APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు..ఎంపికైతే ప్రారంభ జీతమే..
దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
మొత్తం పోస్టులు : 190
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో..
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్‌లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు.
ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది.
అర్హతలు ఇవే..:
ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి :
జూలై 1,2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 21–నవంబర్ 11,2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in