Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జగన్ ఆదేశాలు
అలాగే గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సచివాలయంలో జనవరి 27వ తేదీన గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
AE Posts: ముందుగా ఆప్షన్ ఇచ్చినవారికే తొలి ప్రాధాన్యత.. ఇంకా
Assistant Engineer Exam Pattern: అసిస్టెంట్ ఇంజనీర్ సిలబస్ ఇదే...రాత పరీక్ష ఇలా
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను..
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ను ఆదేశించారు.
APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు..ఎంపికైతే ప్రారంభ జీతమే..
ఖాళీలను త్వరగా భర్తీచేయాలని..
మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (ఏపీ సేవా పోర్టల్)ను గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని తెలిపారు. దీంతో ప్రజలు వివిధ సేవలకు ఏ సచివాలయం నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ప్రస్తుతం గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842.. మొత్తం 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సచివాలయాల్లో ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించినట్లు వివరించారు.
APPSC Assistant Engineer Exam Books : అసిస్టెంట్ ఇంజనీర్ రాత పరీక్షకు ఏఏ పుస్తకాలు చదవాలి..?