Skip to main content

RBI jobs: 303 పోస్టుల భర్తీకి కేంద్ర బ్యాంకు ప్రకటన

Officer posts in RBI
  • » 303 పోస్టుల భర్తీకి కేంద్ర బ్యాంకు ప్రకటన
  • » డిగ్రీ విద్యార్హతతో∙దరఖాస్తుకు అవకాశం

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గ్రేడ్‌ బీ, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా పలు విభాగాల్లో మొత్తం 303 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. డిగ్రీ అర్హతతోనే వీటికి పోటీపడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read: SBI - Officer Posts: ఎస్‌బీఐ, ముంబైలో 11 స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

  •  మొత్తం పోస్టులు సంఖ్య: 303
  •  గ్రేడ్‌–బీ: జనరల్‌ ఆఫీసర్లు– 238
  •  గ్రేడ్‌–బీ: ఎకనామిక్‌ అండ్‌ పాలసీ రీసెర్చ్‌ విభాగం(డీఈపీఆర్‌)–31
  •  గ్రేడ్‌–బీ: స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం(డీఎస్‌ఐఎం)–25, అసిస్టెంట్‌ మేనేజర్లు(రాజ్‌భాష)–06, అసిస్టెంట్‌ మేనేజర్లు(ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ)–03

also read: ANGRAU Jobs 2022: కృషి విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి జిల్లాలో వివిధ పోస్టులు

అర్హతలు

  •  ఏదైనా డిగ్రీలో కనీసం 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు 55శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
  •  వయోపరిమితి: 01 జనవరి 2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు;దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం

  • ఈ పరీక్షను ఫేజ్‌–1, ఫేజ్‌–2 విధానంలో నిర్వహిస్తారు. 
  • ఫేజ్‌ 1: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • ఫేజ్‌–2: ఈ దశలో నిర్వహించే పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 300 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారు. 
  • పేపర్‌–1 ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్ష (స్టాటిస్టిక్స్‌పై ప్రశ్నలు ఇస్తారు) 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. 
  • పేపర్‌–2 డిస్క్రిప్టివ్‌ విధానంలో స్టాటిస్టిక్స్‌పై ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు కంప్యూటర్‌ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. సమాధానాలు పెన్‌తో పేపర్‌ మీద రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. 
  • పేపర్‌–3 çపరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. పరీక్షను కీ బోర్డ్‌ సహాయంతో కంప్యూటర్‌పైనే రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం గంటన్నర.

Also read: Intelligence‌ Bureau Jobs: 150 ఏసీఐఓ పోస్టులు... అర్హత వివరాలు ఇవే

ఇంటర్వ్యూ

  • ఫేజ్‌–2(పేపర్‌1,2,3)లో పొందిన మార్కుల ఆధారంంగా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూను హిందీ/ఇంగ్లిష్‌ రెండింట్లో దేనిలోనైనా ఎంపిక చేసుకోవచ్చు.
  • ఫేజ్‌–2లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో పొందిన మార్కులు కలిపి తుది జాబితాను రూపొందిస్తారు.

వేతనాలు

  • గ్రేడ్‌–బి ఆఫీసర్లకు ప్రతి నెల రూ.55,200, ఆఫీసర్‌ గ్రేడ్‌ –బి(డీఆర్‌)–డీఈపీఆర్‌ వారికి ప్రతి నెల రూ.44,500 వేతనంగా చెల్లిస్తారు.

also read: Non Teaching Jobs: నలంద సైనిక్‌ స్కూల్‌లో 14 ఉద్యోగాలు

పరీక్ష కేంద్రాలు

తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ నగరాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, చీరాల, కర్నూలు, విజయనగరం

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: 
  • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేదీ: 18.04.2022
  • వెబ్‌సైట్‌: www.rbi.org.in


Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job

Photo Stories