RBI Notification 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు.. ప్రాక్టీస్‌తోనే సక్సెస్
- 450 అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి ఆర్‌బీఐ నోటిఫికేషన్
- ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక
- ప్రారంభంలో నెలకు రూ.47,849 వేతనం
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పోటీ పడే అవకాశం
మొత్తం 450 పోస్ట్‌లు
ఆర్‌బీఐ తాజా నోటిఫికేషన్ ద్వారా 18 ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 450 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ప్రాంతీయ కార్యాలయాల వారీగా పోస్ట్‌ల సంఖ్య వివరాలు.. అహ్మదాబాద్ 13 పోస్టులు, బెంగళూరు 58, భోపాల్ 12, భువనేశ్వర్ 19, చండీగఢ్ 21, చెన్నై 13, గువహటి 26, హైదరాబాద్ 14, జైపూర్ 5, జమ్ము 18, కాన్పూర్ అండ్ లక్నో 55, కోల్‌కత 22, ముంబై 101, నాగ్‌పూర్ 19, న్యూఢిల్లీ 28, పాట్నా 10, తిరువనంతపురం అండ్ కొచి 16 పోస్టులు. వీటితోపాటు 11 బ్యాక్‌లాగ్ పోస్ట్‌లను కూడా భర్తీ చేయనున్నారు.
చదవండి: SBI Recruitment 2023: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
విద్యార్హతలు
సెప్టెంబర్ 1 ,2023 నాటికి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీస ఉత్తీర్ణత మార్కులు సాధిస్తే సరిపోతుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కార్యాలయం ఉన్న రాష్ట్రానికి సంబంధించిన భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
వయసు
సెప్టెంబర్ 1, 2023 నాటికి 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఆకర్షణీయ వేతనం
ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి కొలువు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనంతో కెరీర్ ప్రారంభమవుతుంది. రూ.20,700– రూ.55,700 వేతన శ్రేణిలో ప్రారంభంలో నెలకు రూ.47,849 స్థూల వేతనం లభిస్తుంది.
రెండు దశల ఎంపిక ప్రక్రియ
ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ ఎగ్జామ్. దీంతోపాటు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది.
వంద మార్కులకు ప్రిలిమినరీ
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు కేటాయించే సమయం ఒక గంట. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.
చదవండి: 2000 PO Jobs in SBI: ఎస్‌బీఐలో పీఓ కొలువులు.. సిలబస్‌పై విశ్లేషణ
మెయిన్‌కు 200 మార్కులు
ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున రెండో దశ మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని అయిదు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40ప్రశ్నలు–40 మార్కులు, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు–40 మార్కులు, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ40 ప్రశ్నలు–40 మార్కు లు,టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్‌నెస్40ప్రశ్నలు–40 మార్కులు, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు–40 మార్కులకు.. ఇలా మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటల 15 నిమిషాలు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కింగ్ (0.25 మార్కులు)నిబంధన అమల్లో ఉంది.
లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్
మెయిన్ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు ఇద్దరిని చొప్పున(1:2 నిష్పత్తి)ఎంపిక చేసి.. మలి దశలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ ఆయా రాష్ట్రాల అధికారిక భాషలో ఉంటుంది.హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ఖాళీలకు సంబంధించి తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్ విభాగాలు ఉంటాయి. ఇందులోనూ ప్రతిభ చూపితే..మెయిన్ ఎగ్జామ్,లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మార్కులను క్రోడీకరించి.. తుది విజేతల జాబితా రూపొందిస్తారు. ఇందులో చోటు సాధించిన వారికి నియామకం ఖరారు చేస్తారు.
చీఫ్ మేనేజర్ స్థాయికి
ఆర్‌బీఐ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన వారు భవిష్యత్తులో చీఫ్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. సర్వీస్ నిబంధనలను అనుసరించి తొలుత ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్–ఎ హోదాకు పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత మేనేజర్ గ్రేడ్–బి(స్కేల్–2), సీనియర్ మేనేజర్ గ్రేడ్–సి(స్కేల్–3), చీఫ్ మేనేజర్ గ్రేడ్–డి (స్కేల్–4) హోదాలకు పదోన్నతి పొందొచ్చు.
ప్రాక్టీస్‌తోనే సక్సెస్
- రీజనింగ్ విభాగంలో రాణించేందుకు ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కికత్వం పెంచుకునే విధంగా కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అంశాల్లో అవగాహన పెంచుకోవాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో మంచి స్కోర్ కోసం బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యక దృష్టి పెట్టాలి.
- న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి.. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా అర్థమెటిక్ సంబంధిత అంశాల(రేషియోస్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రిలేషన్స్ తదితర)పై పట్టు సాధించాలి.
- జనరల్ అవేర్‌నెస్‌ను మరింత ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. వీటితోపాటు ఆర్థిక, సామాజిక అంశాలు, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఇండియన్ ఎకానమీ, గ్లోబలైజేషన్, భారత సామాజిక విధానం, ఆర్థిక వ్యవస్థ, ఆర్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు, ఆర్‌బీఐ విధులు, దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి.. కంప్యూటర్ ఫండమెంటల్స్ ముఖ్యంగా ఆపరేటింగ్ టూల్స్ గురించి తెలుసుకోవాలి. కీ బోర్డ్ షాట్ కట్ మెథడ్స్, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్, డాక్యుమెంట్ క్రియేషన్, ఎక్సెల్ షీట్ క్రియేషన్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04.10.2023
- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 21, 23.10.2023
- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ: డిసెంబర్ 02, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rbi.org.in/
Qualification | GRADUATE |
Last Date | October 04,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |