: భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో జరిగే క్రియలు. హ్రస్వమైన ఉకారం చివర ఉన్న తద్ధర్మార్థక క్రియలకు అచ్చుపరమైతే నుగాగమం వస్తుందని సూత్రార్థం.
ఉదా: చేయు + (న్) ఎడ = చేయునెడ
వ్రాయు + (న్) అది = వ్రాయునది
షష్ఠీ తత్పురుష సమాస మందలి ఉకార, ఋకారంబులకు అచ్చుపరమైనప్పుడు నుగాగమంబగు.
ఉదా: రాజు + (న్) ఆనతి = రాజునానతి
చెరువు + (న్) ఉదకం = చెరువునుదకం
9. ద్విరుక్తటకార సంధి: కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ‘ఱ, డ’లకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్తటకారం ఆదేశమవుతుంది.
ఉదా: కు (ఱు) (ట్ట్)+ ఉసురు = కుట్టుసురు
చిఱు + (ట్ట్) ఎలుక = చిట్టెలుక
కడు + (ట్ట్) ఎదురు = కట్టెదురు
నడు + (ట్ట్) ఇల్లు = నట్టిల్లు
నిడు + ఊర్పు = నిట్టూర్పు
వివరణ: ద్విరుక్తటకారమంటే ద్విత్వటకారమని అర్థం. ద్విత్వటకారం ఆదేశంగా వచ్చి ఈ రూ΄ాలు వచ్చాయి.
10. సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికం మీది పరుషాలకు సరళములగు.
ఉదా: పూచెను + కలువలు, పూచెను గలువలు: పరుషమైన కకారం సరళంగా (గ) మారింది.
ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషణలు విభాషనగు. పూచెను + గలువలు – పూచెంగలువలు; పూచెన్గలువలు: పూచెనుగలువలు, పూచెను గలువలు అనే నాలుగు రూ΄ాలు వస్తాయి. సమాసములందు స్వత్వ సంశ్లేషణ రూపాలుండవు. అర సున్నా రూపం మరో సూత్రంతో నిషేధానికి గురైంది. ‘పూచెంగలువలు’ అనే ఒక్క రూపం మాత్రమే మిగులుతుంది.
11. గ, స, డ, ద, వా దేశ సంధి:
1. ప్రథమం మీది పరుషాలకు గ, స, డ, ద, వలు బహుళముగానగు. ప్రథమావిభక్తిలో ఉన్న పదాలకు పరమైన పదాల్లో ఉన్న పరుషాలకు (కచటతపలకు క్రమంగా గ, స, డ, వలు) బహుళంగా వస్తాయి.
ఉదా: వాడు + కొట్టె = వాడు గొట్టె
అపుడు + చనియె = అపుడుసనియె
2. ద్వంద్వ సమాసాల్లో పదాలపై పరుషాలకు గ, స, డ, ద, వలు ్ర΄ాయికంగా వస్తాయి.
ఉదా: తల్లి + తండ్రి = తల్లిదండ్రులు
3. తెనుగుల మీది సాంస్కృతిక పరుషాలకు గ, స, డ, ద, వలు రావు. తెలుగు పదాలకు పరంగా వచ్చిన తత్సమ పదాల్లోని పరుషాలకు గ, స, డ, ద, వలు రావు.
ఉదా: వాడు + కంసారి = వాడు కంసారి
వీడు + చక్ర΄ాణి = వీడు చక్రపాణి
(ఈ ఉదాహరణలో క, చ అనే పరుషాలకు గ,స,లు రాలేదు)
☛ Join our Telegram Channel (Click Here)
12. ఆమ్రేడిత సంధి:
1. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగానగు. ద్విరుక్తం పదరూపం ఆమ్రేడితం. ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్ఛరించినప్పుడు రెండోసారి ఉచ్ఛరించినదాన్ని ఆమ్రేడితమంటారు.
ఉదా: ఔర + ఔర (ఆమ్రేడితం) ఔరౌర
ఆహా + ఆహా = ఆహాహా
2. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబులకెల్లా అదంతంబగు ద్విరుక్తటకారంబగు (కడాదులు: కడ, చివర, తుద, మొదలు, తెరువు, నడుమ మొదలైనవి)
ఉదా: క(డ)ట్ట + కడ = కట్టకడ
చివ(ట్ట)ర + చివర = చిట్టచివర
కడాదుల్లో తొలి అచ్చు తర్వాత వర్ణాలన్నింటికీ లోపం వచ్చి వాటి స్థానంలో అదంతమైన ద్విత్వట్టకారం వచ్చింది.
3. అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగా గ్రాహ్యములు.
ఉదా: అందుకు + అదుకు = అందదుకు
చెర + చెర = చెచ్చెర లాంటి రూ΄ాలు యథావిథిగా గ్రహించవచ్చని చిన్నయ సూరి అభి్ర΄ాయం.
13. పుంప్వాదేశ సంధి: కర్మధారయమందలి ము వర్ణానికి ‘పుంపు’లగు ము వర్ణానికి ‘పువర్ణం’ బిందు పూర్వక పువర్ణం (ంపు) రెండు రూ΄ాలు వస్తాయి.
ఉదా: సరసము + మాట = 1. సరసపు మాట
2. సరసంపు మాట
విరసము + వచనం = 1. విరసపు వచనం
2. విరసంపు వచనం
14. త్రిక సంధి:
1. ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికములు అంటారు. ఉదా: ఆ + కన్య
2. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది.
ఉదా: ఆ + క్కన్య
3. ద్విరుక్తంబగు హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికంబగు దీర్ఘం హ్రస్వం అవుతుంది.
ఉదా: ఆ + క్కన్య = అక్కన్య మూడు సూత్రాలతో – అక్కన్య రూపం వస్తుంది.
Tags
- telugu grammar material
- tet and dsc exams preparation
- preparation material for telugu exams
- Competitive Exams
- exams for teacher posts
- telugu material for tet and dsc exams
- telugu material on grammar for tet and dsc
- tet and dsc telugu exams
- eligibility exams preparation method
- eligibility exams material
- telugu material for tet exams
- telugu material and grammar for dsc exams
- dsc exams telugu material
- Education News
- Sakshi Education News