Skip to main content

APPSC Assistant Engineer Exam Books : అసిస్టెంట్‌ ఇంజనీర్ రాత ప‌రీక్ష‌కు ఏఏ పుస్త‌కాలు చ‌ద‌వాలి..?

ఏపీపీఎస్సీ తాజాగా అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) నోటిఫికేషన్ విడుద‌ల‌ చేసిన విష‌యం తెలిసిందే..ఈ నేప‌థ్యంలో సిల‌బ‌స్‌, చ‌ద‌వాల్సిన ముఖ్య‌మైన బుక్స్‌పై ఒక అవ‌గాహ‌న ఉండాలి.

ముఖ్యంగా సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకున్నాక..ఆయా అంశాలకు సంబంధించి బీటెక్‌ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్‌ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్‌ సాగించాలి. ప్రిపరేషన్‌లో అప్లికేషన్‌ అప్రోచ్‌ను అనుసరించాలి. దీనివల్ల ప్రాక్టికల్‌ థింకింగ్‌ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. మోడల్‌ పేపర్లు, మాక్‌ టెస్ట్‌లు రాయడం పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి ఈసెట్, పీజీఈసెట్‌ తదితర ఇంజనీరింగ్‌ సెట్‌ల ప్రశ్నపత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పేపర్‌–2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాని అభ్యర్థులు బీటెక్‌ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఏఈ నోటిఫికేషన్‌ ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: అక్టోబర్‌ 21–నవంబర్‌ 11,2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్‌ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in 

Published date : 21 Oct 2021 11:26AM

Photo Stories