AE Posts: ముందుగా ఆప్షన్ ఇచ్చినవారికే తొలి ప్రాధాన్యత.. ఇంకా
ఈ మేరకు జనవరి 25వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 5లోగా ఆప్షన్లను వెబ్ లింక్‌లో కొత్తగా నమోదు చేయాలని సూచించింది. ఈ వెబ్ లింక్ ( https://psc.ap.gov.in/ ) జనవరి 27 నుంచి అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను సమర్పించాలి. ఇంతకు ముందు దరఖాస్తుల సమర్పణ సమయంలో ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోరు.
Assistant Engineer Exam Pattern: అసిస్టెంట్ ఇంజనీర్ సిలబస్ ఇదే...రాత పరీక్ష ఇలా
APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు..ఎంపికైతే ప్రారంభ జీతమే..
పరీక్ష కేంద్రం ఆప్షన్లతోపాటు..
ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రం ఆప్షన్లతోపాటు తమ సబ్జెక్ట్, పోస్టు ప్రాధాన్యతలను ఫిబ్రవరి 5లోపు కమిషన్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ఈ ఆప్షన్లనే తుది ఆప్షన్లుగా పరిగణిస్తారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో మూడు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. కేంద్రాల ఎంపిక సహా ఇతర అంశాలను ఎడిట్ ఆప్షన్ ద్వారా జాగ్రత్తగా నమోదు చేయాలి. కాగా, ఏపీపీఎస్సీ 190 ఏఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
APPSC Assistant Engineer Exam Books : అసిస్టెంట్ ఇంజనీర్ రాత పరీక్షకు ఏఏ పుస్తకాలు చదవాలి..?