IDBI Bank Recruitment 2023: రాత పరీక్ష లేకుండానే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
బ్యాంకు వినియోగదారులకు అందించే సేవలను సులభతరం చేయడంతోపాటు, లావాదేవీలను సౌకర్యవంతం చేయడం స్పెషలిస్ట్ ఆఫీసర్ల విధి. మార్కెటింగ్, ఏటీఎం, ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరర్, సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ తదితర విభాగాల కింద వీరు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: మేనేజర్–గ్రేడ్ బి–46 పోస్టులు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం)–గ్రేడ్ సి–39 పోస్టులు, డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం)–గ్రేడ్ డి–01.
అర్హత: ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2023 నాటికి మేనేజర్ పోస్టులకు 25–35 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 28–40 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 35–45 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ.76,010–రూ.89,890. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు రూ.63,840–రూ.78,230. మేనేజర్‌కు రూ.48,170–రూ.69,810.
ఎంపిక ఇలా
ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపడతారు. ఆన్‌లైన్‌లో పంపించిన దరఖాస్తుల్లోని విద్యార్హతలు,పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చే స్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని గ్రూప్ డిస్కషన్(జీడీ)/పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.12.2023
వెబ్‌సైట్: https://www.idbibank.in/
చదవండి: Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంక్‌లో సివిల్ ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 25,2023 |
Experience | 5 year |
For more details, | Click here |
Tags
- IDBI Bank Recruitment 2023
- bank jobs
- IDBI Bank Notification 2023
- IDBI SO Notification 2023
- Specialist Officer Jobs
- Assistant General Manager Jobs
- Manager jobs
- Data Analyst
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- IDBIRecruitment
- JobOpportunities
- SORecruitment
- BankJobs
- PublicSectorBank
- SpecialistOfficers
- BankingCareers
- latest bank jobs
- sakshi education job notifications