Skip to main content

Telugu Material and Bit Banks : ఐదు నుంచి పది అంకాల వరకు ఉండే దృశ్య రూపక భేదం?

క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ఎన్నో సృజనాత్మక వచన సాహితీ ప్రక్రియలు వచ్చాయి.
Telugu material and bit banks for tet and dsc exams

కావ్య ప్రక్రియలు – లక్షణాలు
నవల 

క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో ఎన్నో సృజనాత్మక వచన సాహితీ ప్రక్రియలు వచ్చాయి. ఆంగ్లం నుంచి పుట్టిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘నవల’. ఆధునిక సాహిత్య ప్రక్రియలో ఎక్కువ జనాదరణ పొందిన ప్రక్రియ కూడా ఇదే. ఈ ప్రక్రియ మొదటిసారిగా ఇటలీలో ప్రారంభమైంది.
●     నవల అనే పదం Novel∙(నోవెల్‌) అనే ఆంగ్లపదం నుంచి వచ్చింది.
     తెలుగులో మొదట నవలను వచన ప్రబంధం అని, నవీన ప్రబంధం అని, గద్య ప్రబంధం అని వ్యవహరించేవారు. 
●     నరహరి గోపాల కృష్ణమచెట్టి నవలను మొదట నవీన ప్రబంధం అన్నారు.
●     కందుకూరి వీరేశలింగం దీన్ని వచన ప్రబంధంగా పేర్కొన్నారు.
●     తెలుగులో నవలా ప్రక్రియకు నామకరణం చేసినవారు – కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి.
నవల – నిర్వచనాలు:
●    యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి గద్యరూపంలో వ్యక్తం చేసేదే నవల.    – రిచర్డ్‌ క్రాస్‌
●    నవాన్‌ విశేషాన్‌ లాతి గృహ్ణాతీతి నవల.   – కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి
●    సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ, ప్రజల ఆచార వ్యవహారాలను వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల.     –శ్రీ మొదలి నాగభూషణ శర్మ
Follow our YouTube Channel (Click Here)
ముఖ్యమైన నవలలు:
●    తొలి తెలుగు నవల – రంగరాజ చరిత్ర
●    నరహరి గోపాలకృష్ణమచెట్టి రాసిన రంగ రాజ చరిత్ర అనే నవలకు సోనాబాయి పరిణయం అనే నామాంతరం ఉంది.
●    సమగ్ర నవలా లక్షణాలతో వెలసిన మొదటి నవలగా కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్ర ప్రసిద్ధికెక్కింది. దీనికి ‘వివేక చంద్రిక’ అనే పేరు కూడా ఉంది.
నవల పేరు– కర్తలు
రాజశేఖర చరిత్ర (1878), సత్యరాజా పూర్వదేశ యాత్రలు – కందుకూరి వీరేశలింగం
గణపతి (తొలి హాస్య నవల) – చిలకమర్తి లక్ష్మీనరసింహం
హిమబిందు – అడవి బాపిరాజు
మాతృమందిరం – వేంకట పార్వతీశ కవులు
మాలపల్లి – ఉన్నవ లక్ష్మీనారాయణ
మైదానం, దైవమిచ్చిన భార్య – గుడిపాటి వెంకటాచలం
వేయిపడగలు, ఏకవీర – విశ్వనాథ సత్యనారాయణ
బారిష్టరు పార్వతీశం – మొక్కపాటి నరసింహశాస్త్రి
రక్షాబంధనం, శ్మశాన వాటిక – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
చదువు – కొడవటిగంటి కుటుంబరావు
అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా– త్రిపురనేని గోపీచంద్‌
చివరకు మిగిలేది? – బుచ్చిబాబు
అల్పజీవి – రాచకొండ విశ్వనాథశాస్త్రి
కీలుబొమ్మలు – జి.వి. కృష్ణారావు
అంపశయ్య – నవీన్‌
తులసిదళం – యండమూరి వీరేంద్రనాథ్‌
కాలాతీత వ్యక్తులు – శ్రీదేవి
బలిపీఠం – ముప్పాళ్ల రంగనాయకమ్మ
Follow our Instagram Page (Click Here)
నాటకం

సాహిత్య ప్రక్రియల్లో అత్యంత  శక్తిమంతమైన, విశిష్టమైన ప్రక్రియ ‘నాటకం’. ఇది ΄ాఠ కుల హృదయాలను రంజింపజేయడంలో ఉత్తమమైంది. తెలుగు నాటక రంగానికి మహోజ్వల చరిత్ర ఉంది. నాటకం దృశ్య ప్రక్రియకు చెందింది. ఇది లలిత కళలతో సమాహారకళగా ప్రసిద్ధికెక్కింది. క్రీ.శ. 19వ శతాబ్ది చివరి భాగంలో కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన మంజరీ మధుకరీయం (1860)తో ఆధునిక తెలుగు నాటకం ప్రారంభమైంది.
నాటకం – నిర్వచనాలు:
●     కావ్యేషు నాటకం రమ్యం 
        – భరతుడు (నాట్యశాస్త్రం)
●     నాటకాంతం హి సాహిత్యం
        – అభినవ గుప్తుడు (అభినవ భారతి)
●     మంగళాది, మంగళమధ్య, మంగళాంతః నాటకం     – భారతీయ లాక్షణికులు
నాటకం– లక్షణాలు:
    1. నాంది                   2. ప్రస్తావన
    3. విష్కంభం            4. అంకవిభజన
    5. పంచసంధులు     6. భరతవాక్యం
కథ– కథానిక
ప్రాచీన సంప్రదాయ ప్రక్రియ ‘కథ’ అయితే, ఆధునిక సంప్రదాయ ప్రక్రియ ‘కథానిక’. క్రీ.శ. 19వ శతాబ్దిలో ఆంగ్లం నుంచి దిగుమతి అయిన వచన సాహితీ ప్రక్రియలో కథానిక ఒకటి. కథ, కథానిక పదాలను ప్రస్తుతం పర్యాయపదాలుగా వాడుతున్నారు. కథానిక ప్రస్తావన మొదట అగ్ని పురాణంలో కనిపిస్తుంది. ‘షార్ట్‌ స్టోరీ’ అనే పదానికి సమానార్థకంగా కథానిక, చిన్న కథ అనే పదాలు ప్రయోగంలో ఉన్నాయి. 1936లో ప్రతిభ అనే పత్రికలో వ్యాసం రాస్తూ ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రి తొలిసారిగా ‘షార్ట్‌ స్టోరీ’ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా ‘కథానిక’  పదాన్ని సూచించారు. ఆధునిక తెలుగు కథ 1910లో గురజాడ ‘దిద్దుబాటు’తో ప్రారంభమైంది. మొదట దిద్దుబాటు కథను ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించారు. ఆధునిక తెలుగు కథా రచయితలకు గురజాడ మార్గదర్శకుడు.
●     కథానిక ప్రధాన లక్షణాలు సంక్షిప్తత, ఏకాగ్రత, సమగ్రత, నిర్భరత.
●     శీలా వీర్రాజు అభి్ర΄ాయం ప్రకారం ‘కథానికకు శిల్పమే ప్రాణం’.
గల్పిక
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో ‘గల్పిక’ ఒకటి. ఇది పరిమాణంలో కథానిక కంటే చిన్నది. దీంట్లో విమర్శ ప్రధానాంశంగా ఉంటుంది. సంఘటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

  కథ/ కథానిక పేరు రచయితలు
1 కాశీ మజిలీ కథలు    మదిర సుబ్బన్న దీక్షితులు
2 విక్రమార్కుని కథలు     రావిపాటి గురుమూర్తి
3 కాంతం కథలు     మునిమాణిక్యం నరసింహారావు
4 అత్తగారి కథలు     భానుమతి రామకృష్ణ
5 యజ్ఞం కథలు     కాళీపట్నం రామారావు
6 మొగలాయి కథలు     సురవరం ప్రతాపరెడ్డి
7 అమరావతి కథలు   సత్యం శంకమంచి
8 గులాబీ అత్తరు     శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
9 కలుపు మొక్కలు      శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
10 ఓ పువ్వు పూసింది      గుడిసాటి వెంకటాచలం

●    మానవ జీవితంలోని ఒడుదుడుకుల్ని చిత్రించేది కథానిక అయితే  ఒక వ్యక్తిని గానీ, ఒక వ్యవస్థను గానీ అవహేళన చేసేదే గల్పిక.
●    గల్పికలో అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు, భావ దృష్టికి రచయితలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
●    ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశగానీ, ఒక సంస్థ పరిణామక్రమంలోని ఒక విశేషంగానీ గల్పికలో ప్రధాన వస్తువు.
●    వ్యక్తిని గానీ, వ్యవస్థనుగానీ విమర్శించడం గల్పికలో సర్వసాధారణం.
●    1940 ప్రాంతంలో త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి కుటుంబరావు గల్పికలు రాసి ప్రసిద్ధి చెందారు.
●    తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడు కొడవటిగంటి కుటుంబరావు. ఆయన రాసిన గల్పికలు యువ పత్రికలో 
ప్రచురితమయ్యాయి.

Join our WhatsApp Channel (Click Here)

గతంలో అడిగిన ప్రశ్నలు
1.    మునిమాణిక్యం నరసింహరావు ‘దీక్షితులు’ నవలకు స్ఫూర్తి?
    1) విశ్వనాథ సత్యనారాయణ
    2) నాయని సుబ్బారావు
    3) చింతా దీక్షితులు
    4) అడవి బాపిరాజు
2.    వచన ప్రబంధంగా చలామణి అయిన సాహిత్య ప్రక్రియ?
    1) కథానిక     2) కథ
    3) వ్యాసం     4) నవల
3.    ఖాకీవనం నవలా రచయిత?
    1) తల్లారజ్జల పతంజలి శాస్త్రి
    2) కె.ఎన్‌.వై. పతంజలి
    3) చాట్ల నారాయణ మూర్తి
    4) కాళీపట్నం రామారావు
4.    ఐదు నుంచి పది అంకాల వరకు ఉండే దృశ్య రూపక భేదం?
    1) ఈహామృగం     2) నాటకం
    3) ప్రహసనం     4) వీధి
5.    ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి అనువదితమైన తొలి నాటకం?
    1) మర్చంట్‌ ఆఫ్‌ వెనిస్‌     
    2) జూలియస్‌ సీజర్‌     
    3) రోమియో జూలియట్‌
    4) కామెడీ ఆఫ్‌ ఎరర్స్‌
6.    ఒకే అంకంలో ఇమిడిపోయే సంభాషణాత్మక ప్రదర్శన యోగ్య సాహిత్య ప్రక్రియ?
    1) నాటకం     2) నవల
    3) కథానిక     4) ఏకాంకిక
7.    పంచ సంధులుండే రూపక భేదాలు?
    1) నాటక, ప్రకరణాలు
    2) డిమ, సమవాకారాలు
    3) వ్యాయోగ, ఈహా మృగాలు
    4) భాణ, ప్రహసనాలు
8.    ఏకాంశ వ్యగ్రమై స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియ?
    1) ఖండకావ్యం     2) గల్పిక
    3) కథానిక    4) ఏకాంకిక
9.    తెలుగు కథానికకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది?
    1) దిద్దుబాటు      2) గాలివాన
    3) నేను    4) ప్రేమలేఖ
10.    కథానిక ప్రధాన లక్షణాలు?
    1) విస్తృతి, సమగ్రత    
    2) నిర్భరత, బహు సంఘటనాత్మకత
    3) వివరణాత్మకత, పాత్ర బాహుళ్యం    
    4) సంక్షిప్తత, ఏకాగ్రత
11.    ‘మాక్లీదుర్గంలో కుక్క’ కథా రచయిత?
    1) గుడిపాటి వెంకటాచలం    
    2) శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
    3) పెద్దిబొట్ల సుబ్బరామయ్య     
    4) విశ్వనాథ సత్యనారాయణ
12.    గల్పిక ప్రధాన లక్షణం?
    1) వ్యంగ్యంతో కూడిన ఒక కొసమెరుపు ఉండటం     
    2) సుదీర్ఘమైన వర్ణన ఉండటం
    3) అనేకానేక సంఘటనలు ఉండటం    
    4) నిడివి ఎక్కువగా ఉండటం

సమాధానాలు
1) 3    2) 4    3) 2    4) 2
5) 2    6) 4    7) 1    8) 3
9) 2    10) 4    11) 4    12) 1

Join our Telegram Channel (Click Here)
మాదిరి ప్రశ్నలు
1.    తెలుగులో మొదటగా నవలల పోటీలు నిర్వహించిన పత్రిక?
    1) వివేక వర్ధిని
    2) కృష్ణాపత్రిక    
    3) గోలకొండ
    4) చింతామణి
2.    తొలి తెలుగు మనోవైజ్ఞానిక నవల?
    1) కపాల కుండల
    2) చివరకు మిగిలేది
    3) అసమర్థుని జీవయాత్ర
    4) కీలుబొమ్మలు
3.    కన్నడ భాషలో నవలా ప్రక్రియను ఏమని పిలుస్తారు?
    1) ఉపన్యాస్‌ 
    2) లలిత ప్రబంధ్‌
    3) ఉదినం
    4) కాదంబరి
4.    ధర్మారావు, అరుంధతి పాత్రలు ఉన్న ప్రసిద్ధ నవల?
    1) వేయిపడగలు     
    2) మాలపల్లి
    3) ఏకవీర     
    4) అసమర్థుని జీవయాత్ర
5.    మూడు మాండలికాల్లో రచనలు చేసిన ఏకైక నవలాకారుడు?
    1) దాశరథి రంగాచార్యులు    
    2) పోరంకి దక్షిణామూర్తి
    3) మహీధర రామ్మోహనరావు
    4) సూర్యదేవర రామ్మోహనరావు
6.    ధర్మవరం రామకృష్ణమాచార్యులకు ‘ఆంధ్ర నాటక పితామహుడు’ అనే బిరుదును ఎవరిచ్చారు?
    1) గద్వాల మహారాజు
    2) పిఠాపురం మహారాజు
    3) విజయనగర మహారాజు
    4) దేవరకోట మహారాజు
7.    తెలుగులో ఆబాలగోపాలాన్ని అలరించిన చింతామణి నాటక కర్త?
    1) కందుకూరి వీరేశలింగం
    2) కాళ్లకూరి నారాయణరావు
    3) ధర్మవరం రామకృష్ణమాచార్యులు
    4) కొప్పరపు సుబ్బారావు
8.    తెలుగులో తిరుపతి వేంకట కవులు అనగానే గుర్తుకు వచ్చే నాటకం?
    1) కురుక్షేత్ర సంగ్రామం
    2) బొబ్బిలి పట్టాభిషేకం
    3) బుద్ధ చరిత్రం
    4) పాండవోద్యోగ విజయాలు
9.    తెలుగులో అత్తగారి కథల సృష్టికర్త?
    1) చింతా దీక్షితులు
    2) మునిమాణిక్యం నరసింహారావు
    3) మాలతీ చందూర్‌
    4) భానుమతీ రామకృష్ణ
10.    శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన చరమరాత్రి కథలు ఏ కోవకు చెందినవి?
    1) అభ్యుదయ కథలు
    2) విప్లవ కథలు    
    3) చైతన్యస్రవంతి కథలు
    4) అధివాస్తవికత వాద కథలు

సమాధానాలు
1) 4    2) 3    3) 4    4) 1
5) 2    6) 1    7) 2    8) 4
9) 4    10) 3 

Published date : 01 Oct 2024 01:44PM

Photo Stories