Skip to main content

8106 Jobs In IBPS RRB: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌

ibps rrb 2022 notification details and preparation Tips

బ్యాచిలర్‌ డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేశారా.. ప్రభుత్వరంగ బ్యాంకులో కొలువు కోరుకుంటున్నారా.. మీకు సమీప ప్రాంతాల్లోనే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..! అయితే.. మీ ముందుకు చక్కటి అవకాశం వచ్చింది..అదే ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ–11 రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ!! దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నియామకాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌).. తాజాగా పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో.. 8వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆఫీస్‌ అసిస్టెంట్‌ నుంచి ఆఫీసర్‌ స్కేల్‌–3 వరకూ.. పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌... 

  • ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ–11 నోటిఫికేషన్‌ విడుదల
  • వివిధ హోదాల్లో 8వేలకు పైగా పోస్ట్‌ల భర్తీ
  • డిగ్రీ, ఎంబీఏ, సీఏ, తదితర కోర్సుల ఉత్తీర్ణులు అర్హులు 
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక 
  • మొదలైన దరఖాస్తు ప్రక్రియ

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌.. ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో పోస్ట్‌ల భర్తీకి చేపట్టే ఎంపిక ప్రక్రియనే ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ(కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ఫర్‌ రీజనల్‌ రూరల్‌ బ్యాంక్స్‌) గా పేర్కొంటున్నారు. తాజాగా ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీస్‌–11 పేరుతో మల్టీపర్పస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌–1, స్కేల్‌–2, స్కేల్‌–3 పోస్ట్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం 8106 పోస్ట్‌లు

 ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకుల్లో పలు హోదాలు, విభాగాల్లో మొత్తం 8,106 పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో తెలుగు రాష్ట్రాల్లో..ఆంధ్రప్రదేశ్‌లో అన్ని హోదాల్లో కలిపి 187, తెలంగాణలో 620 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ పోస్టుల వివరాలు.. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): 4483; ఆఫీసర్‌ స్కేల్‌–1: 2,676; ఆఫీసర్‌ స్కేల్‌–2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 12; ఆఫీసర్‌ స్కేల్‌–2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 6; ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 10; ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 18; ఆఫీసర్‌ స్కేల్‌–2(సీఏ): 19; ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 57; ఆఫీసర్‌ స్కేల్‌–2(జనరల్‌ బ్యాంకింగ్‌): 745; ఆఫీసర్‌ స్కేల్‌–3: 80

అర్హతలు

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీ పర్పస్‌): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. దాంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
    వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • ఆఫీసర్‌ స్కేల్‌1(అసిస్టెంట్‌ మేనేజర్‌): బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. దాంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్‌ స్కేల్‌–2(జనరల్‌ బ్యాంకింగ్‌):  కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఆఫీసర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 21–32ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్‌ స్కేల్‌ 2(స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌): ఇందులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చార్టర్డ్‌ అకౌంటెంట్, లా ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులను అనుసరించి ఎలక్టాన్రిక్స్‌ /కమ్యూనికేషన్‌ /కంప్యూటర్‌ సైన్స్‌ /ఇన్ఫరేషన్‌ టెక్నాలజీ/సీఏ/లా/ఎంబీఏ/అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌ /డెయిరీ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ/ఫారెస్ట్రీ/వెటర్నరీ సైన్స్‌/అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌/పిసీ కల్చర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
    వయసు: 21–32ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఫీసర్‌ స్కేల్‌–3: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్‌ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అయిదేళ్ల పని అనుభవం కూడా ఉండాలి.
    వయసు: 21–40 ఏళ్ల మధ్య ఉండాలి.
  • రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎస్సీ/ఎస్టీలు ఐదేళ్లు, ఓబీసీలు మూడేళ్లు వయో సడలింపు పొందొచ్చు.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. వీరు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ నాటికి సంబంధిత సర్టిఫికెట్లు పొందాలి.

ఎంపిక ప్రక్రియ

ఆఫీస్‌ అసిస్టెంట్, ఆఫీసర్‌ స్కేల్‌–1 పోస్ట్‌లకు రెండు దశల రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్‌) ఉంటుంది. ఆఫీస్‌ అసిస్టెంట్‌లకు మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫీసర్స్‌ స్కేల్‌ –1 పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.  ఆఫీసర్‌ స్కేల్‌–2, స్కేల్‌ 3లకు మాత్రం ఒక రాత పరీక్ష.. అందులో ప్రతిభ ఆధారంగా నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ విధానం అమలు చేస్తోంది.

Competitive Exams: సివిల్స్, బ్యాంక్స్.. ఇలా.. ప‌రీక్షలు ఏవైనా.. జనరల్‌ స్టడీస్‌లో రాణిస్తేనే విజయం..

రాత పరీక్ష విధానం ఇలా

  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌), ఆఫీసర్‌ స్కేల్‌–1కు సంబంధించి రెండు దశల రాత పరీక్షల నిర్వహిస్తారు. 
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌.. ప్రిలిమ్స్‌: ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీ పర్పస్‌) ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), న్యూమరికల్‌ ఎబిలిటీ(40 ప్రశ్నలు–40 మార్కులు) విభాగాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌ రాసేందుకు అనుమతి లభిస్తుంది.
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌.. మెయిన్‌: ఆఫీస్‌ అసిస్టెంట్‌ ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులకు రెండో దశలో మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. 
  • రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెయిన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

ఆఫీసర్‌ స్కేల్‌–1 ప్రిలిమినరీ పరీక్ష

  • ఆఫీసర్‌ స్కేల్‌–1 ప్రిలిమినరీ పరీక్ష.. ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులకు చొప్పున మొత్తం 80 ప్రశ్నలు–80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్‌కు అనుమతిస్తారు.
  • ఆఫీసర్‌ స్కేల్‌–1 మెయిన్‌: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని రెండో దశలో మెయిన్‌ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో రీజనింగ్‌ 40 ప్రశ్నలు–50మార్కులు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ 40 ప్రశ్నలు–20 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–50 మార్కులు చొప్పున ఇలా మొత్తం 200 మార్కులకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజ్‌లకు సంబంధించి ఏదో ఒక దాన్నే ఎంచుకోవాలి. మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున తుది దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

ఆఫీసర్‌ స్కేల్‌–2,3.. ఒకే రాత పరీక్ష

  • ఆఫీసర్‌ స్కేల్‌–2(జనరలిస్ట్, స్పెషలిస్ట్‌),ఆఫీసర్‌ స్కేల్‌–3 పోస్టులకు సింగిల్‌ లెవెల్‌ పరీక్ష పేరుతో ఒకే రాత పరీక్ష నిర్వహిస్తారు. 
  • ఆఫీసర్‌(జనరల్‌ బ్యాంకింగ్‌) పోస్ట్‌లకు రీజనింగ్‌(40 ప్రశ్నలు–50 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు–20 మార్కులు), ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌/హిందీ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌(40 ప్రశ్నలు–50 మార్కులు) విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • ఆఫీసర్‌ స్కేల్‌–2(స్పెషలిస్ట్‌ కేటగిరీ) పోస్ట్‌లకు ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (40 ప్రశ్నలు–40 మార్కులు), రీజనింగ్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), ఇంగ్లిష్‌/హిందీ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు–20 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు–20 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌(40 ప్రశ్నలు–40 మార్కులు) విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
  • ఆఫీసర్‌ స్కేల్‌–3 పోస్ట్‌లకు రీజనింగ్‌(40 ప్రశ్నలు–50 మార్కులు), కంప్యూటర్‌ నాలెడ్జ్‌(40 ప్రశ్నలు–20 మార్కులు), ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), ఇంగ్లిష్‌/హిందీ లాంగ్వేజ్‌(40 ప్రశ్నలు–40 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌(40 ప్రశ్నలు–50 మార్కులు) విభాగాల్లో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. 
  • అన్ని పోస్ట్‌లకు సంబంధించి పరీక్షలు ఆబ్జెక్టివ్‌ విధానంలోనే జరుగుతాయి.
  • రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:3 నిష్పత్తిలో(ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని చొప్పున) చివరి దశ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

IBPS Jobs: త్వరలో క్లర్క్, ఎస్‌వో పోస్టులకు పరీక్షలు.. సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్ వివ‌రాలు ఇలా..

విజయం సాధించాలంటే

  • రీజనింగ్‌: కోడింగ్, డీకోడింగ్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, పజిల్స్, ఇన్‌–ఈక్వాలిటీస్, ఆల్ఫాబెటికల్‌ సీక్వెన్సెస్, సిలాజిజమ్స్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్స్, స్టేట్‌మెంట్స్, కాజ్‌ అండ్‌ ఎఫెక్ట్, ఇన్‌పుట్‌–అవుట్‌పుట్స్‌ తదితర అంశాలపై దృష్టిపెట్టాలి. 
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్, సెంటెన్స్‌ కరెక్షన్స్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్, యాంటానిమ్స్, సినానిమ్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా తెలుగు విద్యార్థులు ఏదైనా ఇంగ్లిష్‌ పత్రికను రోజూ చదువుతూ రీడింగ్‌ వేగం పెంచుకోవడంతోపాటు వొకాబ్యులరీని మెరుగుపరచుకోవచ్చు.
  • జనరల్‌ అవేర్‌నెస్‌: కరెంట్‌ అఫైర్స్, దేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగంలో పరిణామాలు, మానిటరీ పాలసీ, రుణాలు, వడ్డీ రేట్లు, ఫైనాన్స్‌ రంగ అంశాలపై అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇటీవల చర్చనీయాంశాలు, ముఖ్యమైన ఘటనలు, తేదీలు, వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. 
  • క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌/డేటా ఇంటర్‌ప్రిటేషన్‌: అర్థమెటిక్‌ అంశాలు, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటాఇంటర్‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్‌ అంశాలను అధ్యయనం చేయాలి. చదవడంతోపాటు వేగంగా సమాధానం గుర్తించేలా ప్రాక్టీస్‌ చేయాలి. వేగం, కచ్చితత్వంతోనే మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
  • ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌: ఈ విభాగంలో రాణించాలంటే.. అభ్యర్థులు తమ అకడమిక్‌ అర్హతలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
  • కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఈ విభాగంలో రాణించడానికి కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (కీ బోర్డ్‌ షార్ట్‌ కట్స్, ఎంఎస్‌ ఆఫీస్, ఎంఎస్‌ ఎక్సెల్, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ తదితర అంశాలు)పై అవగాహన ఏర్పరచుకోవాలి. 
  • ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: తాజా బ్యాంకింగ్‌ రంగ పరిణామాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థ విధానాలు, ఆర్థిక రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.

ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ–11 ముఖ్యాంశాలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 27.06.2022
  • ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్ట్‌ 2022
  • మెయిన్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ibps.in
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://www.ibps.in/crprrbxi

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా-ఉద్యోగ‌ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Qualification GRADUATE
Last Date June 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories