Skip to main content

Daifuku Intralogistics: హైదరాబాద్‌లో జపాన్‌ కంపెనీ తయారీ కేంద్రం

జపాన్‌కు చెందిన డైఫుకు కో., లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని హైదరాబాద్‌లో అత్యాధునిక తయారీ, ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది.
Daifuku Intralogistics India Unveils Advanced Manufacturing and Innovation Facility in Hyderabad

ఇంట్రాలాజిస్టిక్స్ అండ్‌ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ సుమారు రూ.227 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ఈ-కామర్స్, రిటైల్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్స్, ఎఫ్‌ఎంసీజీ వంటి వివిధ రంగాలలో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేలా హైదరాబాద్‌లోని ఈ ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని కంపెనీ రూపొందించింది. అధునాతన ఆటోమేషన్ టెక్నాలజీలు, డిజిటల్ టూల్స్, సస్టైనబుల్ పద్ధతులను ఈ కేంద్రం సమగ్రపరుస్తుంది. ఇది 2030 నాటికి భారతదేశ లాజిస్టిక్స్ అండ్‌ వేర్‌హౌసింగ్ మార్కెట్ 650 బిలియన్‌ డాలర్లను దాటే అంచనాకు అనుగుణంగా ఉంటుంది.

Japanese Companies: జపాన్ సంస్థలతో తెలంగాణ ఒప్పందం
 
ఈ గుర్తించదగిన పెట్టుబడి భారతదేశ "మేక్ ఇన్ ఇండియా" దృష్టిని బలోపేతం చేస్తుంది. భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలపరుస్తుంది. అలాగే భారత్‌ను అత్యాధునిక ఇంట్రాలాజిస్టిక్స్ సొల్యూషన్స్‌కు కేంద్రంగా నిలుపుతుంది. భారత్‌ తమకు అత్యంత వ్యూహాత్మక గ్లోబల్ మార్కెట్‌లలో ఒకటిగా నిలుస్తుందని డైఫుకు కో., లిమిటెడ్ సీఈవో హిరోషి గెషిరో విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కేంద్రం భారత్‌, జపాన్ మధ్య గల బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుందని డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా చైర్మన్ శ్రీనివాస్ గరిమెళ్ల అన్నారు. ఈ కేంద్రం ద్వారా ఇంజినీరింగ్‌, ఆటోమేషన్‌, ప్రొడక్షన్‌ రంగాల్లో 100 మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

RBI Repo Rate: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపో రేటు తగ్గింపు

Published date : 22 Apr 2025 04:15PM

Photo Stories