NABARD Recruitment 2023: నాబార్డ్‌లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక
- నాబార్డ్లో 150 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ పోస్ట్‌లు
- ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక
- ఎంపికైతే నెలకు రూ.లక్ష వరకు స్థూల వేతనం
నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్(రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్) గ్రేడ్-ఎ హోదాలో మొత్తం 150 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. మూడంచెల ఎంపిక ప్రక్రియలో ప్రతిభ చూపి.. నియామకం ఖరారు చేసుకున్న వారికి నెలకు రూ.44,500 మూల వేతనం అందిస్తారు. ఇతర అలవెన్స్‌లు అన్ని కలిపి నెలకు రూ.లక్ష స్థూల వేతనం లభిస్తుంది.
అర్హతలు
పోస్ట్‌ను అనుసరించి 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/బీటెక్ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌తో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు
సెప్టెంబర్ 1, 2023 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌సీ/ఎస్‌టీలకు అయిదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
మూడు దశల ఎంపిక ప్రక్రియ
నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్స్ గ్రేడ్-ఎ నియామకాలకు మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ.
ప్రిలిమ్స్ 200 మార్కులు
ఎంపిక ప్రక్రియలో తొలిదశ ప్రిలిమ్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు-20 మార్కులు, డెసిషిన్ మేకింగ్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఎకనామిక్ అండ్∙సోషల్ ఇష్యూస్ 40 ప్రశ్నలు -40 మార్కులు, అగ్రిలక్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ 40 ప్రశ్నలు-40 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం 120 నిమిషాలు.
చదవండి: 2000 PO Jobs in SBI: ఎస్‌బీఐలో పీఓ కొలువులు.. సిలబస్‌పై విశ్లేషణ
జనరలిస్ట్.. స్పెషలిస్ట్‌లకు వేర్వేరుగా
ఎంపిక ప్రక్రియలో రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్. ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు 25 మందిని చొప్పున(1:25 నిష్పత్తిలో) మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష జనరలిస్ట్ పోస్ట్‌లకు, స్పెషలిస్ట్ పోస్ట్‌లకు వేర్వేరుగా ఉంటుంది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానాల్లో నిర్వహిస్తారు.
200 మార్కులకు జనరలిస్ట్ మెయిన్
- జనరలిస్ట్ మెయిన్ ఎగ్జామ్ రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్-1లో జనరల్ ఇంగ్లిష్‌లో 3 ప్రశ్నలు(100 మార్కులు) అడుగుతారు. వీటికి డిస్క్రిప్టివ్ విధానంలో కంప్యూటర్‌పై సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- పేపర్-2లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. 30 ప్రశ్నలు(50 మార్కులు) ఆబ్జెక్టివ్ విధానంలో, ఆరు ప్రశ్నలు(90 మార్కులు) డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి.
- డిస్ట్రిప్టివ్ విధానంలోని ఆరు ప్రశ్నల్లో కనీసం నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్షకు లభించే సమయం మూడున్నర గంటలు.
స్పెషలిస్ట్ పోస్ట్‌లకు ఇలా
- స్పెషలిస్ట్ పోస్ట్‌లకు కూడా రెండు పేపర్లుగా(పేపర్-1, పేపర్-2) పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో..జనరల్ ఇంగ్లిష్‌లో 3 ప్రశ్నలు(100 మార్కులు) ఉంటాయి. వీటికి డిస్క్రిప్టివ్ విధానంలో కంప్యూటర్‌పై సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
- పేపర్-2లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌పై 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు(50 మార్కులు), ఆరు డిస్క్రిప్టివ్ ప్రశ్నలు(50 మార్కులు) అడుగుతారు. డిస్క్రిప్టివ్ ప్రశ్నల్లో కనీసం నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మొత్తంగా 200 మార్కులకు స్పెషలిస్ట్ పోస్ట్‌లకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
తుది దశ ఇంటర్వ్యూ
ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు జరుగుతుంది. మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని(1:3 నిష్పత్తిలో) చొప్పున ఎంపిక చేసి.. వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపి తుది విజేతలుగా నిలిస్తే నియామకం ఖరారు చేస్తారు.
చదవండి: NABARD Recruitment 2023: నాబార్డ్లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ప్రిపరేషన్ పక్కాగా
ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్
ఈ విభాగంలో రాణించేందుకు భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం, గ్లోబలైజేషన్, ఆర్థిక సంస్కరణలు, ద్రవ్యోల్బణం, పేదరిక నిర్మూలన-ఉపాధి కల్పన, దీనికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, జనాభా వృద్ధి; వ్యవసాయం-ప్రస్తుత పరిస్థితులు, సంస్థాగత మార్పులు,సాంకేతిక మార్పులు, ఆహార భద్రత సమస్యలు,ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనేజేషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. సోషల్ ఇష్యూస్‌కు సంబంధించి సామాజిక వ్యవస్థ, బహుళ సంస్కృతి విధానం, పట్టణీకరణ, వలసలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, పర్యావరణం, నిరక్షరాస్యత -సామాజిక, ఆర్థిక సమస్యలు, సామాజిక న్యాయం, సామాజిక ఉద్యమాలు, భారత రాజకీయ వ్యవస్థ, మానవాభివృద్ధి తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్
వ్యవసాయం, పంటల వర్గీకరణ, ఆగ్రో క్లైమేటిక్ జోన్స్, సాగు పద్ధతులు, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్, వాటర్ రిసోర్స్, ఫార్మ్ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్, యానిమల్ హజ్బెండరీ, పౌల్ట్రీ ఇండస్ట్రీ, ఫారెస్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ విస్తరణ, పర్యావరణం-మార్పులు తదితర అన్ని అంశాలను అధ్యయనం చేయాలి. రూరల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి గ్రామీణ ప్రాంత భావనలు, భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వరూపం-ప్రాధాన్యం; ఆర్థిక, సామాజిక, భౌగోళిక అంశాల్లో గ్రామీణ విభాగం ప్రాధాన్యత, గ్రామీణ జనాభా, పంచాయతీ రాజ్ సంస్థలు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.
మిగిలిన విభాగాలకు ఇలా
- రీజనింగ్‌లో.. సిరీస్, అనాలజీ, కోడింగ్-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో.. బేసిక్ గ్రామర్‌తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్లు, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది.
- కంప్యూటర్ నాలెడ్జ్‌కు సంబంధించి బేసిక్ కంప్యూటర్ ఆపేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ టెర్మినాలజీ, బేసిక్ హార్డ్‌వేర్స్(సీపీయూ, మానిటర్)ల గురించి తెలుసుకోవాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో..స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్,పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్,ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
- జనరల్ అవేర్‌నెస్‌లో రాణించాలంటే.. ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో పరిణామాలు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2023
- ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ: అక్టోబర్ 16, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nabard.org/
- ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in/nabardaug23/
Qualification | GRADUATE |
Last Date | September 23,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |